Women fight: ఒక చీర.. ఇద్దరు మహిళలు.. సీన్ సితారే..! చీరకోసం షాపులోనే పొట్టుపొట్టుగా కొట్టుకున్న మగువలు..
ఆడాళ్లు.. మీకు జోహార్లు అంటారు.. ఎందుకో తెలుసా..? ఏ విషయంలోనైనా వారికి వారే సాటి.. ఏదైనా సాధించాలన్నా.. గొడవ పడాలన్నా.. ఎప్పుడూ ముందు వరుసలోనే ఉంటారు. ఇంకా చీరలో విషయంలో అయితే ఓ మెట్టు పైనే ఉంటారు..
ఆడాళ్లు.. మీకు జోహార్లు అంటారు.. ఎందుకో తెలుసా..? ఏ విషయంలోనైనా వారికి వారే సాటి.. ఏదైనా సాధించాలన్నా.. గొడవ పడాలన్నా.. ఎప్పుడూ ముందు వరుసలోనే ఉంటారు. ఇంకా చీరలో విషయంలో అయితే ఓ మెట్టు పైనే ఉంటారు.. ఎంత ఖర్చు అయిన పర్లేదు కొనాల్సిందే.. కట్టుకోవాల్సిందే.. మగువల విషయంలో చీర కానీ.. ఇంకెదైనా కానీ.. వారు కోరుకున్నది దక్కించుకోకపోతే.. సీన్ వేరేలా ఉంటుంది.. ప్లేస్ ఏదైనా సరే.. ఎవ్వరున్నా సరే రచ్చ.. రచ్చే.. తగ్గేదేలే అంటారు. తాజాగా.. చీరల డిస్కౌంట్ సేల్ కి వెళ్లిన ఇద్దరు మహిళలు.. ఒకే చీరను ఇష్టపడ్డారు.. ఆ చీర నాదంటే.. నాదంటూ.. ఇద్దరు మగువలు అందరి ముందే కుస్తీ పట్టారు. ఇద్దరు మహిళల మధ్య చీర విషయంలో తలెత్తిన గొడవ.. కాస్త పొట్టుపొట్టుగా కొట్టుకునేలా చేసింది ఈ ఘటన. ఈ షాకింగ్ సీన్ బెంగళూరులోని మల్లేశ్వరంలో జరిగింది. మైసూర్ సిల్క్స్ శారీ సెంటర్ ఇటీవల వార్షిక డిస్కౌంట్ సేల్ నిర్వహించింది. భారీగా డిస్కౌంట్లు ఉండటంతో చీరల కోసం మగువలు షాపునకు పోటెత్తారు. ఈ సమయంలో ఓ చీరను ఇద్దరు మహిళలు ఇష్టపడ్డారు. ఆ చీర నాదంటే.. నాదంటూ ఇద్దరు మహిళలు గొడవపడ్డారు. ఆ తర్వాత సహనం కోల్పోయి దుకాణం లోపలే ఇద్దరు జుట్లు పట్టుకోని మరి కొట్టుకున్నారు. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతోంది.
మరిన్ని వీడియోస్ కోసం:
Videos
Urvashi Rautela: ‘ఉర్వశిపై అఖిల్ వేధింపులు’ ట్వీట్.. కోర్టుకెక్కిన ఏజెంట్ బ్యూటీ..!
Jr NTR – Sr NTR: జూ.ఎన్టీఆర్ చేతుల మీదగా పెద్ద ఎన్టీఆర్ 54 అడుగుల భారీ విగ్రహావిష్కరణ..
Ustad Bhagat Singh: గబ్బర్ సింగ్‌కు మించి ఉంటది.. ట్రెండ్ సెట్టర్ గా పవన్ కళ్యాణ్..!
మందుల షాపు బోర్డుపై దేశభక్తి.. ప్రతి ఒక్కరికీ స్ఫూర్తి!
‘ఎబోలా ' కలకలం.. ఢిల్లీ ఎయిర్‌పోర్టులో హై అలర్ట్
నాడు మనసులు కలిస్తే.. నేడు చాట్‌జీపీటీ ‘ఓకే’ అంటేనే..
రోడ్లపై చావుతో ఆటలు.. పోలీసుల చేతికి చిక్కిన రేసర్!
ఉక్కపోతతో ఇళ్లలోకి నాగుల ఎంట్రీ.. నంద్యాలలో భారీ కోబ్రా కలకలం
భవనంపై చిక్కుకున్న శునకం.. దిక్కుతోచక విలవిల..
వ్యక్తి కడుపులో రాళ్లగుట్ట..స్కానింగ్ రిపోర్ట్ చూసి షాక్!

