Dog Bites: నెల రోజుల క్రితం అన్నదమ్ములను చంపేసిన చోటే.. మరోసారి బాలుడిపై కుక్కల దాడి.. భయాందోళనలో ప్రజలు

దక్షిణ ఢిల్లీలోని వసంత్ కుంజ్ సమీపంలోని అదే ప్రాంతంలో ఓ బాలుడిపై కుక్కలు దాడి చేశాయి. బాలుడు వసంత్‌కుంజ్‌లోని రంగపురి హిల్ సమీపంలోని తన ఇంటికి సమీపంలో ఉన్న దుకాణానికి వెళుతుండగా ఈ దారుణ ఘటన చోటు చేసుకుంది. బాలుడిపై హఠాత్తుగా కుక్కల గుంపు దాడి చేసింది. ఈ సమయంలో కనీసం 14 కుక్కలు ఉండవచ్చు అని పోలీసులు తెలిపారు.

Dog Bites: నెల రోజుల క్రితం అన్నదమ్ములను చంపేసిన చోటే.. మరోసారి బాలుడిపై కుక్కల దాడి.. భయాందోళనలో ప్రజలు
Dog Bites
Follow us
Surya Kala

|

Updated on: Apr 19, 2023 | 11:41 AM

గత కొన్ని రోజులుగా అనేక ప్రాంతాల్లో వీధికుక్కలు హల్ చల్ చేస్తున్నాయి. పలువురిపై వీధికుక్కల దాడి చేసి గాయపరుస్తున్నాయి.. ప్రాణాలు తీస్తున్నాయి. దేశ రాజధాని ఢిల్లీలో కుక్కల దాడితో ఇద్దరు అన్నదమ్ములు చనిపోగా.. ఇప్పుడు అదే స్థలంలో మరో బాలుడిపై కుక్కలు దాడి చేశాయి. దక్షిణ ఢిల్లీలోని వసంత్ కుంజ్ సమీపంలోని అదే ప్రాంతంలో ఓ బాలుడిపై కుక్కలు దాడి చేశాయి. బాలుడు వసంత్‌కుంజ్‌లోని రంగపురి హిల్ సమీపంలోని తన ఇంటికి సమీపంలో ఉన్న దుకాణానికి వెళుతుండగా ఈ దారుణ ఘటన చోటు చేసుకుంది. బాలుడిపై హఠాత్తుగా కుక్కల గుంపు దాడి చేసింది. ఈ సమయంలో కనీసం 14 కుక్కలు ఉండవచ్చు అని పోలీసులు తెలిపారు.

తనపై కుక్కలు దాడి చేస్తున్న సమయంలో బాలుడు అక్కడి నుంచి పారిపోయేందుకు ప్రయత్నించగా కుక్కలు మరింతగా దాడి చేసి చేతులు, భుజాలు, మెడ, పొట్టపై కొరికాయి. సహాయం కోసం కేకలు వేయడంతో కొందరు పరుగెత్తి కుక్కలను తరిమేశారు. అయితే అప్పటికే బాలుడు తీవ్రంగా గాయపడ్డాడని పోలీసులు తెలిపారు.

కుటుంబ సభ్యులు బాలుడిని ఆసుపత్రికి తీసుకెళ్లారు.అక్కడ అతని శరీరంపై 12 కంటే ఎక్కువగా గాయాలు ఉన్నట్లు చెప్పారు. చికిత్స అనంతరం బాలుడిని ఇంటికి తరలించారు. తమ ప్రాంతంలో వీధికుక్కల బెడద ఎక్కువైందని.. రోజు రోజుకీ ఆందోళన కలిగిస్తోందని కుటుంబీకులు తెలిపారు.

ఇవి కూడా చదవండి

చుట్టుపక్కల వందల సంఖ్యలో వీధికుక్కలు ఉన్నాయని, వాటిని అరికట్టేందుకు కార్పొరేషన్ అధికారులు ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదని స్థానికులు ఆరోపిస్తున్నారు. గత నెలలో ఇదే ప్రాంతంలో మూడు రోజుల వ్యవధిలో ఇద్దరు అన్నదమ్ములను వీధికుక్క చంపేసిన సంగతి తెలిసిందే..

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

ఆర్ధిక సంస్కరణల ఆద్యుడు.. ప్రజలకు 'ఉపాధి' కల్పించిన నాయకుడు
ఆర్ధిక సంస్కరణల ఆద్యుడు.. ప్రజలకు 'ఉపాధి' కల్పించిన నాయకుడు
మాజీ ప్రధాని మన్మోహన్‌ సింగ్‌కు ప్రముఖుల నివాళి
మాజీ ప్రధాని మన్మోహన్‌ సింగ్‌కు ప్రముఖుల నివాళి
నవ భారత రూపశిల్పి ఇకలేరు..
నవ భారత రూపశిల్పి ఇకలేరు..
ఎవరో నా పేరు మర్చిపోతే ఫీల్ అవుతానా.? సీఎం రేవంత్ ఏమన్నారంటే
ఎవరో నా పేరు మర్చిపోతే ఫీల్ అవుతానా.? సీఎం రేవంత్ ఏమన్నారంటే
ఇండియన్ సినిమా క్యాపిటల్‌గా హైదరాబాద్.. సీఎంతో సినీ ప్రముఖుల భేటీ
ఇండియన్ సినిమా క్యాపిటల్‌గా హైదరాబాద్.. సీఎంతో సినీ ప్రముఖుల భేటీ
ఉదయాన్నే ఖాళీకడుపుతో జీలకర్ర వాటర్ తాగితే,శరీరంలో ఉహించనిమార్పులు
ఉదయాన్నే ఖాళీకడుపుతో జీలకర్ర వాటర్ తాగితే,శరీరంలో ఉహించనిమార్పులు
బీఎస్‌ఎన్‌ఎల్‌ గుడ్‌న్యూస్‌.. ఒక నెల పాటు ఉచిత ఇంటర్నెట్‌ సదుపాయం
బీఎస్‌ఎన్‌ఎల్‌ గుడ్‌న్యూస్‌.. ఒక నెల పాటు ఉచిత ఇంటర్నెట్‌ సదుపాయం
మద్యం మత్తులో నిద్రిస్తున్న భర్త.. అదే అదునుగా చూసిన భార్య..
మద్యం మత్తులో నిద్రిస్తున్న భర్త.. అదే అదునుగా చూసిన భార్య..
చేసిన సినిమాలన్ని ప్లాప్.. అయినా తగ్గని క్రేజ్..
చేసిన సినిమాలన్ని ప్లాప్.. అయినా తగ్గని క్రేజ్..
ఒకప్పుడు క్రేజీ హీరోయిన్.. ఇప్పుడు మోటివేషనల్ స్పీకర్..ఎవరంటే
ఒకప్పుడు క్రేజీ హీరోయిన్.. ఇప్పుడు మోటివేషనల్ స్పీకర్..ఎవరంటే