Credit Card Benefits: క్రెడిట్ కార్డును ఇలా ఉపయోగిస్తే చాలా బెనిఫిట్స్ ఉంటాయి.. వివరాలివే..
క్రెడిట్ కార్డ్‌ని ఉపయోగించే వారికి ఈ వార్త ఖచ్చితంగా ఉపకరిస్తుంది. చాలా మంది క్రిడెట్ కార్డును విచ్చలవిడిగా వినియోగించి, ఆ తరువాత దాని బిల్లులను చెల్లించేందుకు ఆపసోపాలు పడుతుంటారు. అంతేకాదు.. అనేక సందర్భాల్లో బిల్లులు చెల్లించడానికి మాత్రమే క్రెడిట్ కార్డును ఉపయోగిస్తుంటారు. కానీ, దీన్ని ఇతర మార్గాల్లో కూడా ఉపయోగించవచ్చని మీకు తెలుసా? అవును, క్రెడిట్ కార్డ్‌ని ఎలాంటి ప్రయోజనాల కోసం
క్రెడిట్ కార్డ్‌ని ఉపయోగించే వారికి ఈ వార్త ఖచ్చితంగా ఉపకరిస్తుంది. చాలా మంది క్రిడెట్ కార్డును విచ్చలవిడిగా వినియోగించి, ఆ తరువాత దాని బిల్లులను చెల్లించేందుకు ఆపసోపాలు పడుతుంటారు. అంతేకాదు.. అనేక సందర్భాల్లో బిల్లులు చెల్లించడానికి మాత్రమే క్రెడిట్ కార్డును ఉపయోగిస్తుంటారు. కానీ, దీన్ని ఇతర మార్గాల్లో కూడా ఉపయోగించవచ్చని మీకు తెలుసా? అవును, క్రెడిట్ కార్డ్‌ని ఎలాంటి ప్రయోజనాల కోసం ఉపయోగించవచ్చు? దాని ప్రయోజనాలు ఏంటి? అనేది ఇవాళ మనం తెలుసుకుందాం..
‘మేము తరచుగా క్రెడిట్ కార్డుతో షాపింగ్ చేస్తాము. అనవసరంగా ఖర్చు చేస్తాము. తర్వాత నష్టపరిహారం చెల్లించాల్సి వస్తుంది. మేము దానిని సరిగ్గా ఉపయోగించుకోలేకపోతున్నాము.’ అని చాలా మంది వాపోతుంటారు. అయితే, ఈ చింత అవసరం లేదు. క్రెడిట్ కార్డును సరైన మార్గంలో సద్వినియోగం చేసుకుంటే అన్ని భెనిఫిట్సే ఉంటాయి.
ఈ విధంగా క్రెడిట్ కార్డును ఉపయోగించవచ్చు..
గ్రేస్ పీరియడ్ పొందండి: క్రెడిట్ కార్డ్ ఉత్తమ ప్రయోజనం ఏంటంటే ఇది మీకు గ్రేస్ పీరియడ్‌ను అందిస్తుంది. మీరు మీ అవసరాలకు క్రెడిట్ కార్డ్‌ని ఉపయోగించి, అదే నెలలో మొత్తాన్ని చెల్లించినట్లయితే, దానిపై వడ్డీ కట్టాల్సిన పని లేకుండా చెల్లింపులు చేయొచ్చు. గ్రేస్ పీరియడ్ 18 రోజుల నుండి 55 రోజుల వరకు ఉంటుంది.
క్రెడిట్ స్కోరు: మీరు క్రెడిట్ కార్డ్ చెల్లింపును సకాలంలో చెల్లిస్తే, అది మీ క్రెడిట్ స్కోర్ పెరిగేందుకు దోహదపడుతుంది. ఇది మీ క్రెడిట్ పరిమితిని నేరుగా ప్రభావితం చేస్తుంది. భవిష్యత్తులో ఎప్పుడైనా రుణం తీసుకోవడానికి మీకు సహాయపడుతుంది.
రివార్డ్ పాయింట్లు, క్యాష్‌బ్యాక్: తరచుగా క్రెడిట్ కార్డ్‌ని ఉపయోగిస్తుంటే.. రివార్డ్ పాయింట్‌లు, గిఫ్ట్ కార్డ్‌లు, అనేక వోచర్‌లు, భారీ డిస్కౌంట్స్ పొందే అవకాశం ఉంటుంది.
EMI సౌకర్యం: ఖరీదైన వస్తువులు, మరేదైనా కొనుగోలు చేయాలనుకుంటే క్రెడిట్ కార్డ్ ద్వారా EMIలో కొనుగోలు చేయవచ్చు. ఆ తరువాత ప్రతి నెలా వాయిదాగా చెల్లించవచ్చు. బ్యాంకులు నో కాస్ట్ EMI సౌకర్యాన్ని కూడా అందిస్తాయి. ఇది 3 నుండి 9 నెలల EMI కి వర్తిస్తుంది.
మరిన్ని పర్సనల్‌ఫైనాన్స్ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..