Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Tollywood: అమ్మతో కలిసి చిరునవ్వులు చిందిస్తోన్న ఈ కుర్రాడు టాలీవుడ్‌లో ఓ సంచలనం.. ఎవరో గుర్తుపట్టారా మరి?

పై ఫొటోలో అమ్మతో కలిసి చిరునవ్వులు చిందిస్తోన్న కుర్రాడు టాలీవుడ్‌లో ఓ సంచలనం.. అలాగానీ అతను ఓ స్టార్‌ హీరో కాదు. నటుడు కూడా కాదు. కానీ అంతకుమించిన సెలబ్రిటీ. వివాదాస్పద వ్యాఖ్యలతో తరచూ వార్తల్లో నిలుస్తుంటాడు. ప్రపంచమంతా ఒకదారి అయితే తనదొక దారి అంటాడు...

Tollywood: అమ్మతో కలిసి చిరునవ్వులు చిందిస్తోన్న ఈ కుర్రాడు టాలీవుడ్‌లో ఓ సంచలనం.. ఎవరో గుర్తుపట్టారా మరి?
Tollywood Celebrity
Follow us
Basha Shek

|

Updated on: Apr 06, 2023 | 6:10 AM

పై ఫొటోలో అమ్మతో కలిసి చిరునవ్వులు చిందిస్తోన్న కుర్రాడు టాలీవుడ్‌లో ఓ సంచలనం.. అలాగానీ అతను ఓ స్టార్‌ హీరో కాదు. నటుడు కూడా కాదు. కానీ అంతకుమించిన సెలబ్రిటీ. వివాదాస్పద వ్యాఖ్యలతో తరచూ వార్తల్లో నిలుస్తుంటాడు. ప్రపంచమంతా ఒకదారి అయితే తనదొక దారి అంటాడు. మనసులో ఏదీ దాచుకోడు. సందర్భమేదైనా ముక్కుసూటిగా మాట్లాడతాడు. సినిమాల పరంగానే కాదు రాజకీయాల పరంగానూ కొందరిపై సెటైర్లు వేస్తుంటాడు. ఎందుకు ఇలా చేస్తామని అడిగితే ‘నాఇష్టం’ అంటాడు. పైగా ‘నన్ను అసలు నమ్మోద్దు.. నేను అసలు మంచి వాడిని కాదు’ అంటూ ప్రచారం చేసుకుంటాడు. ఇలా తన ప్రవర్తనతో అందరినీ ఆశ్చర్యపరిచే ఈ సెలబ్రిటీ ఎవరో పట్టేసినట్టున్నారా కదా? యస్‌. మీరు అనుకుంటున్నది కరెక్టే. ఆయన మరెవరో కాదు సంచలన దర్శకుడు రామ్‌ గోపాల్‌ వర్మ. శివ సినిమాతో టాలీవుడ్‌లో ట్రెండ్‌సెట్టర్‌గా నిలిచిన ఆయన క్షణక్షణం, గాయం, మనీ, రంగీలా, దెయ్యం, అనగనగా ఒకరోజు, సత్య, కంపెనీ, సర్కార్‌, రక్త చరిత్ర, వీరప్పన్‌ తదితర సినిమాలతో సెన్సేషనల్‌ డైరెక్టర్‌గా మారిపోయాడు.

అయితే గతంలోలా ఇప్పుడు హిట్‌ సినిమాలు తీయట్లేదు వర్మ. నిజ జీవిత సంఘటలను సినిమాలుగా తెరకెక్కిస్తూ తరచూ కాంట్రవర్సీల చుట్టూ తిరుగుతున్నాడు. ఒకవేళ సినిమాలు లేకుంటే పొలిటికల్‌ లీడర్లపై పడతాడు. ట్విట్టర్‌ వేదికగా కొందరి రాజకీయ నాయకులపై సెటైర్లు వేస్తుంటాడు. మొత్తానికి ఏదో ఒక అంశంపై తరచూ వార్తల్లో నిలుస్తుంటాడు వర్మ. కాగా శుక్రవారం (ఏప్రిల్ 7) రామ్‌గోపాల్‌ వర్మ పుట్టిన రోజు. ఈ సందర్భంగా అతని రేర్‌ ఫొటోలు సోషల్‌ మీడియాలో కనిపిస్తున్నాయి. ఇందులో తల్లితో దిగిన ఒక ఫొటో అందరినీ ఆకట్టుకుంటోంది. ఇందులో లాల్చీ, పైజామా ధరించి చాలా బక్కపల్చగా అసలు గుర్తుపట్టలేకుండా ఉన్నాడు ఆర్జీవీ.

ఇవి కూడా చదవండి
View this post on Instagram

A post shared by RGV (@rgvzoomin)