Andhra Pradesh: ఎమ్మెల్యే శ్రీదేవిపై నారా లోకేష్ సంచలన ఆరోపణలు.. పత్తికొండలో పొలిటికల్ టెన్షన్..
పత్తికొండ రాజకీయం సవాళ్లు.. ప్రతిసవాళ్లతో వేడెక్కింది. యువగళం పాదయాత్రలో టీడీపీ నేత నారా లోకేష్ చేసిన భూ కబ్జా ఆరోపణలపై తీవ్రస్థాయిలో మండిపడ్డారు స్థానిక వైసీపీ ఎమ్మెల్యే కంగాటి శ్రీదేవి.. ఆరోపణలపై బహిరంగ చర్చకు సిద్ధమని పరస్పరం సవాళ్లు చేసుకోవడంతో పత్తికొండలో పొలిటికల్ టెన్షన్ నెలకొంది.
పత్తికొండ రాజకీయం సవాళ్లు.. ప్రతిసవాళ్లతో వేడెక్కింది. యువగళం పాదయాత్రలో టీడీపీ నేత నారా లోకేష్ చేసిన భూ కబ్జా ఆరోపణలపై తీవ్రస్థాయిలో మండిపడ్డారు స్థానిక వైసీపీ ఎమ్మెల్యే కంగాటి శ్రీదేవి.. ఆరోపణలపై బహిరంగ చర్చకు సిద్ధమని పరస్పరం సవాళ్లు చేసుకోవడంతో పత్తికొండలో పొలిటికల్ టెన్షన్ నెలకొంది. తమ దగ్గరున్న ఆధారాలతో మరింత హీట్ రాజేస్తున్నారు టీడీపీ, వైసీపీ నాయకులు.
యువగళం పాదయాత్రలో టీడీపీ నేత నారా లోకేష్ స్థానిక ఎమ్మెల్యేలను తీవ్రస్థాయిలో టార్గెట్ చేస్తున్నారు. ఉమ్మడి కర్నూలు జిల్లా పత్తికొండలో యాత్ర చేస్తున్న నారా లోకేష్.. స్థానిక వైసీపీ ఎమ్మెల్యే కంగాటి శ్రీదేవిపై భూకబ్జా ఆరోపణలు చేశారు. స్థానికులు తనకు ఇచ్చిన ఆధారాల ప్రకారం.. చెర్లకొత్తూరులో దళితుల భూములను ఎమ్మెల్యే శ్రీదేవి ఆక్రమించారని లోకేష్ ఆరోపించారు. ఈ సందర్భంగా కొన్ని డాక్యుమెంట్లను సైతం విడుదల చేశారు. చెర్లకొత్తూరులో దళితుల భూములను ఎమ్మెల్యే శ్రీదేవి ఆక్రమించారని, కొండలు, గుట్టలు మింగేస్తున్నారంటూ లోకేష్ ఈ సందర్భంగా.. ఫైర్ అయ్యారు.
అయితే, లోకేష్ ఆరోపణలపై తీవ్రస్థాయిలో మండిపడ్డారు పత్తికొండ ఎమ్మెల్యే శ్రీదేవి. ఆరోపణలపై లోకేష్‌కు దమ్ముంటే తనతో చర్చకు రావాలని సవాల్ చేశారు ఎమ్మెల్యే. లోకేష్ విడుదల చేసిన ఆధారాలు ఫేక్ అని పేర్కొన్న శ్రీదేవి.. ఆరోపణలు నిరూపిస్తే ఏ శిక్షకైనా సిద్ధమంటూ సవాల్ చేశారు. నిరాధార ఆరోపణలు చేస్తే ఊరుకోమంటూ హెచ్చరించారు.
మరిన్ని ఏపీ వార్తల కోసం..