AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Visakhapatnam: వీడు మనిషా.. మానవ మృగమా..! 15 ఏళ్ల కూతురిని గర్బవతిని చేసిన కన్న తండ్రి..

ఇంటి నుంచి బయటకు వెళ్లితేనే కాదు.. ఇంట్లో కూడా రక్షణ లేదు అనిపిస్తోంది.. ఇంకా చెప్పాలంటే.. సమాజంలో బయటి వ్యక్తుల నుండి ఆడపిల్లలకు ముప్పు పోంచి ఉందని బాధపడాలో లేక ఇంట్లోని మగవారి నుండి కూడా ఎదురయ్యే ప్రమాదాల గురించి ఆలోచించాలో అర్ధం కానీ స్థితికి చేరుకుంది నేటి మహిళ దుస్థితి..

Visakhapatnam: వీడు మనిషా.. మానవ మృగమా..! 15 ఏళ్ల కూతురిని గర్బవతిని చేసిన కన్న తండ్రి..
Visakha Patnam
Surya Kala
|

Updated on: Apr 08, 2023 | 11:49 AM

Share

రోజు రోజుకి మనిషి మృగంగా మారుతున్నాడు.. వావివరస..మంచి చెడు, వయసు అన్నీ మరచిపోతున్నాడు. మద్యం మత్తులో లేదా కోరికలకు లోనై.. శిశువు నుంచి కాటికి కాళ్లు చాచిన వృద్ధురాలైనా ఒకటే.. ఆడదైతే చాలు అన్నచందంగా మారిపోతున్నారు. తమ కోరికలను తీర్చుకుంటూ సభ్య సమాజం తలదించుకునేలా ప్రవర్తిస్తున్నారు కొందరు మృగాళ్లు.. ఎన్ని చట్టాలు తీసుకొచ్చినా మహిళలపై లైంగిక వేధింపులు ఆగడం లేదు. ఇంటి నుంచి బయటకు వెళ్లితేనే కాదు.. ఇంట్లో కూడా రక్షణ లేదు అనిపిస్తోంది.. ఇంకా చెప్పాలంటే.. సమాజంలో బయటి వ్యక్తుల నుండి ఆడపిల్లలకు ముప్పు పోంచి ఉందని బాధపడాలో లేక ఇంట్లోని మగవారి నుండి కూడా ఎదురయ్యే ప్రమాదాల గురించి ఆలోచించాలో అర్ధం కానీ స్థితికి చేరుకుంది నేటి మహిళ దుస్థితి.. తాజాగా ఓ తండ్రి కామాంధుడిగా మారి… 15 ఏళ్ల బాలికపై అత్యాచారం చేసి.. తల్లిని చేశాడు.. ఈ దారుణ ఘటన ఆంధ్రప్రదేశ్ లోని విశాఖ పట్నంలో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళ్తే..

విశాఖ పెదగంట్యాడ మండలం గంగవరంలో దారుణం చోటు చేసుకుంది. కన్న తండ్రి కామాంధుడై కూతుర్ని కాటేశాడు. 15 ఏళ్ల కూతురిపై అత్యాచారం చేశాడు. దీంతో గర్భవతి అయింది ఆ బాలిక. మేనమామ ఫిర్యాదుతో ఘటన వెలుగులోకి వచ్చింది. నిందితుడు ముత్యాలుని అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు న్యూ పోర్ట్ పోలీసులు.

ఇవి కూడా చదవండి

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..