భార్య దోసె వేయలేదనే కోపంతో ఏం చేశాడో తెలిస్తే రక్తం మరుగుతుంది..

ఇంట్లో భార్య దోసెలు చేస్తోంది. ఇంతలో గ్యాస్‌ అయిపోయింది. అప్పటి వరకు చేసిన దోసెలను భర్తకు వడ్డించింది. ఐతే భర్త ఇంకా దోసెలు తీసుకురమ్మనడంతో భార్య గ్యాస్‌ సిలిండర్‌ అయిపోయిందని చెప్పింది. దీంతో కోపోధ్రిక్తుడైన భర్త..

భార్య దోసె వేయలేదనే కోపంతో ఏం చేశాడో తెలిస్తే రక్తం మరుగుతుంది..
Tamil Nadu Crime
Follow us
Srilakshmi C

|

Updated on: Apr 18, 2023 | 9:46 AM

ఇంట్లో భార్య దోసెలు చేస్తోంది. ఇంతలో గ్యాస్‌ అయిపోయింది. అప్పటి వరకు చేసిన దోసెలను భర్తకు వడ్డించింది. ఐతే భర్త ఇంకా దోసెలు తీసుకురమ్మనడంతో భార్య గ్యాస్‌ సిలిండర్‌ అయిపోయిందని చెప్పింది. దీంతో కోపోధ్రిక్తుడైన భర్త కత్తితో భార్యను విచక్షణా రహితంగా పొడిచాడు. ఆసుపత్రిలో చికిత్స పొందుతూ బాధితురాలు సోమవారం మృతి చెందింది. తమిళనాడులోని కృష్ణగిరి జిల్లాలో జరిగిన ఈ షాకింగ్‌ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..

కృష్ణగిరి జిల్లా మాత్తూరు సమీపంలోని ఎన్‌ మోటూరు గ్రామానికి చెందిన గణేశన్‌ (60) భార్య మాధమ్మాల్‌ (50) దంపతులు. ఈ నెల 11వ తేదీన పని ముగించుకుని ఇంటికి వచ్చిన గణేశన్‌ దోసె చేయమని భార్యకు పురమాయించాడు. దీంతో భార్య మాధమ్మాల్‌ మూడు దోసెలు వేసి, భర్తకు వడ్డించింది. ఐతే అంతలో గ్యాస్‌ సిలిండర్‌ అయిపోయింది. గణేశన్‌ మరో 3 దోసెలు చేయమని భార్యను అడగడంతో ఆమె గ్యాస్‌ సిలిండర్‌ అయిపోయిందని చెప్పింది. దీంతో భార్య దోసె చేయలేదనే కోపంతో గణేశన్‌ కత్తితో మాధమ్మాల్‌ తల, చేయి నరికాడు. మామను అడ్డుకునేందుకు వెళ్లిన కోడలు విజయలక్ష్మి, చిన్నారి తానీషా(2)కు కూడా తీవ్ర గాయాలయ్యాయి.

ఇరుకుపొరుగు పోలీసులకు సమాచారం అందించడంతో పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని తీవ్రంగా గాయపడిన మాధమ్మాల్‌తోపాటు విజయలక్ష్మి, చిన్నారి తానీషాలను చికిత్స నిమిత్తం కృష్ణగిరి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. దీనిపై కేసు నమోదు చేసుకున్న మాత్తూరు పోలీసులు గణేశన్‌ను అరెస్టు చేశారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న మాధమ్మాన్‌ పరిస్థితి విషమించి సోమవారం ఉదయం మృతి చెందింది. స్థానికంగా ఈ సంఘటన కలకలం సృష్టించింది.

ఇవి కూడా చదవండి

మరిన్ని జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి.

టమాటా మసాలా కర్రీ.. ఎందులోకైనా అదుర్స్ అంతే..
టమాటా మసాలా కర్రీ.. ఎందులోకైనా అదుర్స్ అంతే..
ఉపేంద్ర UI బ్యూటీని శ్రీలీలతో పోలుస్తున్న నెటిజన్స్.. ఎందుకంటే..
ఉపేంద్ర UI బ్యూటీని శ్రీలీలతో పోలుస్తున్న నెటిజన్స్.. ఎందుకంటే..
ఇంట్లో పనిచేసే వారితో రామ్ చరణ్- ఉపాసన క్రిస్మస్ వేడుకలు.. ఫొటోస్
ఇంట్లో పనిచేసే వారితో రామ్ చరణ్- ఉపాసన క్రిస్మస్ వేడుకలు.. ఫొటోస్
ప్రఖ్యాత రచయిత వాసుదేవన్ నాయర్ కన్నుమూత
ప్రఖ్యాత రచయిత వాసుదేవన్ నాయర్ కన్నుమూత
నితీష్, నవీన్ పట్నాయక్‌కు భారతరత్న.. తెరమీదకు కొత్త డిమాండ్
నితీష్, నవీన్ పట్నాయక్‌కు భారతరత్న.. తెరమీదకు కొత్త డిమాండ్
శివన్న ఆరోగ్యంపై అప్డేట్ ఇచ్చిన కూతురు.. ఎమోషనల్ పోస్ట్
శివన్న ఆరోగ్యంపై అప్డేట్ ఇచ్చిన కూతురు.. ఎమోషనల్ పోస్ట్
మల్లారెడ్డా మజాకా.. జిమ్‌లో అదరగొట్టిన మాజీ మంత్రి
మల్లారెడ్డా మజాకా.. జిమ్‌లో అదరగొట్టిన మాజీ మంత్రి
స్మార్ట్ వాచ్‌లు పెట్టుకుంటున్నారా.. ఈ వ్యాధులు రావడం ఖాయం!
స్మార్ట్ వాచ్‌లు పెట్టుకుంటున్నారా.. ఈ వ్యాధులు రావడం ఖాయం!
ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలుకలిగిన క్యాబేజీ..వారానికి ఒక్కసారైనా తింటే
ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలుకలిగిన క్యాబేజీ..వారానికి ఒక్కసారైనా తింటే
శ్రీతేజ్‌ను పరామర్శించిన జానీ మాస్టర్.. బన్నీ గురించి ఏమన్నాడంటే?
శ్రీతేజ్‌ను పరామర్శించిన జానీ మాస్టర్.. బన్నీ గురించి ఏమన్నాడంటే?