LIC Policy: మహిళల కోసం ఎల్ఐసీ అద్దిరిపోయే ప్లాన్.. రోజుకు రూ.87 ఇన్వెస్ట్ చేస్తే రూ. 11 లక్షలు పొందొచ్చు..

LIC పథకాలలో డబ్బును పెట్టుబడి పెట్టాలని ఆలోచిస్తున్నారా? ప్రత్యేకంగా మహిళల కోసం LIC అద్దిరిపోయే స్కీమ్స్ అందిస్తోంది. అందులో ఆధార్ శిలా స్కీమ్ మంచి బెనిఫెట్స్ అందిస్తోంది. ఈ పథకంలో పెట్టుబడి పెట్టడం ఎక్కువ లాభాలను పొందవచ్చు. ఈ ప్లాన్‌లో బీమా రక్షణ, పొదుపు ప్రయోజనాలు రెండింటినీ పొందుతారు. మహిళలు రోజుకు రూ.87 డిపాజిట్ చేయడం ద్వారా మెచ్యూరిటీ కాలానికి ఎక్కువ డబ్బును పొందవచ్చు.

LIC Policy: మహిళల కోసం ఎల్ఐసీ అద్దిరిపోయే ప్లాన్.. రోజుకు రూ.87 ఇన్వెస్ట్ చేస్తే రూ. 11 లక్షలు పొందొచ్చు..
Lic Scheme
Follow us
Shiva Prajapati

|

Updated on: Apr 23, 2023 | 6:38 AM

LIC పథకాలలో డబ్బును పెట్టుబడి పెట్టాలని ఆలోచిస్తున్నారా? ప్రత్యేకంగా మహిళల కోసం LIC అద్దిరిపోయే స్కీమ్స్ అందిస్తోంది. అందులో ఆధార్ శిలా స్కీమ్ మంచి బెనిఫెట్స్ అందిస్తోంది. ఈ పథకంలో పెట్టుబడి పెట్టడం ఎక్కువ లాభాలను పొందవచ్చు. ఈ ప్లాన్‌లో బీమా రక్షణ, పొదుపు ప్రయోజనాలు రెండింటినీ పొందుతారు. మహిళలు రోజుకు రూ.87 డిపాజిట్ చేయడం ద్వారా మెచ్యూరిటీ కాలానికి ఎక్కువ డబ్బును పొందవచ్చు.

‘LIC ఆధార్ శిలా’ ప్లాన్ మహిళల కోసం రూపొందించబడిన ఎండోమెంట్, నాన్ లింక్డ్, వ్యక్తిగత జీవిత బీమా పథకం. ఇది పాలసీ వ్యవధిలో మరణం సంభవించినప్పుడు కస్టమర్ల కుటుంబానికి ఆర్థిక రక్షణను అందిస్తుంది. దీర్ఘకాలంలో సంపదను పోగుచేయడంలో సహాయపడుతుంది. 8 నుంచి 55 ఏళ్ల లోపు మహిళలందరూ ఈ పథకంలో పెట్టుబడి పెట్టవచ్చు.

ప్రీమియం ఇలా ఉంటుంది..

ఆధార్ శిలా పాలసీ మెచ్యూరిటీ సమయం కనిష్టంగా 10 నుంచి 20 సంవత్సరాల మధ్య ఉంటుంది. గరిష్టంగా 70 సంవత్సరాలు. ఒక మహిళ ఈ పథకంలో పెట్టుబడి పెట్టాలనుకుంటే.. గరిష్టంగా రూ. 3 లక్షలకు కొనుగోలు చేయవచ్చు. ఇక వాయిదాలను నెలవారీ, త్రైమాసికం, అర్ధ సంవత్సరం, వార్షిక ప్రాతిపదికన కూడా చెల్లించవచ్చు.

ఇవి కూడా చదవండి

ఎంత పెట్టుబడి పెట్టాల్సి వస్తుంది..

మహిళలు తమ 15 ఏళ్ల వయస్సులో రోజుకు 87 రూపాయలు డిపాజిట్ చేస్తే.. ఏడాది కాలంలో రూ.31,755 మొత్తం పొదుపు అవుతుంది. అదేవిధంగా, 10 సంవత్సరాల పాటు డబ్బును డిపాజిట్ చేస్తే రూ. 3,17,550 అవుతుంది. ఆ తర్వాత, మెచ్యూరిటీ సమయంలో మొత్తం సుమారు రూ. 11 లక్షలు పొందుతారు.

మరిన్ని పర్సనల్ ఫైనాన్స్ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..