గత వారం తిరుమల శ్రీవారిని దర్శించుకున్న సినీ నటి మీనాక్షి చౌదరి తన ఆధ్యాత్మిక అనుభవాలను ప్రత్యేక వీడియో ద్వారా పంచుకున్నారు. శ్రీవారి దర్శనం ప్రతి సారి కొత్త అనుభూతిని కలిగిస్తుందని ఆమె తెలిపారు. టీటీడీ సిబ్బంది అందిస్తున్న సేవలను ప్రశంసిస్తూ, తిరుమల పర్యటన తనకు ఎంతో ఆనందం ఇచ్చిందన్నారు.