Mouth Cancer: సిగరెట్, గుట్కా అలవాటు లేకపోయినా.. ఈ మూడు అలవాట్లుంటే నోటి క్యాన్సర్ ముప్పు తప్పదు!
క్యాన్సర్.. ఎటువంటిదైనా, ఎప్పుడైనా అది ప్రమాదకరమే. ముదిరిపోతున్నకొద్దీ ప్రాణాలను హరిస్తుంది. రోజు వారి మన జీవనశైలి కారణంగా తెలిసీ తెలియక చేసిన కొన్ని పొరబాట్ల వల్ల క్యాన్సర్ బారీన పడుతుంటాం. కొంత మందికి సిగరెట్లు, జర్దా, గుట్కాల అలవాటు లేకపోయినా నోటి క్యాన్సర్..
క్యాన్సర్.. ఎటువంటిదైనా, ఎప్పుడైనా అది ప్రమాదకరమే. ముదిరిపోతున్నకొద్దీ ప్రాణాలను హరిస్తుంది. రోజు వారి మన జీవనశైలి కారణంగా తెలిసీ తెలియక చేసిన కొన్ని పొరబాట్ల వల్ల క్యాన్సర్ బారీన పడుతుంటాం. కొంత మందికి సిగరెట్లు, జర్దా, గుట్కాల అలవాటు లేకపోయినా నోటి క్యాన్సర్ వస్తుంది. కారణం తెలియక కుంగుబాటుకు లోనవుతుంటారు. మహిళలతోపోల్చితే నోటి క్యాన్సర్ పురుషులకు ఎక్కువగా సంభవిస్తుంది. అందుకు కారణం లేకపోలేదు. మనదేశంలో చాలా మంది పురుషులు సిగరెట్ లేదా గుట్కా వ్యసనం వల్ల క్యాన్సర్ ముప్పుకు గురవుతున్నారు. నివేదికల ప్రకారం.. మన దేశంలో ప్రతి యేట సుమారు 1 లక్ష నోటి క్యాన్సర్ కేసులు నమోదవుతున్నాయి. ఏప్రిల్ నెలను నోటి క్యాన్సర్ అవగాహన నెలగా కూడా జరుపుకుంటారు. నోటి క్యాన్సర్‌పై అవగాహన కలిగించడం ద్వారా ఈ వ్యాధి రాకుండా నివారించవచ్చు. ఈ కింది కారణాల వల్ల కూడా నోటి క్యాన్సర్ వస్తుందని చాలా మందికి తెలియదు. అవేంటంటే..
ఊబకాయం లేదా అధిక బరువు
క్యాన్సర్ ఎప్పుడు, ఎందుకు వస్తుంది అనేది ఓ పెద్ద చిక్కు ప్రశ్న. మన శరీరంలో ఎక్కువ కణాలు ఏర్పడినప్పుడు వాటిని అదుపు చేయడం కష్టమవుతుంది. అధిక బరువు ఉన్నవారిలో కణాలు వేగంగా పెరుగుతాయని నిపుణులు చెబుతున్నారు. దీని కారణంగా అన్ని రకాల క్యాన్సర్‌ల ముప్పు పెరుగుతుంది. వివిధ హార్మోన్ల పెరుగుదలను నివారించడానికి ఆరోగ్యకరమైన జీవనశైలిని అనుసరించడం చాలా అవసరం. అందువల్లనే అధిక బరువు ఉన్నవారు క్యాన్సర్ బారీన పడుతుంటారు.
పోషకాల లోపం
వయసుకు తగ్గ బరువు లేకపోయినా లేదా బయటి ఆహారాలు తరచూ తినడం వల్ల శరీరంలో పోషకాల లోపం ఏర్పడుతుంది. ఈ రకమైన పొరపాటు తీవ్రమైన వ్యాధులకు దారితీస్తుంది. వాటిలో ఒకటి నోటి క్యాన్సర్. ఆరోగ్యంగా ఉండటం మంచిదేగానీ.. తగినన్ని పోషకాలను కోల్పోవడం కూడా పెద్ద ముప్పుకు కారణం అవుతుంది. ఆరోగ్యకరమైన ఆహారం, సరైన జీవనశైలి ద్వారా ఈ లోపాన్ని అధిగమించవచ్చు.
మౌత్ వాష్
మారుతున్న కాలానికి అనుగుణంగా మన జీవనశైలిలో కూడా పలు మార్పులు చోటుచేసుకుంటుంటాయి. తక్కువ పనితో ఎక్కువ సమయం ఆదా చేయడానికి దొడ్డిదారులు వెతకం నేటి కాలంలో ముఖ్యమంగా నగరవాసులకు పరిపాటైపోయింది. వీటిల్లో ఒకటి మౌత్ వాష్. నిజానికి.. మౌత్ వాష్‌లలో నోటి క్యాన్సర్ ప్రమాదాన్ని పెంచే రసాయనాలు, ఆల్కహాల్ ఇందులో అధికంగా ఉంటాయి. స్ప్రే మౌత్ వాష్ చాలా హాని తలపెడతాయని నిపుణులు అంటున్నారు.
మరిన్ని ఆరోగ్య సమాచారం కోసం క్లిక్ చేయండి.