AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

EPFO: ఈపీఎఫ్‌వో రూల్స్‌లో భారీ మార్పులు.. ఇక నుంచి సింగిల్ పూల్ పథకం.. ఏడాదికి ఒక్కసారి మాత్రమే..

ఈపీఎఫ్‌వో తన పెట్టుబడి విధానంలో మార్పులు చేస్తోంది. ఇప్పటివరకు అమల్లో ఉన్న ఈటీఎఫ్‌లలో పెట్టుబడి పెట్టే విధానంలో మార్పులకు శ్రీకారం చుట్టింది. మార్చి 2వ తేదీన జరిగే ట్రస్టీల సమావేశంలో దీనిని ఆమోదించనున్నారు. ఈపీఎఫ్‌వో వార్షిక వడ్డీ రేటును నిర్ణయించే ప్రక్రియను ఏజెండాలో చేర్చలేదు.

EPFO: ఈపీఎఫ్‌వో రూల్స్‌లో భారీ మార్పులు.. ఇక నుంచి సింగిల్ పూల్ పథకం.. ఏడాదికి ఒక్కసారి మాత్రమే..
Epfo 4
Venkatrao Lella
|

Updated on: Feb 24, 2026 | 2:26 PM

Share

ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ (EPFO) మరో కీలక నిర్ణయం తీసుకుంది. ఉద్యోగుల ఈపీఎఫ్‌ సొమ్మును వేర్వేరు చోట్ల పెట్టుబడి పెట్టి ఆదాయం పొందుతూ ఉంటుంది కేంద్ర ప్రభుత్వం. అయితే ఇక నుంచి తన పెట్టుబడి విధానాన్ని మార్చుకోవాలని ఈపీఎఫ్‌వో నిర్ణయించింది. తన ఆదాయంలో మిగిలిన మొత్తాన్ని ఈటీఎఫ్‌లలో పెట్టుబడి పెడుతూ ఉంటుంది. ప్రతీ నెలా ఇలా పెట్టుబడి పెడుతుండగా.. ఇక నుంచి ఏడాదికి ఒకేసారి ఇన్వెస్ట్ చేయనుంది. ప్రస్తుతం ఐదు పథకాల ద్వారా ప్రత్యేక అకౌంట్ల నుంచి ఈపీఎఫ్‌వో పెట్టుబడులు పెడుతుండగా.. ఇక నుంచి సింగిల్ పూల్ పథకాన్ని అనుసరించనుంది. అంటే ఐదు పథకాల నుంచి సొమ్మును ఒకే అకౌంట్‌లోకి పూల్ చేసి సంవత్సరానికి ఒకసారి పెట్టుబడి పెట్టనుంది.

ఈపీఎఫ్ ప్లాన్ ఇదే..

ఈపీఎఫ్ ద్వారా ఈటీఎఫ్‌లో పెట్టుబడులు పెట్టే విధానాన్ని నియంత్రించేందుకు, సులభతంగా మార్చే ప్రక్రియకు శ్రీకారం చుట్టారు. అందులో భాగంగా ఒకే అకౌంట్ నుంచి ఏడాదికి ఒకసారి ఈటీఎఫ్‌లలో పెట్టుబడి పెట్టాలని యోచిస్తోంది. ఇన్వెస్ట్‌మెంట్ కమిటీ ఈ ప్రతిపాదనలను ఇప్పటికే ఆమోదించింది. మార్చి 2న జరిగే సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ట్రస్టీల సమావేశంలో ఈ ప్రతిపాదనపై చర్చించనున్నారు. ట్రస్టీ సభ్యులు పరిశీలించి ఆమోదం తెలపనున్నారు. ఈటీఎఫ్‌లలో పెట్టుబడి పెట్టేందుకు స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్ రూపొందించనున్నారు. దీనిని సమావేశం ఏజెండాలో చేర్చారు. 2015 నుంచి మిగిలిన ఆదాయాన్ని ఈటీఎఫ్‌లలో పెట్టుబడి పెడుతున్నారు. దాదాపు 5 నుంచి 15 శాతం సొమ్మును అందులో ఇన్వెస్ట్ చేస్తున్నారు. ఈటీఎఫ్ పెట్టుబడుల కోసం ఏకీకృత వ్యవస్థను ప్రవేశపెట్టేందుకు ఇప్పుడు సిద్దమవుతోంది. రూ.25 కోట్లకు పైగా ప్రొవైడర్లతో మాత్రమే లావాదేవీలను డైరెక్ట్ చేయాలనే స్టాక్ మార్కెట్ రెగ్యులేటర్ ఆదేశాన్ని EPFO ​​పాటించడంలో ఇది సహాయపడనుంది.

ఇక నుంచి ఏడాదికి ఒకసారి..

2016 నుంచి అమల్లో ఉన్న స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్ ప్రకారం పథకం వారీగా పెట్టుబడి విధానాన్ని అమలు చేస్తున్నారు. అయితే ఇప్పటి నుంచి వార్షిక పెట్టుబడులకు మారాలని ఈపీఎఫ్‌వో యోచిస్తోంది. ఇక ఈటీఎఫ్ పెట్టుబడుల కోసం సిస్టమాటిక్ ఇన్వెస్ట్‌మెంట్ ప్లాన్ లెక్కింపులు 20 నుండి 19వ తేదీ వరకు ప్రస్తుత నెలవారీ సైకిల్‌ను అనవసరంగా మారుస్తాయి. డీల్ స్లిప్‌లు, ETF రిడెంప్షన్‌లను సకాలంలో జారీ చేయడంతో పాటు అన్ని సమయాల్లో మార్కెట్ భాగస్వామ్యాన్ని నిర్ధారించడానికి స్పష్టంగా నిర్వచించబడిన సమయపాలనలను అమలు చేయడానికి కొత్త నిర్ణయాలు ఉపయోగపడతాయని EPFO ​​స్పష్టం చేసింది. కాగా మార్చి 2న జరిగే సమావేశంలో ఈపీఎఫ్‌వో వార్షిక వడ్డీ రేటును నిర్ణయించే ప్రతిపాదన లేదు.

Follow Us