Telangana: దుకాణదారులకు ఎగిరి గంతేసే న్యూస్.. తెలంగాణ సర్కార్ కీలక ప్రకటన..

షాపింగ్ మాల్స్, దుకాణాదారులకు తెలంగాణ సర్కార్ గుడ్ న్యూస్ చెప్పింది. ఇకపై 24 గంటలూ షాపింగ్ చేసుకోవడానికి సరికొత్త విధానాన్ని అమల్లోకి తీసుకువచ్చింది. ఇందుకు సంబంధించిన అధికారిక ప్రకటన విడుదల చేసింది రాష్ట్ర ప్రభుత్వం. ఇప్పటి వరకూ ఉన్న తెలంగాణ షాప్స్ అండ్ ఎస్టాబ్లిష్‌మెంట్ యాక్ట్(1988)లోని సెక్షన్ 7‌లో పలు సవరణలు చేస్తూ..

Telangana: దుకాణదారులకు ఎగిరి గంతేసే న్యూస్.. తెలంగాణ సర్కార్ కీలక ప్రకటన..
Telangana
Follow us
Shiva Prajapati

| Edited By: Ravi Kiran

Updated on: Apr 08, 2023 | 11:15 AM

షాపింగ్ మాల్స్, దుకాణాదారులకు తెలంగాణ సర్కార్ గుడ్ న్యూస్ చెప్పింది. ఇకపై 24 గంటలూ షాపింగ్ చేసుకోవడానికి సరికొత్త విధానాన్ని అమల్లోకి తీసుకువచ్చింది. ఇందుకు సంబంధించిన అధికారిక ప్రకటన విడుదల చేసింది రాష్ట్ర ప్రభుత్వం. ఇప్పటి వరకూ ఉన్న తెలంగాణ షాప్స్ అండ్ ఎస్టాబ్లిష్‌మెంట్ యాక్ట్(1988)లోని సెక్షన్ 7‌లో పలు సవరణలు చేస్తూ.. లైసెన్స్ తీసుకున్న దుకాణాలు ఇకపై 24 గంటలూ తెరిచి ఉంచి, వ్యాపారాలు సాగించుకోవచ్చునని సూచించింది. అయితే, 24 షాపింగ్ చేసుకోవాలంటే.. సదరు యజమానులు సంవత్సరానికి రూ. 10 వేల చొప్పున అదనపు ఫీజు చెల్లించాల్సి ఉంటుంది. ఈ మేరకు రాష్ట్ర కార్మిక ఉపాధి కల్పన శాఖ జీవో నెంబర్ 4 పేరుతో ఉత్తర్వులు జారీ చేసింది.

కాగా, 24 గంటల వ్యాపారానికి సంబంధించి ప్రభుత్వం కొన్ని మార్గదర్శకాలు, షరతలు విడుదల చేసింది. వాటిని తప్పకుండా పాటించాలని స్పష్టం చేసింది ప్రభుత్వం. మరి ఆ షరతులేంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం..

1. పోలీసు యాక్టులోని నిబంధనలకు అనుగుణంగా ఈ దుకాణాలు 24 గంటలు పనిచేయడం ఆధారపడి ఉంటుంది.

ఇవి కూడా చదవండి

2. దుకాణంలో పనిచేసే ప్రతి కార్మికుడు/ఉద్యోగికి గుర్తింపు కార్డు తప్పనిసరిగా మంజూరు చేయాలి.

3. సిబ్బందికి వీక్లీ ఆఫ్ విధానాన్ని అమలుచేయాలి.

4. ప్రతీ వారం సిబ్బందికి నిర్దిష్టంగా పని గంటలను నిర్ణయించాలి.

5. అంతకంటే ఎక్కువసేపు పని చేస్తున్నట్లయితే ఓవర్ టైమ్ వేతనాన్ని చెల్లించాలి.

6. ప్రభుత్వ సెలవుదినాలు, జాతీయ సెలవులు, వీక్లీ ఆఫ్ రోజు పనిచేస్తే దానికి బదులుగా మరో రోజున సీ-ఆఫ్ తీసుకునే వెసులుబాటు సిబ్బందికి ఉండాలి.

7. దుకాణాల్లో పనిచేసే మహిళలకు తగిన భద్రత కల్పించాలి.

8. రాత్రి షిప్టులో పనిచేసే మహిళా సిబ్బంది నుంచి విధిగా సమ్మతిని రాతపూర్వకంగా తీసుకోవాలి.

9. రాత్రి షిప్టుల్లో పనిచేసే మహిళా సిబ్బందికి రానుపోను సౌకర్యాన్ని దుకాణం యాజమాన్యం కల్పించాలి.

10. రాష్ట్ర ప్రభుత్వం నిర్దేశించిన విధంగా ఆ దుకాణం యాజమాన్యం క్రమం తప్పకుండా రికార్డులను సమర్పించాలి.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..

ఆర్ధిక సంస్కరణల ఆద్యుడు.. ప్రజలకు 'ఉపాధి' కల్పించిన నాయకుడు
ఆర్ధిక సంస్కరణల ఆద్యుడు.. ప్రజలకు 'ఉపాధి' కల్పించిన నాయకుడు
మాజీ ప్రధాని మన్మోహన్‌ సింగ్‌కు ప్రముఖుల నివాళి
మాజీ ప్రధాని మన్మోహన్‌ సింగ్‌కు ప్రముఖుల నివాళి
నవ భారత రూపశిల్పి ఇకలేరు..
నవ భారత రూపశిల్పి ఇకలేరు..
ఎవరో నా పేరు మర్చిపోతే ఫీల్ అవుతానా.? సీఎం రేవంత్ ఏమన్నారంటే
ఎవరో నా పేరు మర్చిపోతే ఫీల్ అవుతానా.? సీఎం రేవంత్ ఏమన్నారంటే
ఇండియన్ సినిమా క్యాపిటల్‌గా హైదరాబాద్.. సీఎంతో సినీ ప్రముఖుల భేటీ
ఇండియన్ సినిమా క్యాపిటల్‌గా హైదరాబాద్.. సీఎంతో సినీ ప్రముఖుల భేటీ
ఉదయాన్నే ఖాళీకడుపుతో జీలకర్ర వాటర్ తాగితే,శరీరంలో ఉహించనిమార్పులు
ఉదయాన్నే ఖాళీకడుపుతో జీలకర్ర వాటర్ తాగితే,శరీరంలో ఉహించనిమార్పులు
బీఎస్‌ఎన్‌ఎల్‌ గుడ్‌న్యూస్‌.. ఒక నెల పాటు ఉచిత ఇంటర్నెట్‌ సదుపాయం
బీఎస్‌ఎన్‌ఎల్‌ గుడ్‌న్యూస్‌.. ఒక నెల పాటు ఉచిత ఇంటర్నెట్‌ సదుపాయం
మద్యం మత్తులో నిద్రిస్తున్న భర్త.. అదే అదునుగా చూసిన భార్య..
మద్యం మత్తులో నిద్రిస్తున్న భర్త.. అదే అదునుగా చూసిన భార్య..
చేసిన సినిమాలన్ని ప్లాప్.. అయినా తగ్గని క్రేజ్..
చేసిన సినిమాలన్ని ప్లాప్.. అయినా తగ్గని క్రేజ్..
ఒకప్పుడు క్రేజీ హీరోయిన్.. ఇప్పుడు మోటివేషనల్ స్పీకర్..ఎవరంటే
ఒకప్పుడు క్రేజీ హీరోయిన్.. ఇప్పుడు మోటివేషనల్ స్పీకర్..ఎవరంటే