AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

PAK vs ENG: ఇంగ్లీషోళ్ల చేతిలో 17 ఏళ్లుగా బడిత పూజే.. ఒక్క మ్యాచ్‌లోనూ గెలవని పాకిస్తాన్.. కట్‌చేస్తే..

Pakistan: టీ20 వరల్డ్ కప్ 2026లో పాకిస్థాన్ జట్టు తీవ్రమైన ఒత్తిడిలో పడింది. 17 ఏళ్లుగా ఒక్కసారి కూడా గెలవలేని జట్టుతోనే ఇప్పుడు కీలక మ్యాచ్ ఆడాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఈ మ్యాచ్ సెమీఫైనల్ రేస్‌లో పాకిస్థాన్‌కు అత్యంత ముఖ్యమైనదిగా మారింది.

PAK vs ENG: ఇంగ్లీషోళ్ల చేతిలో 17 ఏళ్లుగా బడిత పూజే.. ఒక్క మ్యాచ్‌లోనూ గెలవని పాకిస్తాన్.. కట్‌చేస్తే..
Pakistan Cricket
Venkata Chari
|

Updated on: Feb 24, 2026 | 12:08 PM

Share

PAK vs ENG: టీ20 వరల్డ్ కప్ 2026 సూపర్-8 దశలో పాకిస్థాన్‌కు చారిత్రాత్మక సవాల్ ఎదురైంది. సూపర్-8లో పాకిస్థాన్ ఆడాల్సిన తొలి మ్యాచ్ వర్షం కారణంగా రద్దయ్యింది. అందుకే మిగిలిన మ్యాచ్‌లలో తప్పనిసరిగా గెలిచి సెమీఫైనల్ టికెట్ సాధించాల్సిన పరిస్థితి. అయితే, పాకిస్థాన్ ముందున్న పెద్ద సవాల్ ఏంటంటే – టీ20 వరల్డ్ కప్ చరిత్రలో ఎప్పుడూ గెలవని జట్టుతోనే తలపడాల్సి రావడం.

సెమీస్ చేరాలంటే.. చరిత్రను మార్చాల్సిందే..

పాకిస్థాన్ తదుపరి మ్యాచ్ ఇంగ్లాండ్‌తో కాండీలోని పల్లెకెలె ఇంటర్నేషనల్ స్టేడియంలో జరగనుంది. ఈ మ్యాచ్ పాకిస్థాన్‌కు ఎంతో కీలకం. ఎందుకంటే టీ20 వరల్డ్ కప్‌లో ఇప్పటివరకు పాకిస్థాన్ ఎప్పుడూ ఇంగ్లాండ్‌ను ఓడించలేకపోయింది. 2009లో తొలిసారి ఇంగ్లాండ్‌తో టి20 వరల్డ్ కప్‌లో తలపడిన పాకిస్థాన్, ఈ 17 ఏళ్లలో ఒక్క విజయాన్నీ నమోదు చేయలేకపోయింది. ఫిబ్రవరి 24న జరిగే ఈ మ్యాచ్‌లో పాకిస్థాన్ గెలిస్తే, అది టీ20 వరల్డ్ కప్ చరిత్రలో ఇంగ్లాండ్‌పై తొలి విజయం అవుతుంది.

ప్రతిసారీ పాకిస్థాన్‌కు పరాజయం..

టీ20 వరల్డ్ కప్‌లో ఇంగ్లాండ్ – పాకిస్థాన్ మధ్య ఇప్పటివరకు 3 మ్యాచ్‌లు జరిగాయి. మూడు సార్లూ పాకిస్థాన్ ఓటమిపాలైంది.

2009 గ్రూప్ దశలో ఇంగ్లాండ్ 48 పరుగుల తేడాతో గెలిచింది.

2010 సూపర్-8 రౌండ్‌లో 6 వికెట్ల తేడాతో పాకిస్థాన్ ఓడింది.

చివరిసారిగా 2022 టీ20 వరల్డ్ కప్ ఫైనల్లో ఇంగ్లాండ్ 5 వికెట్ల తేడాతో పాకిస్థాన్‌ను ఓడించి ట్రోఫీని కైవసం చేసుకుంది.

మొత్తం టీ20 అంతర్జాతీయ మ్యాచ్‌ల్లో కూడా ఇంగ్లాండ్ ఆధిపత్యం కొనసాగుతోంది. రెండు జట్ల మధ్య జరిగిన 31 మ్యాచ్‌ల్లో ఇంగ్లాండ్ 21 విజయాలు సాధించగా, పాకిస్థాన్ 9 మాత్రమే గెలిచింది. ఒక మ్యాచ్ ఫలితం తేలలేదు. కాబట్టి ఈ మ్యాచ్ పాకిస్థాన్‌కు కేవలం పాయింట్ల కోసమే కాదు, మానసికంగా, చారిత్రాత్మకంగా ఉన్న భారం తీరిపోయే అవకాశం కూడా. అయితే ఇంగ్లాండ్ ప్రస్తుతం మంచి ఫామ్‌లో ఉంది. సూపర్-8లో ఇప్పటికే ఒక మ్యాచ్ గెలిచిన ఇంగ్లాండ్‌తో ఈ పోరు ఉత్కంఠభరితంగా సాగనుంది.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Follow Us
అభిషేక్‎ను వెనక్కి నెట్టి ఆరెంజ్ క్యాప్ కొట్టేసిన కేఎల్ రాహుల్
అభిషేక్‎ను వెనక్కి నెట్టి ఆరెంజ్ క్యాప్ కొట్టేసిన కేఎల్ రాహుల్
ఛీ కొట్టిన వాళ్లే హారతి పట్టి మరీ టీమిండియాలోకి రమ్మంటున్నారుగా..
ఛీ కొట్టిన వాళ్లే హారతి పట్టి మరీ టీమిండియాలోకి రమ్మంటున్నారుగా..
పసిడి ప్రియులకు పండగే..! మరింత తగ్గిన ధరలు.. హైదరాబాద్‌లో తులం
పసిడి ప్రియులకు పండగే..! మరింత తగ్గిన ధరలు.. హైదరాబాద్‌లో తులం
సప్త సాగరాలు దొటొచ్చి తమిళ రాజకీయాను షేక్ చేసిన ఒకే ఒక్కడు
సప్త సాగరాలు దొటొచ్చి తమిళ రాజకీయాను షేక్ చేసిన ఒకే ఒక్కడు
పీఎం కిసాన్ లబ్దిదారులకు కేంద్రం బిగ్ అప్డేట్.. ఈ పని చేస్తేనే..
పీఎం కిసాన్ లబ్దిదారులకు కేంద్రం బిగ్ అప్డేట్.. ఈ పని చేస్తేనే..
ట్రెండింగ్ లో త్రిష పేరు.. ఇప్పుడు పూజా హెగ్డే
ట్రెండింగ్ లో త్రిష పేరు.. ఇప్పుడు పూజా హెగ్డే
2040లో లవ్, బ్రేకప్స్ ఇలా ఉంటాయా? OTTలోకి వచ్చేసిన కొత్త సినిమా
2040లో లవ్, బ్రేకప్స్ ఇలా ఉంటాయా? OTTలోకి వచ్చేసిన కొత్త సినిమా
బుధవారం ఇలా చేస్తే శుభం.. విజయం మీది! కానీ అప్పు మాత్రం వద్దు..
బుధవారం ఇలా చేస్తే శుభం.. విజయం మీది! కానీ అప్పు మాత్రం వద్దు..
నయా లుక్‌తో మైండ్ బ్లాక్ చేస్తున్న వెండితెర చందమామ
నయా లుక్‌తో మైండ్ బ్లాక్ చేస్తున్న వెండితెర చందమామ
కాకరకాయ ఇష్టపడని వారు కూడా లొట్టలేస్తూ తినే రెసిపీ
కాకరకాయ ఇష్టపడని వారు కూడా లొట్టలేస్తూ తినే రెసిపీ