AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

రాత్రి 11 గంటల వరకు మేల్కోని ఉండే వారికి అలర్ట్‌.. కొబ్బరి బోండంలాంటి పొట్ట, బట్టతల ఇంకా..

సాధారణంగా రాత్రి 11 గంటల వరకు మేల్కొని ఉండటం, రాత్రి సమయంలో నిద్రపోకపోవడం మన జీవక్రియను ప్రభావితం చేస్తుంది. నిద్ర సమయం - బరువు మధ్య సంబంధాన్ని మీరు సరిగ్గా అర్థం చేసుకోకపోతే ఈ రకమైన సమస్య వస్తుంది. కాబట్టి బరువు తగ్గాలనుకునే వారు..

రాత్రి 11 గంటల వరకు మేల్కోని ఉండే వారికి అలర్ట్‌.. కొబ్బరి బోండంలాంటి పొట్ట, బట్టతల ఇంకా..
Late Night Sleep And Obesity
Srilakshmi C
|

Updated on: Feb 24, 2026 | 1:46 PM

Share

బరువు తగ్గడం అంటే కేవలం కేలరీలను లెక్కించడం, చెమట పట్టడం, వ్యాయామం చేయడం మాత్రమే కాదు. శరీరం దాని జీవ గడియారాన్ని సరిగ్గా అర్థం చేసుకోవాలి. చాలా మందికి ఇది తెలియదు. దీన్ని సరిగ్గా అర్థం చేసుకోకుండా ఎంత ఆహార నియమాలు పాటించినా, వ్యాయామం చేసినా ప్రయోజనకరంగా ఉండదు. సాధారణంగా రాత్రి 11 గంటల వరకు మేల్కొని ఉండటం, రాత్రి సమయంలో నిద్రపోకపోవడం మన జీవక్రియను ప్రభావితం చేస్తుంది. నిద్ర సమయం – బరువు మధ్య సంబంధాన్ని మీరు సరిగ్గా అర్థం చేసుకోకపోతే ఈ రకమైన సమస్య వస్తుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. కాబట్టి బరువు తగ్గాలనుకునే వారు తమ దినచర్యను ఎలా ఉంచుకోవాలో, ఏ సమయంలో ఎంతసేపు నిద్రపోవాలో తప్పక తెలుసుకోవాలి.

సాధారణంగా రాత్రి 10:30 గంటల తర్వాత శరీరం జీర్ణక్రియ నెమ్మదిగా జరుగుతుంది. ఈ సమయంలో మనం మేల్కొని ఉంటే శరీరం ఒత్తిడిలో ఉంటుంది. అప్పుడు ఒత్తిడి హార్మోన్ కార్టిసాల్ విడుదల అవుతుంది. ఈ హార్మోన్ రక్తంలో ఉన్నప్పుడు శరీరం కొవ్వును కాల్చడాన్ని ఆపివేయడమే కాకుండా దానిని నిల్వ చేయడం ప్రారంభిస్తుంది. ఎంత ఆరోగ్యంగా ఆహారం తీసుకున్నా కార్టిసాల్ స్థాయిలు ఎక్కువగా ఉంటే బరువు తగ్గడం కష్టం అవుతుంది. శరీర కణాల మరమ్మత్తు పని రాత్రి 11 గంటల నుంచి తెల్లవారుజామున 3 గంటల మధ్య జరుగుతుంది. ఈ సమయంలో మీరు నిద్రపోకపోతే జీవక్రియ సరిగ్గా పనిచేయదు. ఇది ఆకలిని నియంత్రించే హార్మోన్లను దెబ్బతీస్తుంది. అంతేకాకుండా రాత్రిపూట నిద్రపోని వారికి ఇన్సులిన్ స్పైక్‌లు ఎక్కువగా ఉంటాయి. ఇది బరువు పెరగడానికి ప్రధాన కారణం. అలాగే జుట్టు కూడా విపరీతంగా రాలిపోతుంది.

శరీరానికి అవసరమైన నిద్ర లేకపోతే మనం తీసుకునే డీటాక్స్ పానీయాలు, ఆహారాలన్నీ వృధా అవుతాయి. రాత్రి 11 గంటల తర్వాత మేల్కొని ఉంటే శరీర సహజ వ్యర్థాల డీటాక్స్ ప్రక్రియ ఆగిపోతుంది. ఇది అజీర్ణం, ఉబ్బరం వంటి సమస్యలకు దారితీస్తుంది. జీర్ణక్రియ బలహీనపడితే జీవక్రియ నెమ్మదిస్తుంది. శరీరం మరింత ఎక్కువ కొవ్వును నిల్వ చేస్తుంది.

ఈ సమస్యను నివారించడానికి చిట్కాలు..

  • బరువు తగ్గాలనుకునే వారు రాత్రి 11 గంటల లోపు నిద్రపోవాలి.
  • ప్రతిరోజూ నిర్దేశించిన సమయం కంటే 15-20 నిమిషాలు ముందుగా పడుకోవడం అలవాటు చేసుకోవాలి.
  • పడుకునే గంట ముందు మొబైల్, ల్యాప్‌టాప్‌లను దూరంగా ఉంచడం మర్చిపోవద్దు.
  • నిద్రవేళకు కనీసం మూడు గంటల ముందు భోజనం ముగించాలి.

మరిన్ని ఆరోగ్య కథనాల కోసం క్లిక్‌ చేయండి.

Follow Us