AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Adah Sharma: హానుమాన్‌ చాలీసా పఠిస్తూ కర్రసాము చేసిన ‘హార్ట్‌ ఎటాక్‌’ హీరోయిన్‌.. నెట్టింట వైరల్ వీడియో

అదా శర్మ.. హార్ట్‌ ఎటాక్‌ సినిమాతో కుర్రాళ్ల గుండెల్లో గుబులు రేపిన ఈ ముద్దుగుమ్మ గురించి ప్రత్యేక పరిచయం లేదు. అంతకుముందు కొన్ని హిందీ సినిమాల్లో నటించిన ఈ అందాల తార హార్ట్‌ ఎటాక్‌ సినిమాతో టాలీవుడ్‌ లోకి ఎంట్రీ ఇచ్చింది. ఆ సినిమాలో ఆమె అందానికి కుర్రకారు ముగ్ధులయ్యారు.

Adah Sharma: హానుమాన్‌ చాలీసా పఠిస్తూ కర్రసాము చేసిన 'హార్ట్‌ ఎటాక్‌' హీరోయిన్‌.. నెట్టింట వైరల్ వీడియో
Adah Sharma
Basha Shek
|

Updated on: Apr 07, 2023 | 6:50 AM

Share

అదా శర్మ.. హార్ట్‌ ఎటాక్‌ సినిమాతో కుర్రాళ్ల గుండెల్లో గుబులు రేపిన ఈ ముద్దుగుమ్మ గురించి ప్రత్యేక పరిచయం లేదు. అంతకుముందు కొన్ని హిందీ సినిమాల్లో నటించిన ఈ అందాల తార హార్ట్‌ ఎటాక్‌ సినిమాతో టాలీవుడ్‌ లోకి ఎంట్రీ ఇచ్చింది. ఆ సినిమాలో ఆమె అందానికి కుర్రకారు ముగ్ధులయ్యారు. సన్‌ ఆఫ్‌ సత్యమూర్తి, సుబ్రమణ్యం ఫర్‌ సేల్‌, గరం, క్షణం, కల్కి తదితర సినిమాలతో తెలుగు ప్రేక్షకులకు బాగా చేరువైంది. అయితే ఎందుకో గానీ స్టార్‌ హీరోయిన్‌గా ఎదగలేకపోయింది. హిందీలో కొన్ని సినిమాలు చేసిన ఈ ముద్దుగుమ్మ సోషల్‌ మీడియాలో మాత్రం ఫుల్‌ యాక్టివ్‌గా ఉంటోంది.తన డైలీ యాక్టివిటీస్‌, షూటింగ్ అప్ డేట్స్, వెకేషన్‌ వివరాలు అన్నీ ఇలా ఇన్ స్టాగ్రామ్‌లో షేర్ చేసుకుంటుంది. అలాగే తన లేటెస్ట్‌ గ్లామరస్‌ ఫొటోలు, వీడియోలను పోస్ట్ చేస్తుంటుంది. ఇక ఫిట్‌నెస్‌పై బాగానే దృష్టి సారించిన ఈ అందాల తార మార్షల్‌ ఆర్ట్స్‌, నాన్‌ చక్స్‌, కర్రసాము వంటివి చేస్తూ ఆ వీడియోలను సోషల్ మీడియాలో షేర్‌ చేస్తుంటుంది. తాజాగా హనుమాన్ జయంతి సందర్భంగా హనుమాన్ చాలీసా చదువుతూ కర్ర సాము చేసింది అదా శర్మ. అనంతరం ఆ వీడియోను సామాజిక మాధ్యమాల్లో షేర్‌ చేసింది.

ప్రస్తుతం అదా శర్మ వీడియో నెట్టింట్లో వైరలవుతోంది. ఫాలోవర్లు, నెటిజన్ల నుంచి కూడా మంచి రెస్పాన్స్‌ వస్తోంది. ఈ సందర్భంగా హనుమాన్‌ జయంతి శుభాకాంక్షలు.. మీ ట్యాలెంట్‌ సూపర్‌ మేడమ్‌ అంటూ కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు. ఇటీవల అక్షయ్‌ కుమార్‌ నటించిన సెల్ఫీ అనే హిందీ సినిమాలో నటించింది అదా శర్మ. మలయాళ హిట్‌ మూవీ డ్రైవింగ్‌ లైసెన్స్‌కు రీమేక్‌గా తెరకెక్కిన ఈ సినిమా డిజాస్టర్‌గా నిలిచింది. ప్రస్తుతం అదా ది కేరళ స్టోరీ అనే సినిమాలో నటిస్తోంది. కొన్ని రోజుల క్రితం ఈ సినిమా నుంచి విడుదలైన టీజర్‌ వివాదాస్పదమైన సంగతి తెలిసిందే.

ఇవి కూడా చదవండి
View this post on Instagram

A post shared by Adah Sharma (@adah_ki_adah)

కుంభ రాశిలోకి కుజుడు.. లక్కూ, హ్యాపీనెస్.. ఈ రాశుల పంట పండినట్లే
కుంభ రాశిలోకి కుజుడు.. లక్కూ, హ్యాపీనెస్.. ఈ రాశుల పంట పండినట్లే
ఫ్రీగా గ్యాస్ సిలిండర్, స్టౌవ్.. మహిళలకు కేంద్రం అదిరిపోయే..
ఫ్రీగా గ్యాస్ సిలిండర్, స్టౌవ్.. మహిళలకు కేంద్రం అదిరిపోయే..
కోపం ఎక్కువగా వస్తోందా? ఇవి తింటే వెంటనే రిలాక్స్ ఐపోతారు..
కోపం ఎక్కువగా వస్తోందా? ఇవి తింటే వెంటనే రిలాక్స్ ఐపోతారు..
ఏపీకి కేంద్రం గుడ్‌న్యూస్.. విశాఖ మెట్రోకు గ్రీన్‌సిగ్నిల్!
ఏపీకి కేంద్రం గుడ్‌న్యూస్.. విశాఖ మెట్రోకు గ్రీన్‌సిగ్నిల్!
రొమాంటిక్ సీన్లతో రెచ్చిపోయింది.. కట్ చేస్తే.. సినిమాలకు దూరం..
రొమాంటిక్ సీన్లతో రెచ్చిపోయింది.. కట్ చేస్తే.. సినిమాలకు దూరం..
తెలుగు రాష్ట్రాల్లో వాతావరణం ఎలా ఉంటుంది..? ఇదిగో వెదర్ రిపోర్ట్
తెలుగు రాష్ట్రాల్లో వాతావరణం ఎలా ఉంటుంది..? ఇదిగో వెదర్ రిపోర్ట్
టీ20 ప్రపంచకప్ హిస్టరీలో హ్యాట్రిక్ వీరులు.. టాప్ 5 లిస్ట్ ఇదే..
టీ20 ప్రపంచకప్ హిస్టరీలో హ్యాట్రిక్ వీరులు.. టాప్ 5 లిస్ట్ ఇదే..
తోటకూర చికెన్ ఇలా వండి తింటే.. ముక్క కూడా వదలకుండా తింటారు!
తోటకూర చికెన్ ఇలా వండి తింటే.. ముక్క కూడా వదలకుండా తింటారు!
ఈసీ కీలక నిర్ణయం.. రాష్ట్రంలోని ఆ వార్డుకు ఎన్నిక రద్దు!
ఈసీ కీలక నిర్ణయం.. రాష్ట్రంలోని ఆ వార్డుకు ఎన్నిక రద్దు!
లోక్‌సభ స్పీకర్‌ ఓం బిర్లాపై కాంగ్రెస్ అవిశ్వాస తీర్మానం!
లోక్‌సభ స్పీకర్‌ ఓం బిర్లాపై కాంగ్రెస్ అవిశ్వాస తీర్మానం!