Basha Shek |
Updated on: Apr 06, 2023 | 5:50 AM
టాలీవుడ్ బెస్ట్ కపుల్‌లో రాజశేఖర్- జీవితల జోడీ ఒకటి. 1991లో ప్రేమించి పెళ్లి చేసుకున్న ఈ జంటకు శివానీ, శివాత్మిక ఇద్దరు కూతుర్లు ఉన్నారు.
కాగా రాజశేఖర్- జీవితల ప్రేమకథ సినిమాకు ఏమాత్రం తీసిపోదు. సినిమాల్లో లాగే వీరి ప్రేమకథలో కూడా అనేక ట్విస్టులున్నాయి. తాజాగా ఓ షోలో పాల్గొన్న వీరిద్దరూ తమ ప్రేమకథను పంచుకున్నారు.
ఒకసారి రాజశేఖర్ నా వద్దకు వచ్చి మీరు నాపై ఇంట్రెస్ట్ చూపిస్తున్నారని అనిపిస్తోంది అని నేరుగా అడిగేశాడు. అప్పుడు ఆయనలో ఆ ఫ్రాంక్‌నెస్ బాగా నచ్చింది' అని జీవిత చెప్పుకొచ్చింది.
అయితే రాజశేఖర్ వేరే అమ్మాయిని పెళ్లి చేసుకుంటున్నాడని తెలిసి చాలా ఫీలయిందట జీవిత. తన 'ఆయనకు అప్పుడు అంబాసిడర్ కారు ఉండేది. ముందు సీట్లో ఆయన పక్కనే ఆ అమ్మాయి కూర్చుంది. నేనేమో వెనకాల కూర్చున్నాను. చాలా బాధేసింది, ఏడ్చేశాను' అని ఎమోషనలైంది జీవిత.
'పెళ్లి చేసుకోకపోయినా పర్లేదు, కానీ నాతోనే ఉంటానని తెగేసి చెప్పింది. జీవితలోని ఆ ప్రేమే నచ్చింది' అని భార్యపై ప్రేమను కురిపించారు రాజశేఖర్.