Ranga Maarthaanda: ఓటీటీలోకి వచ్చేసిన ప్రకాశ్‌రాజ్, బ్రహ్మానందంల ఎమోషనల్ డ్రామా.. ‘రంగమార్తాండ’ ను ఎక్కడ చూడొచ్చంటే?
క్రియేటివ్ డైరెక్టర్ కృష్ణవంశీ సుమారు ఆరేళ్ల గ్యాప్ తర్వాత తెరకెక్కించిన చిత్రం రంగమార్తాండ. మలయాళం సూపర్ హిట్ మూవీ నటసామ్రాట్ రీమేక్‌గా తెరకెక్కిన ఈ సినిమాలో ప్రకాశ్‌రాజ్, రమ్యకృష్ణ, బ్రహ్మానందం, రాహుల్ సిప్లీగంజ్, శివాత్మిక రాజశేఖర్, అనసూయ, ఆదర్శ్ బాలకృష్ణ తదితరులు కీలక పాత్రలు పోషించారు.
క్రియేటివ్ డైరెక్టర్ కృష్ణవంశీ సుమారు ఆరేళ్ల గ్యాప్ తర్వాత తెరకెక్కించిన చిత్రం రంగమార్తాండ. మలయాళం సూపర్ హిట్ మూవీ నటసామ్రాట్ రీమేక్‌గా తెరకెక్కిన ఈ సినిమాలో ప్రకాశ్‌రాజ్, రమ్యకృష్ణ, బ్రహ్మానందం, రాహుల్ సిప్లీగంజ్, శివాత్మిక రాజశేఖర్, అనసూయ, ఆదర్శ్ బాలకృష్ణ తదితరులు కీలక పాత్రల్లో నటించారు. ఇళయరాజా సంగీత సారథ్యంలో రూపుదిద్దుకున్న ఈ చిత్రం మార్చి 22న గ్రాండ్‌గా థియేటర్లలో విడుదలైంది. తల్లిదండ్రులు, పిల్లల మధ్య ఉండే అనుబంధాన్ని ఎలివేట్ చేస్తూ ఎంతో హృద్యంగా తెరకెక్కిన రంగమార్తాండ విమర్శకుల ప్రశంసలతో పాటు ప్రేక్షకుల ఆదరణ దక్కించుకుంది. ముఖ్యంగా ఇప్పటివరకు తన కామెడీతో కడుపుబ్బా నవ్వించిన బ్రహ్మానందం ఇందులో సీరియస్ పాత్రలో డిఫరెంట్ లుక్‌లో కనిపించాడు. సినిమాలో ఆయన పోషించిన చక్రపాణి పాత్ర అందరినీ కంటతడి పెట్టించింది. ఇక మెగాస్టార్ చిరంజీవి లాంటి పలువురు ప్రముఖులు సైతం ఈ సినిమాను చూసి తమ అభిప్రాయాలను పంచుకున్నారు. చాలా రోజుల తర్వాత కృష్ణవంశీ మంచి ఎమోషనల్ కంటెంట్‌తో కూడిన సినిమాను తీసారని ప్రశంసలు కురిపంచారు. ఇలా థియేటర్లలో పాజిటివ్ టాక్ సొంతం చేసుకున్న రంగమార్తాండ ఎలాంటి ప్రచారం లేకుండా సైలెంట్‌గా ఓటీటీలోకి వచ్చేసింది. ప్రముఖ స్ట్రీమింగ్ ప్లాట్‌ఫామ్ అమెజాన్ ప్రైమ్ వేదికగా ఇవాల్టి నుంచి ఈ సినిమా స్ట్రీమింగ్ అవుతోంది.
కాగా భారీ తారాగణంతో తెరకెక్కిన రంగమార్తాండ సినిమాలో మెగాస్టార్ చిరంజీవి ఓ షాయరీ ఆలపించడం విశేషం. అలాగే ఈ సినిమా చూసిన తర్వాత బ్రహ్మనందాన్ని ఘనంగా సన్మానించారు చిరంజీవి, రామ్‌చరణ్. మరి థియేటర్లలో రంగమార్తాండను మిస్ అయిన వారె ఎంచెక్కా ఓటీటీలో చూసి ఎంజాయ్ చేయండి.
Telugu film #Rangamarthanda is now streaming on Amazon Prime. pic.twitter.com/H5LKz7j2Zh
— Streaming Updates (@OTTSandeep) April 7, 2023
మరిన్ని సినిమా వార్తల కోసం క్లిక్ చేయండి..