SIP Investment: జస్ట్ సిగరెట్ తాగడం మానేస్తే కోటీశ్వర్లు అవ్వొచ్చు.. అదెలాగో ఇక్కడ చూడండి..
ఈ రోజుల్లో కోటీశ్వరులు కావాలని ఎవరు కోరుకోరు? డబ్బు సంపాదించాలనేది ప్రతి ఒక్కరి కల. ఈ లక్ష్యంలో భాగంగా మీరు పొదుపు కోసం ప్లాన్ చేస్తుంటే.. మిమ్మల్ని కోటీశ్వరులను చేసే ఒక పొదుపు ప్లాన్ గురించి చెప్పబోతున్నాము. అయితే, దీని కోసం మీరు మీ రోజువారీ సిగరెట్ తాగే అలవాటును వదిలివేయాల్సి ఉంటుంది. అవును, మీరు సిగరెట్ కోసం ఖర్చు చేసే డబ్బును ఆదా చేయడం ద్వారా మీరు కోటీశ్వరులు కావచ్చు.
ఈ రోజుల్లో కోటీశ్వరులు కావాలని ఎవరు కోరుకోరు? డబ్బు సంపాదించాలనేది ప్రతి ఒక్కరి కల. ఈ లక్ష్యంలో భాగంగా మీరు పొదుపు కోసం ప్లాన్ చేస్తుంటే.. మిమ్మల్ని కోటీశ్వరులను చేసే ఒక పొదుపు ప్లాన్ గురించి చెప్పబోతున్నాము. అయితే, దీని కోసం మీరు మీ రోజువారీ సిగరెట్ తాగే అలవాటును వదిలివేయాల్సి ఉంటుంది. అవును, మీరు సిగరెట్ కోసం ఖర్చు చేసే డబ్బును ఆదా చేయడం ద్వారా మీరు కోటీశ్వరులు కావచ్చు. అదెలాగో ఇప్పుడు తెలుసుకుందాం..
సాధారణంగా చాలా మంది రోజుకు రూ. 100 విలువైన సిగరెట్స్ తాగుతుంటారు. ఇప్పుడు మీరు ఈ డబ్బును పొదుపు చేసి ఎక్కడైనా పెట్టుబడి పెడితే, భవిష్యత్తులో ఇది మీకు ఉపయోగపడుతుంది. తక్కువ సమయంలో కష్టపడకుండా కోటీశ్వరులు కావాలంటే, ఈ టిప్స్ ఖచ్చితంగా పాటించాల్సిందే.
సిగరెట్ ద్వారా మిలియనీర్ అవ్వడం ఎలా..
స్టాక్ మార్కెట్‌లో ఒడిదుడుకుల కారణంగా అందులో పెట్టుబడులు పెట్టడంపై ప్రజల్లో నమ్మకం పోతుంది. అలాంటి పరిస్థితిలో.. సిస్టమాటిక్ ఇన్వెస్ట్‌మెంట్ ప్లాన్ అంటే SIP లో పెట్టుబడి పెడితే మంచి లాభాలను పొందవచ్చు. అవును, ఒక వ్యక్తి రోజుకు రూ.100 విలువైన సిగరెట్లు తాగితే, ఆ సిగరెట్ తాగే అలవాటు మానుకోవడం ద్వారా ఆ వంద రూపాయలను సేవ్ చేయొచ్చు. అంతేకాదు.. తన ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చు. ఈ సేవింగ్స్.. భవిష్యత్‌లో భారీ సంపదను సృష్టిస్తాయి.
కోటి రూపాయల రాబడి..
మీరు ప్రతిరోజూ 100 రూపాయలను SIPలో పెడితే, అది ఒక నెలలో 3 వేలు అవుతుంది. ఒక సంవత్సరంలో రూ. 36 వేలు ఆదా చేస్తారు. దీనిపై మీరు ఏటా 12% రాబడిని పొందుతారు. ఇప్పుడు మీరు ఈ డబ్బును 30 సంవత్సరాల పాటు పెట్టుబడి పెడితే.. దాదాపు రూ. 1,05,89,741 కోట్లు పొందుతారు. ఇందులో మీ పెట్టుబడి రూ. 10.8 లక్షలు. మీ లాభం లాభం రూ. 95 లక్షలు. అంటే సిగరెట్ మానేసి కోటీశ్వరుడు అవ్వొచ్చన్నమాట.
బహుళ ప్రయోజనాలు..
SIPలో దీర్ఘకాలిక పెట్టుబడి పెట్టడం ద్వరా బహుళ ప్రయోజనాలను పొందుతారు. ఎక్కువ కాలం డబ్బు పెట్టుబడి పెట్టడం ద్వారా లాభాలను ఆర్జిస్తుంది. అయితే, మార్కెట్ ఆధారంగా SIP ప్రభావితమవుతుంది. కావున.. డబ్బును పెట్టుబడి పెట్టే ముందు, తప్పనిసరిగా నిపుణుల సలహా తీసుకోవాలి.
(గమనిక: ఇక్కడ మేము మీకు పెట్టుబడి ఆప్షన్ గురించి మాత్రమే చెప్పడం జరిగింది. దీనిని టీవీ9 తెలుగు ధృవీకరించడం లేదు. ఎక్కడైనా డబ్బును పెట్టుబడి పెట్టే ముందు, ఆర్థిక నిపుణుడిని సంప్రదించి, సలహాలు తీసుకోవాలి.)
మరిన్ని పర్సనల్ ఫైనాన్స్ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..