AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

High Heels Side Effects: స్టైల్‏గా కనిపించడం కోసం హైహీల్స్ వేసుకుంటున్నారా.. అయితే ప్రమాదాన్ని దగ్గర చేసుకుంటున్నట్టే..

ప్రస్తుతం హైహీల్స్ ధరించడం ట్రెండ్‌గా మారింది. కాలేజీకి వెళ్లినా, ఆఫీస్‌కి వెళ్లినా అమ్మాయిలు ఎక్కుగా వాడుతున్నారు. కానీ ఎక్కువ సేపు హైహీల్స్ వేసుకోవడం వల్ల కూడా చాలా అనర్థాలు కలుగుతాయని మీకు తెలుసా..

High Heels Side Effects: స్టైల్‏గా కనిపించడం కోసం హైహీల్స్ వేసుకుంటున్నారా.. అయితే ప్రమాదాన్ని దగ్గర చేసుకుంటున్నట్టే..
High Heels
Sanjay Kasula
|

Updated on: Apr 28, 2023 | 9:59 PM

Share

ఈ రోజుల్లో అమ్మాయిలు తమను తాము స్టైలిష్‌గా మార్చుకోవడానికి అన్ని ప్రయత్నాలను చేస్తున్నారు. ఇటు డ్రెస్సింగ్‌లో వెస్ట్రన్‌ లుక్‌ కోసం తమను తాము మార్చుకుంటున్నారు. హెయిర్ కట్టింగ్ నుంచి మొదలూ చెప్పుల వరకు అంతా కొత్తదనం కోసం పాకులాడుతున్నారు. తెచ్చిపెట్టుకున్న అందం రాబోయే రోజుల్లో తమ ఆరోగ్యంపై భారీ ప్రభావం పడుతుందని ఊహించలేకపోతున్నారు. కాలేజీ అమ్మాయిలే కాదు ఆఫీసులో పని చేసే ఉద్యోగులు కూడా హైహీల్స్ ధరించడానికి ఇష్టపడుతున్నారు. కొంతమంది అమ్మాయిలు హైహీల్స్‌లో చాలా సౌకర్యవంతంగా ఉంటుందని మురిసి పోతుంటారు. వారు చాలా గంటలు ఇలా ధరించవచడం వల్లే అనే దీర్ఘకాలిక సమస్యలకు స్వాగతం చెబుతున్నమనే ఆలోచనను మరిచిపోతున్నారు.

ఇలా హైహీల్స్‌ ధరించి సులభంగా డ్యాన్స్ చేయవచ్చు. ఇది 20 లేదా 30 సంవత్సరాల వయస్సు వరకు హానికరంగా అనిపించదు. మీ వయసు 40 సంవత్సరాల వచ్చే సమయానికి మీ ఎముక తీవ్రంగా దెబ్బతింటుంది. దీని వల్ల శరీరం కింది భాగంలో కూడా సమస్యలు తలెత్తుతాయి.

రెగ్యులర్ హైహీల్స్ ధరించే అమ్మాయిలు మరింత ప్రమాదకరమైన నష్టాలను తెచ్చుకుంటారు. పాదాలు కాకుండా, హై హీల్స్ వెన్నెముక, తుంటి ఎముకలను కూడా చెడిపోయే ప్రమాదం ఉంటుంది. 30 ఏళ్ల తర్వాత ఇది మరింత హానికరం (హై హీల్స్ సైడ్ ఎఫెక్ట్స్). దాని దుష్ప్రభావాలు తెలుసుకుందాం…

గజ్జల నొప్పి

స్టైలిష్ గా కనిపించడం సరైనదే కానీ ఆరోగ్యాన్ని ఏమాత్రం నిర్లక్ష్యం చేయకూడదు. మీ కంఫర్ట్ జోన్‌ను కూడా జాగ్రత్తగా చూసుకోండి.హై హీల్స్ ఉండే పాదాలకు పూర్తిగా సపోర్టు ఇవ్వవు. పాదాలపై సమతుల్య బరువు లేకపోవడం వల్ల భరించలేని నొప్పి మొదలవుతుంది. నేషనల్ లైబ్రరీ ఆఫ్ మెడిసిన్ అధ్యయనం ప్రకారం, నడుము, తుంటి చుట్టూ ఎక్కువగా ప్రభావితమవుతుంది. దీని కారణంగా, ఈ భాగం ఉమ్మడి తీవ్రంగా ప్రభావితమవుతుంది. కండరాలు దృఢంగా మారిపోతాయి.

మడిమలలో భరించలేని నొప్పి

హైహీల్స్ వేసుకోవడం వల్ల మడిమలలో నొప్పి వస్తుంది. దాని దుష్ప్రభావాలు కూడా కనిపిస్తాయి. హైహీల్స్ ధరించడం వల్ల మడమల సిరలు చుట్టుకుపోతాయి. విపరీతమైన నొప్పిని కలిగిస్తుంది.

చీలమండ నొప్పి

హై హీల్స్ ఫ్యాషన్, స్టైల్‌తో పాటు పాదాల ఆకారాన్ని బట్టి తయారు చేయబడతాయి. అయితే అందరి చీలమండ పరిమాణం, వంపు ఒకేలా ఉండవు. అందుకే హై హీల్స్ అందరికీ సరిగ్గా సరిపోవు. బరువు సమతుల్యం కోల్పోవడం వల్ల.. చీలమండలలో నొప్పి వస్తుంది. ఎక్కువ సేపు హీల్స్ ధరించడం వల్ల కాలి నుండి వంపు, చీలమండల వరకు చాలా నొప్పి వస్తుంది.

రక్త నాళాలకు నష్టం

హైహీల్స్ ఆకృతి కారణంగా, పాదాల ముందు భాగం చిన్న ప్రదేశంలో సరిపోయేలా ప్రయత్నిస్తుంది. ఎక్కువ కాలం ఈ స్థితిలో ఉండటం చెడు ప్రభావాన్ని కలిగి ఉంటుంది. నేషనల్ లైబ్రరీ ఆఫ్ మెడిసిన్ అధ్యయనం ప్రకారం, హైహీల్స్ లేదా మరేదైనా కారణాల వల్ల పాదాలు చాలా కాలం పాటు కుదించబడి ఉంటే, అప్పుడు రక్త ప్రసరణకు ఆటంకం ఏర్పడే ప్రమాదం ఉంది. విరిగిపోయే ప్రమాదం మరియు పగిలిపోయే ప్రమాదం కూడా ఉంది.

మోకాలిపై ప్రతికూల ప్రభావం

హైహీల్స్ అతిపెద్ద ప్రభావం మోకాలి కీలుపై ఉంటుంది. దీన్ని ధరించడం ద్వారా, మోకాలు కొద్దిగా వక్ర పరిమాణంలో ఉంటాయి. అటువంటి పరిస్థితిలో, కీళ్ల నొప్పులు చాలా సార్లు పెరుగుతాయి. భరించలేని నొప్పి మిమ్మల్ని ఇబ్బంది పెట్టవచ్చు. రోజూ హైహీల్స్ ధరించడం వల్ల ఆస్టియో ఆర్థరైటిస్ వచ్చే ప్రమాదం కూడా ఉంది.

(నోట్‌: ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. ఆరోగ్య నిపుణుల సలహాల మేరకు అందించడం జరుగుతుంది. ఏదైనా సందేహాలు ఉంటే వైద్య నిపుణులను సంప్రదించండి.)

మరిన్ని హెల్త్ న్యూస్ కోసం