Extraction 2 : డైరెక్టుగా ఓటీటీలో రిలీజ్ కానున్న ఎక్స్‌ట్రాక్ష‌న్ 2.. స్ట్రీమింగ్‌ ఎప్పుడు, ఎక్కడంటే?

క్రిస్ హేమ్స్‌వర్త్ హీరోగా 2020లో ప్రేక్షకుల ముందుకు వచ్చిన సినిమా ఎక్స్‌ట్రాక్షన్‌. మాజీ స్టంట్‌మ్యాన్ సామ్ హార్‌గ్రేవ్ దర్శకత్వం ఈ సినిమాకు వహించారు. పూర్తి యాక్షన్ డ్రామాగా రూపొందిన ఈ సినిమా నెట్‌ఫ్లిక్స్ అత్యుత్తమ ఒరిజినల్ యాక్షన్ సినిమాలలో ఒకటిగా గుర్తింపు పొందింది.

Extraction 2 : డైరెక్టుగా ఓటీటీలో రిలీజ్ కానున్న ఎక్స్‌ట్రాక్ష‌న్ 2.. స్ట్రీమింగ్‌ ఎప్పుడు, ఎక్కడంటే?
Extraction 2 Movie
Follow us

|

Updated on: Apr 05, 2023 | 5:50 AM

మార్వెల్ సినిమాలు చూసే వారికి క్రిస్ హెమ్స్‌వ‌ర్త్‌ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ముఖ్యంగా థోర్‌ క్యారెక్టర్‌తో ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్నాడీ స్టార్‌ హీరో. తెలుగులోనూ ఈ  హాలీవుడ్ హీరోకు మంచి ఫాలోయంగ్‌ ఉంది. రెగ్యులర్‌గా అతని సినిమాలు చూసేవారు చాలామందే ఉన్నారు. అలాంటి క్రిస్ హేమ్స్‌వర్త్ హీరోగా 2020లో ప్రేక్షకుల ముందుకు వచ్చిన సినిమా ఎక్స్‌ట్రాక్షన్‌. మాజీ స్టంట్‌మ్యాన్ సామ్ హార్‌గ్రేవ్ దర్శకత్వం ఈ సినిమాకు వహించారు. పూర్తి యాక్షన్ డ్రామాగా రూపొందిన ఈ సినిమా నెట్‌ఫ్లిక్స్  అత్యుత్తమ ఒరిజినల్ యాక్షన్ సినిమాలలో ఒకటిగా గుర్తింపు పొందింది. ఇప్పుడు ఈ సినిమాకు సీక్వెల్ రాబోతుంది. ఎక్స్‌ట్రాక్ష‌న్ 2 పేరుతో తెర‌కెక్కుతోన్న ఈ సీక్వెల్ ట్రైల‌ర్‌ను సోమ‌వారం రిలీజైంది. మొదటి పార్ట్‌ని మించేలా అదిరిపోయే యాక్షన్‌ సీక్వెన్స్‌లతో కట్‌ చేసిన ఈ ట్రైలర్‌ సినిమాపై అంచనాలను మరింత పెంచేసింది. ప్రస్తుతం ఎక్స్‌ట్రాక్షన్‌ ట్రైలర్‌ యూట్యూబ్‌లో ట్రెండింగ్‌లో ఉంది.

కాగా క‌రోనా కార‌ణంగా ఎక్స్‌ట్రాక్ష‌న్ సినిమా నేరుగా ఓటీటీలోనే రిలీజై సూపర్‌హిట్‌గా నిలిచింది. ఇప్పుడు సీక్వెల్‌ను కూడా డైరెక్ట్‌గా ఓటీటీలోనే రిలీజ్ చేయ‌బోతున్న‌ట్లు ప్ర‌క‌టించారు మేకర్స్‌. ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫామ్‌ నెట్‌ఫ్లిక్స్‌లో జూన్ 16 నుంచి ఎక్స్‌ట్రాక్షన్‌ సినిమా స్ట్రీమింగ్‌ కానుంది. సో.. యాక్షన్‌ ప్రియులు రెడీగా ఉండండి. క్రిస్‌ హెమ్స్‌వ‌ర్త్‌ ఫుల్లీ యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌ మూవీని ఎంజాయ్‌ చేయండి.

ఇవి కూడా చదవండి

మరిన్ని సినిమా వార్తల కోసం క్లిక్ చేయండి..