Times Now Survey: ఏమాత్రం తగ్గని మోదీ ప్రాభవం.. ఇప్పటికిప్పుడు ఎన్నికలు పెడితే..
లోక్‌సభకు ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే గెలిచేది ఎవరో టైమ్స్ నౌ నవభారత్ సర్వే తేల్చేసింది. 292 నుంచి 338 సీట్లతో బీజేపీ అతిపెద్ద పార్టీగా అవతరిస్తుందని తెలిపింది. కాంగ్రెస్ పార్టీకి 106 నుంచి 144 వరకూ వస్తాయని వెల్లడించింది. పశ్చిమబెంగాల్‌లో టీఎంసీకి 20 నుంచి 22, ఒడిశాలో బీజేడీకి 11 నుంచి 13 స్థానాలు దక్కుతాయని
లోక్‌సభకు ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే గెలిచేది ఎవరో టైమ్స్ నౌ నవభారత్ సర్వే తేల్చేసింది. 292 నుంచి 338 సీట్లతో బీజేపీ అతిపెద్ద పార్టీగా అవతరిస్తుందని తెలిపింది. కాంగ్రెస్ పార్టీకి 106 నుంచి 144 వరకూ వస్తాయని వెల్లడించింది. పశ్చిమబెంగాల్‌లో టీఎంసీకి 20 నుంచి 22, ఒడిశాలో బీజేడీకి 11 నుంచి 13 స్థానాలు దక్కుతాయని అంచనావేసింది. ఇతరులు 50 నుంచి 80 స్థానాల్లో గెలుస్తారని తెలిపింది.
ఎన్నికలెప్పుడొచ్చినా అధికారం బీజేపీదే..
అసలు 2024 వరకూ ఎందుకు ఇప్పటికిప్పుడు ఎన్నికలు పెట్టినా బీజేపీదే అధికారం అంటోంది టైమ్స్‌నౌ-నవభారత్ సర్వే. దేశవ్యాప్తంగా ప్రజల మూడ్‌పై టైమ్స్‌నౌ-నవభారత్ సర్వే చేపట్టింది. ఇప్పటికిప్పుడు లోక్‌సభ ఎన్నికలు జరిగితే అతిపెద్ద పార్టీగా బీజేపీ అవతరిస్తుందని జోస్యం చెప్పింది.
బ్రాండ్ మోదీకి తిరుగులేని మద్ధతు..
బీజేపీకి 292 నుంచి 338 సీట్లు వస్తాయంది సర్వే. కాంగ్రెస్ కూటమికి 106నుంచి144 సీట్లు రావొచ్చని అంచనా వేసింది. అయితే, మొత్తంగా మరోసారి ప్రజల మద్దతు బీజేపీకే ఉందంటోంది సర్వే. బ్రాండ్ మోదీకి జనంలో తిరుగులేని మద్దతు ఉందనే విషయం స్పష్టమైందంటోంది.
రసవత్తరంగా 2024 ఎన్నికలు..
నరేంద్ర మోదీ 2014లో అధికారంలోకి వచ్చినప్పుడు బీజేపీకి 282 స్థానాలు దక్కాయి. 2019లో 303 సీట్లలో కమలనాథులు గెలిచారు. 2024 లోక్‌సభలో మరోసారి గెలిచి మూడోసారి కేంద్రంలో పాగావేయాలని మోదీ యోచిస్తున్నారు. అయితే ప్రతిపక్షాలు ఒక్కతాటిపైకి వచ్చేందుకు యత్నిస్తున్నాయి. దీంతో 2024 లోక్‌సభ ఎన్నికలు పోటీపోటీగా మారబోతున్నాయని రాజకీయ పరిశీలకులు చెబుతున్నారు. ఈఏడాదిలో జరిగే అసెంబ్లీ ఎన్నికల్లో విజయాలను బట్టి దేశవ్యాప్తంగా ఓటరు నాడి ఎలా ఉంటుందో తేలిపోతుందని రాజకీయ పరిశీలకులు చెబుతున్నారు.
ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే గెలిచేదెవరు. రాజకీయంగా ఇప్పుడు ఆసక్తి పెంచుతున్న అంశం ఇది. ఇదే అంశం పైన టైమ్స్ ఆఫ్ ఇండియా, నవ్ భారత్ సంస్థ సర్వే నిర్వహించింది. ఈ సర్వేలో ఆసక్తి కర అంశాలు బయటకు వచ్చాయి. లోక్‌సభకు ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే మళ్లీ గెలిచేది బీజేపీయేనని సర్వే తేల్చింది.
మోదీ పని తీరుపై 72 శాతం ప్రజల సంతృప్తి..
టైమ్స్ ఆఫ్ ఇండియా, నవభారత్ సంయుక్తంగా చేపట్టిన సర్వలో.. సర్వేలో ప్రధానంగా ఇప్పటికిప్పుడు లోక్‌సభ ఎన్నికలు జరిగితే ఎవరికి ఎన్ని సీట్లు వస్తాయనే అంశం పైన పబ్లిక్ మూడ్ తెలుసుకొనే ప్రయత్నం చేసారు. ప్రధాని మోడీ పాపులారిటీ చెక్కుచెదరకుండా అలాగే కొనసాగుతోందని సర్వేలో తేలింది. ప్రధాని మోడీ పనితీరు పట్ల తాజాగా 72% మంది సంతృప్తి వ్యక్తం చేశారని వెల్లడైంది. ఎన్డీఏ ప్రభుత్వం పట్ల 2022 ఆగస్ట్ లో 56 శాతం మందే సంతృప్తి వ్యక్తంచేయగా.. తాజాగా గవర్నమెంట్ అప్రూవల్ రేటింగ్ 11 శాతం పెరిగింది.
మరిన్ని జాతీయ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..