- Telugu News Photo Gallery Rumors on Music Director Devi Sri Prasad Wedding Goes Viral on Social Media
Devi Sri Prasad Marriage: పెళ్లి పీటలెక్కనున్న స్టార్ మ్యూజిక్ డైరెక్టర్ దేవీశ్రీ ప్రసాద్..? నెట్టింట గుసగుసలు..
రాక్‌స్టార్ సింగర్‌గా తెలుగు ప్రేక్షకులకు దేవీశ్రీ ప్రసాద్ సుపరిచితులే. టాలీవుడ్ టాప్ మ్యూజిక్ డైరెక్టర్స్‌లలో ఒకరిగా పేరు సంపాదించుకున్న దేవీశ్రీ.. దేవి సినిమాతో సంగీత దర్శకుడిగా ఇండస్ట్రీకి పరిచయమయ్యారు. తన కెరీరీలో ఎన్నో సూపర్ హిట్ సినిమాలకు సంగీతం అందించారు. .
Updated on: Apr 06, 2023 | 7:44 AM

రాక్‌స్టార్ సింగర్‌గా తెలుగు ప్రేక్షకులకు దేవీశ్రీ ప్రసాద్ సుపరిచితులే. టాలీవుడ్ టాప్ మ్యూజిక్ డైరెక్టర్స్‌లలో ఒకరిగా పేరు సంపాదించుకున్న దేవీశ్రీ.. దేవి సినిమాతో సంగీత దర్శకుడిగా ఇండస్ట్రీకి పరిచయమయ్యారు. తన కెరీరీలో ఎన్నో సూపర్ హిట్ సినిమాలకు సంగీతం అందించారు.

సంగీత దర్శకుడిగా దేవిశ్రీప్రసాద్ 9 ఫిల్మ్ ఫేర్ అవార్డులు, 5 సైమా అవార్డులు, ఓ నంది అవార్డు అందుకున్నారు. ‘హిట్ ఆల్బమ్’లుగా నిలిచిన చిత్రాలెన్నో డీఎస్‌పీ ఖాతాలో ఉన్నాయి.

'ఐటెమ్ సాంగ్స్’కు సంగీతం అందించడంలో దేవీశ్రీకి ప్రత్యేకమైన పేరుంది. అందుకే ఆయనను ‘కింగ్ ఆఫ్ ఐటెమ్ నంబర్స్’ అని పిలుస్తారు. ‘ఆర్య2’లోని ‘రింగ రింగ’ సాంగ్, 'ఆ అంటే అమలాపురం', 'కెవ్వుకేక', 'డియ్యాలో డియ్యాలో', ‘ఊ అంటావా మామా’.. ఈ పాటలన్నీ దేవీశ్రీ స్వరపరిచినవే.

ఇదిలా ఉంటే నాలుగు పదుల వయసు దాటినా దేవీశ్రీ ఇంకా బ్యాచిలర్‌గానే ఉన్నారు. ఈ విషయమై ప్రస్తుతం ఓ వార్త నెట్టింట వైరలవుతోంది. త్వరలోనే ఆయన ఓ ఇంటివాడు కాబోతున్నాడని, దేవిశ్రీప్రసాద్‌కు అక్షరాలా దూరపు బంధువని, వరసకి మరదలు అవుతుందనేది ఆ వార్త సారాంశం.

అంతేకాకుండా వీరిద్దరికి సుమారు 17ఏళ్ల గ్యాప్ ఉందని, కుటుంబసభ్యుల సమక్షంలో త్వరలోనే వీరి వివాహం జరగనుందనే ప్రచారం జోరందుకుంది. ఈ వార్తలో ఎంత వరకు నిజం ఉందన్నది తెలియాలంటే డీఎస్‌పీ మౌనం వీడాల్సిందే.




