AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

PM Modi Hyderabad Visit: ఇవాళ హైదరాబాద్‌కు ప్రధాని మోడీ.. బీజేపీ వర్సెస్ బీఆర్ఎస్.. మాటల యుద్ధం..

ప్రధానమంత్రి నరేంద్రమోదీ ఇవాళ హైదరాబాద్‌కు రానుండటంతో.. తెలంగాణలో పొలిటికల్ అట్మాస్పియర్‌ ఒక్కసారిగా మారిపోయింది. ఆరోపణలు, ప్రత్యారోపణలతో బీఆర్ఎస్– బీజేపీ మధ్య మాటల యుద్దం నడుస్తుండటంతో రాజకీయ వేడి రాజుకుంది.

PM Modi Hyderabad Visit: ఇవాళ హైదరాబాద్‌కు ప్రధాని మోడీ.. బీజేపీ వర్సెస్ బీఆర్ఎస్.. మాటల యుద్ధం..
Pm Modi
Shaik Madar Saheb
| Edited By: Ravi Kiran|

Updated on: Apr 08, 2023 | 11:15 AM

Share

ప్రధానమంత్రి నరేంద్రమోదీ ఇవాళ హైదరాబాద్‌కు రానుండటంతో.. తెలంగాణలో పొలిటికల్ అట్మాస్పియర్‌ ఒక్కసారిగా మారిపోయింది. ఆరోపణలు, ప్రత్యారోపణలతో బీఆర్ఎస్– బీజేపీ మధ్య మాటల యుద్దం నడుస్తుండటంతో రాజకీయ వేడి రాజుకుంది. పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాల్లో పాల్గొననున్న మోదీ.. పరేడ్ గ్రౌండ్స్ బహిరంగ సభలో ప్రధాని మోడీ ఏం మాట్లాడబోతున్నారు? అభివృద్ధి ముచ్చట్లకే పరిమితమవుతారా? రాజకీయ విమర్శలు ఎక్కుపెడతారా? ఇప్పుడిదే హాట్‌ టాపిక్‌గా మారింది.

అయితే, తెలంగాణలో అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం సహకరించడం లేదని బీజేపీ నేతలు అంటుంటే.. రాష్ట్ర అభివృద్ధికి కేంద్రమే సరిగ్గా నిధులు ఇవ్వడం లేదని బీఆర్ఎస్ నేతలు ఆరోపిస్తున్నారు.ఈ పరస్పర ఆరోపణలు, విమర్శలతో ఇప్పటికే కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల మధ్య వార్ నడుస్తోంది. దీంతో, ఇవాళ్టి ప్రధాని నరేంద్రమోడీ రాష్ట్ర పర్యటనకు బీఆర్‌ఎస్‌ ప్రభుత్వ పెద్దలు దూరంగా ఉండాలని డిసైడైయ్యారు.

రూ.720 కోట్లతో సికింద్రాబాద్‌ రైల్వేస్టేషన్‌ పునరుద్ధరణ..

720కోట్ల రూపాయలతో కేంద్రం చేపట్టిన సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ పునరుద్ధరణ పనులకు ఇవాళ ప్రధాని నరేంద్రమోడీ.. శంకుస్థాపన చేయనున్నారు. బీబీనగర్ ఎయిమ్స్‌లో ఆధునిక భవనాల నిర్మాణాలకూ.. పరేడ్‌గ్రౌండ్ నుంచే శంకుస్థాపన చేయనున్నారు. వాటి నమూనాలను కూడా అక్కడే పరిశీలిస్తారు.అంతకుముందు సికింద్రాబాద్ రైల్వే స్టేషన్‌ నుంచి హైదరాబాద్ –తిరుపతి మధ్య వందే భారత్ ఎక్స్ ప్రెస్ రైలును ప్రారంభిస్తారు మోదీ. 13 ఎంఎంటీఎస్ రైలు సేవలను వర్చువల్‌గా ప్రారంభించనున్న ప్రధాని… దాదాపుగా 2గంటల పాటు హైదరాబాద్‌లో గడపనున్నారు.

ఇవి కూడా చదవండి

ఉ.11.30కు బేగంపేట ఎయిర్‌పోర్టుకు ప్రధాని మోదీ

శనివారం ఉదయం 11.30 గంటలకు బేగంపేట ఎయిర్ పోర్టుకు చేరుకోనున్న ప్రధాని.. మధ్యాహ్నం ఒకటిన్నరకు ఢిల్లీకి తిరుగుపయనం కానున్నారు. ఉదయం 11.45 నుంచి 12 గంటల 5 నిమిషాల మధ్య సికింద్రాబాద్ రైల్వే స్టేషన్‌ పునరుద్ధరణ కోసం శంకుస్థాపన.. ఆ తర్వాత మధ్యాహ్నం 12 గంటల 15 నిమిషాల నుంచి ఒంటి గంట 20 నిమిషాల మధ్య పరేడ్ గ్రౌండ్ లో జరిగే శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాల్లో పాల్గొంటారు మోదీ. అనంతరం జరిగే బహిరంగసభలో ప్రసంగిస్తారు.

సింగరేణిపై క్లారిటీ ఇస్తారా?

తెలంగాణ అభివృద్ధి కోసం ఇప్పటివరకూ కేంద్రం చేసిన సాయాన్ని.. ఈ సభలో మోదీ వివరించే అవకాశం ఉంది. తెలంగాణ ప్రభుత్వ సహాయనిరాకరణను కూడా… ప్రజలకు స్వయంగా ప్రదాని తెలియజెప్పే ఛాన్సుందని బీజేపీ వర్గాలు చెబుతున్నాయ్‌. సింగరేణిని కేంద్రం ప్రైవేటు పరం చేయబోతోందంటూ బీఆర్ఎస్ నిరసనకార్యక్రమాలకు పిలుపునిచ్చిన వేళ… ఈ అంశంపైనా ప్రధాని క్లారిటీ అవకాశం లేకపోలేదంటున్నారు. సింగరేణి విషయంలో ఇప్పటికే బీజేపీ నేతలు బీఆర్‌ఎస్‌పై ఎదురుదాడి చేస్తున్నారు.

వ్యాక్సినేషన్‌పైనా మోదీ స్పష్టతనిచ్చే ఛాన్స్‌!

కోవిడ్ వ్యాక్సిన్ల సరఫరాను కేంద్రం నిలిపివేసిందంటూ… బీఆర్‌ఎస్‌ ఆరోపణలు గుప్పిస్తున్న వేళ.. దీనికి కూడా బహిరంగ వేదిక మీదే ప్రధాని కౌంటరిచ్చే అవకాశం ఉంది. పరేడ్ గ్రౌండ్ లో నిర్వహించే సభ అధికారిక కార్యక్రమమే అయినప్పటికీ… బీజేపీ భారీస్థాయిలో జనసమీకరణ చేస్తోంది. నగర శివారు ప్రాంతాల నుంచి జనాన్ని తరలించి.. సభను గ్రాండ్‌ సక్సెస్ చేయడంపై కమలనాథులు ఫోకస్‌ పెట్టారు. మరి, ఈ సభలో సీఎం కేసీఆర్‌పై మోదీ డైరెక్టుగా విమర్శనాస్త్రాలు సంధిస్తారా? ఇండైరెక్ట్‌ కామెంట్స్ చేస్తారా ? తాజా రాజకీయ పరిస్థితులపై అసలు ప్రధాని ఎలా స్పందిస్తారన్నది ఆసక్తి రేపుతోంది.

మరిన్ని జాతీయ వార్తల కోసం..