AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Niharika: పుల్లటి మామిడికాయలు తింటూ మెగా డాటర్‌ పోజులు.. నెట్టింట్లో వైరల్‌గా నిహారిక పోస్ట్‌

కొన్ని రోజులుగా సోషల్‌ మీడియాకు కాస్త దూరంగా ఉంటోంది నిహారిక. అయితే ఇటీవల మళ్లీ యాక్టివ్‌గా మారింది. తన లేటెస్ట్‌ ఫొటోలతో పాటు తన ప్రాజెక్ట్స్‌ గురించి అందులో అప్‌డేట్‌ ఇస్తోంది. మొన్నటికి మొన్న రెడ్ కలర్ లంగా వోణి, ముక్కుకు ముక్కెర పెట్టుకొని ఫొటోషూట్ చేసి ఫ్యాన్స్‌కు గ్లామర్‌ ట్రీట్‌ ఇచ్చిన నిహారిక

Niharika: పుల్లటి మామిడికాయలు తింటూ మెగా డాటర్‌ పోజులు.. నెట్టింట్లో వైరల్‌గా నిహారిక పోస్ట్‌
Niharika Konidela
Basha Shek
|

Updated on: Apr 06, 2023 | 5:55 AM

Share

మెగా డాటర్‌ నిహారిక కొణిదెలపేరు ఇటీవల తరచుగా వినిపిస్తోంది. భర్త జొన్నలగడ్డ చైతన్యతో ఆమెకు సొగసడం లేదని, అందుకే విడాకులు తీసుకుంటుందని ప్రచారం సాగుతోంది. చైతన్య కూడా తన ఇన్‌స్టాగ్రామ్‌లో నిహారిక ఫొటోలు డిలీట్‌ చేయడం తీవ్ర చర్చనీయాంశమైంది. అయితే మెగా డాటర్‌ విడాకుల వ్యవహారంపై అటు నిహారిక కానీ, చైతన్య కానీ ఇప్పటివరకు స్పందించలేదు. కాగా కొన్ని రోజులుగా సోషల్‌ మీడియాకు కాస్త దూరంగా ఉంటోంది నిహారిక. అయితే ఇటీవల మళ్లీ యాక్టివ్‌గా మారింది. తన లేటెస్ట్‌ ఫొటోలతో పాటు తన ప్రాజెక్ట్స్‌ గురించి అందులో అప్‌డేట్‌ ఇస్తోంది. మొన్నటికి మొన్న రెడ్ కలర్ లంగా వోణి, ముక్కుకు ముక్కెర పెట్టుకొని ఫొటోషూట్ చేసి ఫ్యాన్స్‌కు గ్లామర్‌ ట్రీట్‌ ఇచ్చిన నిహారిక తాజాగా మరో పోస్ట్‌తో నెటిజన్లను కవ్వించింది. ఇందులో అందమైన పింక్ కలర్ చీర.. దానిపై బ్లాక్ కలర్ స్లీవ్ లెస్ బ్లౌజ్‌ తో ఎంతో బ్యూటిఫుల్‌గా కనిపించింది నిహా.

ఇదే సందర్భంలో పుల్లటి మామిడికాయ ముక్కలను తింటూ రకరకాల ఎక్స్ ప్రెషన్స్ ఇచ్చింది. ఈ ఫొటోలన్నింటినీ ఒక వీడియోలాగా తయారుచేసి ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్‌ చేసింది. ‘మామిడికాయలు లేకుండా సమ్మర్ ఏంటి’ అని ఈ పోస్ట్‌కు క్యాప్షన్‌ ఇచ్చింది. ప్రస్తుతం ఈ పోస్ట్‌ సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. ఇక ఈ వీడియో చూసిన వారందరు ‘ నిహారిక ఏమన్నా విశేషమా?’ అంటూ కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు. కాగా కెరీర్‌ ప్రారంభంలో హీరోయిన్‌గా నటించిన నిహారిక ఇప్పుడు నిర్మాతగా తన అభిరుచిని చాటుకుంటోంది. ఒక చిన్న ఫ్యామిలీ స్టోరీ, హలో వరల్డ్‌ వెబ్‌ సిరీస్‌లను నిర్మించి విజయాలు అందుకుందామె. ఇటీవలే ‘డెడ్ పిక్సెల్స్’ పేరుతో నెక్ట్స్‌ ప్రాజెక్టును కూడా అనౌన్స్‌ చేసింది.

ఇవి కూడా చదవండి

మరిన్ని సినిమా వార్తల కోసం క్లిక్ చేయండి..

థియేటర్లలో ఆడియెన్స్‌కు కన్నీళ్లు తెప్పిస్తోన్న సినిమా.. వీడియో
థియేటర్లలో ఆడియెన్స్‌కు కన్నీళ్లు తెప్పిస్తోన్న సినిమా.. వీడియో
సోషల్ మీడియాను ఊపేస్తోన్న ఫోక్ సాంగ్.. ఎన్ని కోట్ల వ్యూస్ వచ్చాయం
సోషల్ మీడియాను ఊపేస్తోన్న ఫోక్ సాంగ్.. ఎన్ని కోట్ల వ్యూస్ వచ్చాయం
2025: గూగుల్, ఇన్‌స్టాలో సంచలనం సృష్టించిన ఆ ఐదుగురు
2025: గూగుల్, ఇన్‌స్టాలో సంచలనం సృష్టించిన ఆ ఐదుగురు
19 ఏళ్లకే 8 పెళ్లిళ్లు.. పెళ్లికాని ప్రసాదులకు పిచ్చెక్కించిందిగా
19 ఏళ్లకే 8 పెళ్లిళ్లు.. పెళ్లికాని ప్రసాదులకు పిచ్చెక్కించిందిగా
సంతోషకరమైన జీవితానికి రాజమార్గం! బుద్ధుడు చెప్పిన సీక్రెట్ ఇదే
సంతోషకరమైన జీవితానికి రాజమార్గం! బుద్ధుడు చెప్పిన సీక్రెట్ ఇదే
పెళ్లైన వ్యక్తితోప్రేమాయణం.. ఆపై ఇద్దరూ ఒంటరిగా కలిశారు..
పెళ్లైన వ్యక్తితోప్రేమాయణం.. ఆపై ఇద్దరూ ఒంటరిగా కలిశారు..
రాయలసీమ గడ్డపై పందెం కోళ్లు.. పులివెందుల పుంజులకు భారీ డిమాండ్!
రాయలసీమ గడ్డపై పందెం కోళ్లు.. పులివెందుల పుంజులకు భారీ డిమాండ్!
పక్కా యాక్షన్ మోడ్‌లో రష్మిక, విజయ్‌ వీడియో
పక్కా యాక్షన్ మోడ్‌లో రష్మిక, విజయ్‌ వీడియో
పీఎఫ్ ఖాతాదారులకు భారీ ఊరట.. కేంద్రం కొత్త రూల్స్ చూశారా..
పీఎఫ్ ఖాతాదారులకు భారీ ఊరట.. కేంద్రం కొత్త రూల్స్ చూశారా..
నానితో స్టెప్పులేయనున్న క్రేజీ హీరోయిన్..
నానితో స్టెప్పులేయనున్న క్రేజీ హీరోయిన్..