FD Rates Decreased: కస్టమర్లకు ఆ బ్యాంక్ షాక్.. భారీగా ఎఫ్‌డీ వడ్డీ రేట్ల తగ్గింపు
ఇటీవల ఆర్‌బీఐ రెపో రేట్ విషయంలో యథాతథ స్థితిని కొనసాగిస్తామని తెలియజేయడంతో బ్యాంకుల వడ్డ రేట్ల విషయంలో వెనుకడుగు వేస్తున్నాయి. భవిష్యత్‌లో అన్ని బ్యాంకులు వడ్డీ రేట్లను తగ్గిస్తాయని మార్కెట్ నిపుణులు అంచనా వేశారు.
ప్రస్తుతం బ్యాంకింగ్ రంగంలో వడ్డీ రేట్ల పెంపు ట్రెండ్ నడుస్తుంది. గతేడాది మే నుంచి ఆర్‌బీఐ తీసుకున్న చర్యల కారణంగా అన్ని బ్యాంకులు ఫిక్స్డ్ డిపాజిట్లపై వడ్డీ రేట్లు గణనీయంగా పెంచాయి. అయితే ఇటీవల ఆర్‌బీఐ రెపో రేట్ విషయంలో యథాతథ స్థితిని కొనసాగిస్తామని తెలియజేయడంతో బ్యాంకుల వడ్డీ రేట్ల విషయంలో వెనుకడుగు వేస్తున్నాయి. భవిష్యత్‌లో అన్ని బ్యాంకులు వడ్డీ రేట్లను తగ్గిస్తాయని మార్కెట్ నిపుణులు అంచనా వేశారు. వారి అంచనాలకు తగినట్లే తాజాగా యాక్సిస్ బ్యాంక్ ఎఫ్‌డీలపై వడ్డీ రేట్లను తగ్గిస్తున్నట్లు పేర్కొంది. యాక్సిస్ బ్యాంక్ 7 రోజుల నుంచి 10 సంవత్సరాల కాలవ్యవధిలో ఉన్న డిపాజిట్లపై వడ్డీ రేటును తగ్గిస్తామని వివరించింది. పైగా సవరించిన వడ్డీ రేట్లు ఏప్రిల్ 21, 2023 నుంచి అమల్లోకి వస్తాయని బ్యాంకు ప్రతినిధులు పేర్కొన్నారు. తాజా తగ్గింపు తర్వాత యాక్సిస్ బ్యాంక్ అందిస్తున్న వడ్డీ రేట్లు ఏ విధంగా ఉన్నాయో? ఓ సారి తెలుసుకుందాం.
సవరించిన వడ్డీ రేట్లు ఇలా
- 7 రోజుల నుండి 45 రోజుల వరకు సాధారణ ప్రజలకు 3.50 శాతం, సీనియర్ సిటిజన్లకు 3.50 శాతం
- 46 రోజుల నుండి 60 రోజుల వరకు సాధారణ ప్రజలకు 4.00 శాతం, సీనియర్ సిటిజన్లకు 4.00 శాతం
- 61 రోజుల నుండి 3 నెలల కంటే తక్కువ సమయంలో వరకు సాధారణ ప్రజలకు 4.50 శాతం, సీనియర్ సిటిజన్లకు 4.50 శాతం
- 3 నెలల నుండి 4 నెలల కంటే తక్కువ సాధారణ ప్రజలకు 4.75 శాతం, సీనియర్ సిటిజన్లకు 4.75 శాతం
- 6 నెలల నుండి 7 నెలల కంటే తక్కువ సమయం వరకు సాధారణ ప్రజలకు 5.75 శాతం, సీనియర్ సిటిజన్లకు 6.00 శాతం
- 9 నెలల నుండి 10 నెలల కంటే తక్కువ సమయం వరకు సాధారణ ప్రజలకు 6.00 శాతం, సీనియర్ సిటిజన్లకు 6.25 శాతం
- 1 సంవత్సరం నుండి 1 సంవత్సరం కంటే తక్కువ 11 రోజుల కంటే తక్కువ సమయం వరకు సాధారణ ప్రజలకు 6.80 శాతం, సీనియర్ సిటిజన్లకు 7.55 శాతం
- 1 సంవత్సరం 25 రోజుల నుండి 13 నెలల కంటే తక్కువ రోజుల వరకు సాధారణ ప్రజలకు 7.10 శాతం, సీనియర్ సిటిజన్లకు 7.85 శాతం
- 3 నెలల నుండి 18 నెలల కంటే తక్కువ సమయం వరకు సాధారణ ప్రజలకు 7.15 శాతం, సీనియర్ సిటిజన్లకు 7.90 శాతం
- 18 నెలల నుండి 2 సంవత్సరాల కంటే తక్కువ సమయం వరకు సాధారణ ప్రజలకు 7.15 శాతం, సీనియర్ సిటిజన్లకు 7.90 శాతం
- 2 సంవత్సరాల నుండి 30 నెలల కంటే తక్కువ సమయం వరకు సాధారణ ప్రజలకు 7.20 శాతం, సీనియర్ సిటిజన్లకు 7.95 శాతం
- 30 నెలల నుండి 10 సంవత్సరాల కంటే తక్కువ సమయం వరకు సాధారణ ప్రజలకు 7.00 శాతం, సీనియర్ సిటిజన్లకు 7.75 శాతం
మరిన్ని బిజినెస్ న్యూస్ కోసం