Credit Card Tips: క్రెడిట్ కార్డును ఇలా వినియోగిస్తే రెండింతల ప్రయోజనం.. లేకుంటే తీవ్ర నష్టం.. పూర్తి వివరాలు ఇవి..

నిర్ధిష్ట కాలపరిమితితో వడ్డీ రహిత నగదును క్రెడిట్ కార్డు ద్వారా వినియోగించుకోవచ్చు. అలాగే రివార్డు పాయింట్లను క్యాష్ చేసుకోవచ్చు. వివిధ ప్లాట్ ఫారమ్ లలో క్రెడిట్ కార్డుల పై అందించే ఆఫర్ లను సద్వినియోగం చేసుకోవచ్చు. దీనికి చేయాల్సిందల్లా సమయానికి బిల్లులు చెల్లించడమే.

Credit Card Tips: క్రెడిట్ కార్డును ఇలా వినియోగిస్తే రెండింతల ప్రయోజనం.. లేకుంటే తీవ్ర నష్టం.. పూర్తి వివరాలు ఇవి..
Credit Card
Follow us
Madhu

|

Updated on: Apr 23, 2023 | 6:00 PM

క్రెడిట్ కార్డు.. అత్యవసర సమయాల్లో ఉపయోగపడే అద్భుత సాధనం. కానీ అది సక్రమంగా వినియోగించినప్పుడే దాని ప్రయోజనాలు పొందగలం. ఇంకా బాగా చెప్పాలంటే క్రెడిట్ కార్డును తెలివిగా వినియోగించడం రావాలి. అప్పుడు దాని నుంచి అధిక ప్రయోజనాలు పొందగలం. నిర్ధిష్ట కాలపరిమితితో వడ్డీ రహిత నగదును క్రెడిట్ కార్డు ద్వారా వినియోగించుకోవచ్చు. అలాగే రివార్డు పాయింట్లను క్యాష్ చేసుకోవచ్చు. వివిధ ప్లాట్ ఫారమ్ లలో క్రెడిట్ కార్డుల పై అందించే ఆఫర్ లను సద్వినియోగం చేసుకోవచ్చు. దీనికి చేయాల్సిందల్లా సమయానికి బిల్లులు చెల్లించడమే. అలా చేస్తే మీ క్రెడిట్ స్కోర్ బాగుటుంది. పొరపాటున బిల్లుల చెల్లింపుల్లో అలసత్వం ప్రదర్శిస్తే మాత్రం క్రెడిట్ స్కోర్ దారుణంగా దెబ్బతింటుంది. ఈ నేపథ్యంలో అసలు క్రెడిట్ కార్డు ఎలా వాడాలి? ఎలా వాడకూడదో తెలుసుకుందాం రండి..

క్రెడిట్ కార్డు ప్రయోజనాలు ఇవి..

వడ్డీ రహిత నగదు.. ప్రతి క్రెడిట్ కార్డుపై నిర్ధిష్ట పరిమితి ఉంటుంది. ఆ పరిమితి వరకూ నగదును మీరు వినియోగించుకోవచ్చు. అది మీ నగదు కాదు. బ్యాంకు మీకు ఉచితంగా ఇస్తున్న నగదు. క్యాష్ రూపంలో కాకుండా క్రెడిట్ కార్డు వినియోగించి ఏదైనా వస్తువులు కొనుగోలు చేయడం, లేదా ఆన్ లైన్ షాపింగ్ చేయడం ద్వారా అధిక ప్రయోజనం ఉంటుంది. ఖర్చు చేసిన మొత్తాన్ని బిల్లు రూపంలో నిర్ణీత తేదికి చెల్లిస్తే ఎటువంటి వడ్డీ కూడా ఆ మొత్తం పడదు. ఆ బిల్లు తేదీ దాటిపోతే మాత్రం కచ్చితంగా అధిక వడ్డీ వసూలు చేస్తారు. అందుకే బిల్లు సమయానికి ఖర్చు చేసిన మొత్తాన్ని చెల్లించాలి. అందుకోసం మీరు ఓ పనిచేయొచ్చు. మీరు ఈ రోజు కొంత మొత్తాన్ని క్రెడిట్ కార్డు ద్వారా ఖర్చు చేశారనుకోండి. అంతే మొత్తాన్ని తీసుకొని వేరే బ్యాంకు ఖాతాలోకి జమ చేయండి. దీనివల్ల మీ బిల్లింగ్ గేట్ రాగానే ఆ ఖాతాలోని మొత్తాన్ని మీరు చెల్లించే వీలుంటుంది.

రివార్డులు.. క్రెడిట్ కార్డు వినియోగిస్తే అదనపు ప్రయోజనం రివార్డు పాయింట్లు. మీరు క్రెడిట్ కార్డు పై చేసే ప్రతి కొనుగోలుపై మీకు రివార్డులు వస్తాయి. మీరు కార్డు రకం.. అందులోని ఫీచర్లను బట్టి రివార్డులు ఆధారపడి ఉంటాయి. కొన్నింటికీ క్యాష్ బ్యాక్ రావొచ్చు. లేదా మరికొన్ని ప్రయోజనాలు అందించవచ్చు. గిఫ్ట్ ఓచర్లు, రివార్డు పాయింట్లను రీడీమ్ చేసుకొని మరొక వస్తువులను ఉచితంగా పొందవచ్చు.

ఇవి కూడా చదవండి

మంచి క్రెడిట్ హిస్టరీ.. మీరు క్రెడిట్ కార్డును సక్రమంగా వినియోగిస్తే మీ క్రెడిట్ స్కోర్ బాగుంటుంది. అంటే సమయానికి మీరు క్రెడిట్ కార్డు బిల్లులు చెల్లిస్తే క్రెడిట్ స్కోర్ మంచిగా డెవలప్ అవుతుంది. అలాంటప్పుడు మీకు కారు లోన్లు, పర్సనల్ లోన్లు సులభంగా బ్యాంకర్లు అందిస్తారు.

ఫ్రాడ్ ప్రివెన్షన్.. క్రెడిట్ కార్డులో ఉండే మరో అద్భుత ఆప్షన్ ఈ ఫ్రాడ్ ప్రివెన్షన్. ప్రతి క్రెడిట్ కార్డు ప్రొటెక్షన్ కోసం కంపెనీలు బిల్ట్ ఇన్ ప్లాన్లు అందిస్తాయి. వాటిని కార్డు దొంగిలించినప్పుడు లేదా పోయినప్పుడు వినియోగించుకోవచ్చు. లేదా మీరు ఏదైనా ఓ వస్తువును మార్కెట్లో క్రెడిట్ కార్డు ద్వారా కొనుగోలు చేశారనుకోండి దాని కండీషన్ బాగోకపోతే.. అప్పుడు మీరు చార్జ్ బ్యాక్ ఆప్షన్ ద్వారా నగదు వెనక్కి తీసుకోవచ్చు.

బీమా సదుపాయం.. క్రెడిట్ కార్డుల్లో ఉన్న మరో ఆప్షన్ బీమా సదుపాయం. చాలా క్రెడిట్ కార్డులు అనేక రకాల బీమా ప్లాన్లను అందిస్తాయి. ప్రమాద బీమా, కొనుగోలు సంరక్షణ, ప్రయాణ బీమా వంటి అనేక రకాలుంటాయి. వాటిని వినియోగించుకోవచ్చు. అయితే, ఆ బీమా ప్రయోజనాలకు సంబంధించిన బ్యాంక్ నిబంధనలు, షరతులను జాగ్రత్తగా తనిఖీ చేయడం చాలా అవసరం.

నష్టాలు కూడా ఉన్నాయండోయ్..

మితిమీరిన ఖర్చు.. ప్రతి క్రెడిట్ కార్డుకు ఓ పరిమితి ఉంటుంది. అయితే లిమిట్ ఉందికదా అని విపరీతంగా ఖర్చు చేయకూడదు. మీరు ఎంత చెల్లించే సామర్థ్యం ఉంది? ఎంత చెల్లించగలరో అవగాహనకు రావాలి. ఆ మేరకే మీ ఖర్చులు ఉండాలి. ఎక్కువ ఖర్చు చేసి.. తిరిగి వాటిని చెల్లించలేక ఇబ్బందులు పడాల్సి వస్తుంది.

అధిక వడ్డీ రేటు.. మీ బిల్లింగ్ సమయం దాటనంత వరకూ క్రెడిట్ కార్డు చాలా మంచిది. అలాకాకుండా బిల్లింగ్ సమయం మరచిపోతే మాత్రం చాలా నష్టపోవాల్సి వస్తుంది. బ్యాంకర్లు అవుట్ స్టాండింగ్ మొత్తంపై అధిక వడ్డీని వసూలు చేస్తాయి. అవి 15 శాతం నుంచి 50 శాతం వరకూ కూడా ఉంటాయి. అందుకే బిల్లులు సమయానికి చెల్లించాలి. అలా కాని పక్షంలో మీ బిల్లులను ఈఎంఐ కింద మార్చుకోవాలి.

సిబిల్ స్కోర్ దెబ్బతింటుంది.. క్రెడిట్ కార్డ్‌లు మీ క్రెడిట్ స్కోర్‌ను నిర్మించడంలో మీకు సహాయపడతాయి. కానీ సక్రమంగా వినియోగించకపోతే అవి మీ క్రెడిట్ చరిత్రను కూడా నాశనం చేస్తాయి. మీరు మీ క్రెడిట్ కార్డ్ బిల్లును సకాలంలో చెల్లించడంలో విఫలమైతే, అది మీ క్రెడిట్ చరిత్రపై చెడు ప్రభావం చూపుతుంది. అందుకే మీ ఖర్చులు అదుపులో ఉండాలి. బిల్లులు సమయానికి చెల్లించాలి. మీరు తిరిగి చెల్లించగలిగే మొత్తంలోనే మీ ఖర్చులుండాలి.

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

గాలి నింపుతుండగా పేలిన బస్సు టైరు.! గాల్లోకి ఎగిరిపడ్డ మెకానిక్‌.
గాలి నింపుతుండగా పేలిన బస్సు టైరు.! గాల్లోకి ఎగిరిపడ్డ మెకానిక్‌.
పేగు క్యాన్సర్ కేసులు ఇండియాలో ఎందుకు పెరుగుతున్నాయి?కారణం ఇదేనా?
పేగు క్యాన్సర్ కేసులు ఇండియాలో ఎందుకు పెరుగుతున్నాయి?కారణం ఇదేనా?
వేటాడిన ఉక్రెయిన్‌ డ్రోన్లు.. తోక ముడిచిన కిమ్‌ సైనికులు.!
వేటాడిన ఉక్రెయిన్‌ డ్రోన్లు.. తోక ముడిచిన కిమ్‌ సైనికులు.!
మనాలీని కమ్మేసిన మంచు.. నిలిచిపోయిన వేలాది వాహనాలు.!
మనాలీని కమ్మేసిన మంచు.. నిలిచిపోయిన వేలాది వాహనాలు.!
ఎల్ఈడీ బల్బుల మధ్య చామంతి సాగు.. యువరైతుకు భారీ లాభాలు.!
ఎల్ఈడీ బల్బుల మధ్య చామంతి సాగు.. యువరైతుకు భారీ లాభాలు.!
ప్లేట్‌లెట్స్‌ పడిపోయాయా.. ఈ ఆహారంతో సహజంగా పెంచుకోండి.!
ప్లేట్‌లెట్స్‌ పడిపోయాయా.. ఈ ఆహారంతో సహజంగా పెంచుకోండి.!
రెండు సిమ్‌లు వాడేవారికి గుడ్‌న్యూస్‌.! టెలికాం కంపెనీలకు ఆదేశం..
రెండు సిమ్‌లు వాడేవారికి గుడ్‌న్యూస్‌.! టెలికాం కంపెనీలకు ఆదేశం..
విమానంలోనూ గరమ్ గరమ్ చాయ్ చాయ్.! వీడియో వైరల్..
విమానంలోనూ గరమ్ గరమ్ చాయ్ చాయ్.! వీడియో వైరల్..
పొరపాటున హుండీలో పడిన ఓ వ్యక్తి ఐఫోన్‌.. సీన్ కట్ చేస్తే.. వీడియో
పొరపాటున హుండీలో పడిన ఓ వ్యక్తి ఐఫోన్‌.. సీన్ కట్ చేస్తే.. వీడియో
సన్నీ లియోన్‌ అకౌంట్‌లోకి ప్రభుత్వ పథకం నిధులు..!
సన్నీ లియోన్‌ అకౌంట్‌లోకి ప్రభుత్వ పథకం నిధులు..!