Traffic Restrictions: హైదరాబాదీలకు అలెర్ట్‌.. నేడు నగరంలో ట్రాఫిక్‌ ఆంక్షలు.. పూర్తి వివరాలివే

శనివారం ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 2.30 గంటల వరకు పలు ప్రాంతాల్లో ట్రాఫిక్‌ ఆంక్షలు, మళ్లింపులు అమలు చేయనున్నారు. నగరవాసులు ఈ విషయాన్ని దృష్టిలో ఉంచుకుని తమకు సహకరించాలని పోలీసులు కోరుతున్నారు.

Traffic Restrictions: హైదరాబాదీలకు అలెర్ట్‌.. నేడు నగరంలో ట్రాఫిక్‌ ఆంక్షలు.. పూర్తి వివరాలివే
Traffic Restrictions
Follow us
Basha Shek

|

Updated on: Apr 08, 2023 | 12:46 PM

ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఇవాళ (ఏప్రిల్‌8 ) హైదరాబాద్‌కు రానున్నారు. బేగంపేట, సికింద్రాబాద్‌ రైల్వేస్టేషన్‌, పరేడ్‌గ్రౌండ్స్‌లో జరిగే వివిధ కార్యక్రమాల్లో మోడీ పాల్గొననున్నారు. ఈ నేపథ్యంలో శనివారం ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 2.30 గంటల వరకు పలు ప్రాంతాల్లో ట్రాఫిక్‌ ఆంక్షలు, మళ్లింపులు అమలు చేయనున్నారు. నగరవాసులు ఈ విషయాన్ని దృష్టిలో ఉంచుకుని తమకు సహకరించాలని పోలీసులు కోరుతున్నారు. ప్రధాని పర్యటించే మోనప్ప (రాజీవ్ గాంధీ విగ్రహం), గ్రీన్‌లాండ్స్, ప్రకాశ్‌నగర్, రసూల్‌పురా, సీటీవో ప్లాజా, ఎస్‌బీహెచ్, వైఎంసీఏ, సెయింట్ జాన్ రోటరీ, సంగీత్ క్రాస్‌రోడ్, ఆలుగడ్డ బావి, మెట్టుగూడ, చిలకలగూడ, బ్రూక్ బాండ్, టివోలి, బాలమ్రాయ్, స్వీకర్ ఉపకార్, సికింద్రాబాద్ క్లబ్, తిరుమలగిరి, తాడ్‌బండ్, సెంట్రల్ పాయింట్ మార్గాల్లో కఠినమైన ట్రాఫిక్‌ ఆంక్షలు ఉంటాయని ఈ ప్రాంతాల్లో ప్రయాణం చేయవద్దని పోలీసులు సూచిస్తున్నరు. ఇక టివోలీ జంక్షన్‌ నుంచి ప్లాజా జంక్షన్‌, ఎస్బీహెచ్‌ ఎక్స్‌రోడ్స్‌ నుంచి స్వీకార్‌ ఉప్‌కార్‌ జంక్షన్‌ మధ్య మార్గాన్ని పూర్తిగా మూసి ఉంచుతారు. అలాగే సికింద్రాబాద్‌ రైల్వేస్టేషన్‌కు వచ్చే ప్రయాణికులు వీలైనంత త్వరగా చేరుకోవావాలి.

ట్రాఫిక్‌ ఆంక్షలిలా..

  • చిలకల గూడ, సెయింట్‌ జాన్స్‌ రోటరీ, సంగీత్‌ జంక్షన్‌, రేతిఫైల్‌ టీ జంక్షన్ల నుంచి వచ్చే ప్రయాణికుల వాహనాలను అనుమతించరు. ప్రయాణికులు క్లాక్‌ టవర్‌ పాస్‌పోర్టు ఆఫీస్‌, రెజిమెంటల్‌ బజార్‌ మార్గం మీదుగా సికింద్రాబాద్‌ స్టేషన్‌ మెయిన్‌ గేట్‌ వద్దకు చేరుకోవాల్సి ఉంటుంది.
  • కరీంనగర్‌ వైపు నుంచి రాజీవ్‌ రహదారి మీదుగా సికింద్రాబాద్‌ నగరంలోకి వచ్చే వారు ఓఆర్‌ఆర్‌ మీదుగా దిగి కొంపల్లి, సుచిత్ర, బాలానగర్‌, మూసాపేట్‌, ఎర్రగడ్డ, ఎస్‌ఆర్‌నగర్‌, అమీర్‌పేట్‌ మీదుగా నగరంలోని ఆయా ప్రాంతాలకు చేరుకోవాల్సి ఉంటుంది.
  • కీసర ఓఆర్‌ఆర్‌ గేట్‌ నుంచి ఈసీఐఎల్‌, మౌలాలీ, నాచారం, ఉప్పల్‌ మీదుగా నగరంలోని ఆయా ప్రాంతాలకు చేరుకోవాల్సి ఉంటుంది.
  • తిరుమలగిరి క్రాస్‌రోడ్డు వద్ద నుంచి ఎడమవైపు తీసుకొని ఏఎస్‌రావునగర్‌, ఈసీఐఎల్‌, మౌలాలీ, తార్నాక నుంచి సిటీలోని ఆయా ప్రాంతాలకు వెళ్లాలి.
  • కరీంనగర్‌ వైపు రాకపోకలు సాగించే వారు తిరుమలగిరి క్రాస్‌రోడ్స్‌, జేబీఎస్‌ రూట్లలో వెళ్లకుండా ఓఆర్‌ఆర్‌పై నుంచి వెళ్లాలని పోలీసులు సూచించారు.
  • ఇక  కరీంనగర్‌ మార్గం నుంచి వచ్చే బస్సులు దోబీఘాట్‌ వద్ద నిలపాల్సి ఉంటుంది. ఆదిలాబాద్‌, నిర్మల్‌, మెదక్‌, సంగారెడ్డి వైపు నుంచి వచ్చే వాహనాలు బైసన్‌ పోలో గ్రౌండ్స్, రంగారెడ్డి, కర్నూల్‌, అచ్చంపేట్‌, నల్గొండ, ఖమ్మం, సూర్యపేట్‌, వరంగల్‌, యాదాద్రి రూట్‌లో వచ్చే వారు ఆర్‌ఆర్‌సీ గ్రౌండ్‌లో పార్కు చేయాలి.
  • రాజీవ్‌ రహదారి వైపు నుంచి వచ్చే వాహనాలను కంటోన్మెంట్‌ పార్కు గ్రౌండ్‌, పికెట్‌ డిపో ప్రాంగణంలో, అలాగే రంగారెడ్డి, మహబూబ్‌నగర్‌, వికారాబాద్‌ జిల్లాల నుంచి వచ్చే వాహనాలను నెక్లెస్‌ రోడ్డులో పార్కు చేయాలి.

ఎస్‌ఐ పరీక్ష అభ్యర్థులకు సూచనలు..

కాగా ఇవాళ తెలంగాణలో ఎస్సై, ఏఎస్సై ఉద్యోగాలకు సంబంధించిన పరీక్షలు జరగనున్నాయి. ప్రధాని నరేంద్రమోడీ పర్యటన ఉన్నందున ఎస్‌ఐ పరీక్షకు వెళ్లే అభ్యర్థులకు డీజీపీ అంజనీ కుమార్‌ పలు సూచనలు చేశారు. నగరంలో ట్రాఫిక్‌ ఆంక్షలు అమల్లో ఉంటాయని, అభ్యర్థులు ముందుగానే పరీక్షా కేంద్రాలకు చేరుకోవాలని సూచించారు. ముఖ్యంగా సికింద్రాబాద్‌ ప్రాంతంలో కొన్ని రోడ్లు మూసివేస్తారని, కాబట్టి 2 గంటలు ముందే పరీక్షా కేంద్రానికి చేరుకోవాలని ఆయన సూచించారు.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం క్లిక్ చేయండి..

ఇవి కూడా చదవండి