ISRO GSLV F12: మే 29న మరో ప్రయోగానికి సన్నద్ధమైన ఇస్రో.. నింగిలోకి జీఎస్‌ఎల్వీ-ఎఫ్‌ 12 రాకెట్‌

భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) మరో ప్రయోగానికి సన్నద్ధమైంది. మే 29న శ్రీహరికోటలోని సతీష్‌ థావన్‌ స్పేస్‌ సెంటర్‌ (షార్‌) నుంచి జీఎస్‌ఎల్వీ-ఎఫ్‌ 12 (GSLV F12) రాకెట్‌ను ప్రయోగించనున్నారు. నావిగేషన్ రంగానికి చెందిన ఎన్‌వీఎస్-01 ఉపగ్రహాన్ని నింగిలోకి పంపనుంది ఇస్రో. ఈ ప్రయోగాన్ని..

ISRO GSLV F12: మే 29న మరో ప్రయోగానికి సన్నద్ధమైన ఇస్రో.. నింగిలోకి జీఎస్‌ఎల్వీ-ఎఫ్‌ 12 రాకెట్‌
Isro Gslv F12
Follow us

|

Updated on: May 28, 2023 | 5:17 AM

భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) మరో ప్రయోగానికి సన్నద్ధమైంది. మే 29న శ్రీహరికోటలోని సతీష్‌ థావన్‌ స్పేస్‌ సెంటర్‌ (షార్‌) నుంచి జీఎస్‌ఎల్వీ-ఎఫ్‌ 12 (GSLV F12) రాకెట్‌ను ప్రయోగించనున్నారు. నావిగేషన్ రంగానికి చెందిన ఎన్‌వీఎస్-01 ఉపగ్రహాన్ని నింగిలోకి పంపనుంది ఇస్రో. ఈ ప్రయోగాన్ని స్వదేశీ పరిజ్ఞానంతో నావిగేషన్ వ్యవస్థను రూపొందించింది. అయితే షార్‌లోని వెహికల్‌ అసెంబ్లీ బిల్డింగ్‌లో రాకెట్‌ మూడు దశల అనుసంధాన పనులను శాస్త్రవేత్తలు పూర్తి చేసి ప్రయోగానికి సిద్ధం చేశారు. రాకెట్‌ శిఖర భాగాన ఉపగ్రహాన్ని అమర్చి దాని చుట్టూ ఉష్టకవచాన్ని అమర్చే ప్రక్రియ పూర్తిచేశారు.

ఇస్రో పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో నావిగేషన్‌ వ్యవస్థను రూపొందించుకుంటోంది. దేశ సరిహద్దులో 1500 కిలో మీటర్ల మేర నావిక్‌ కవరేజ్‌ ఉండే విధంగా ఉపగ్రహాలను ఇస్రో ప్రయోగించింది. ఇప్పటికే 7 ఉపగ్రహాలను ఇస్రో ప్రయోగించి నావిగేషన్‌ వ్యవస్థను పటిష్టపరిచింది. ఈ సిరీస్‌లో ముందుగా ప్రయోగించిన ఐఆర్‌ఎన్‌ఎస్ఎస్-1జి (IRNSS-1G) ఉపగ్రహ సేవలు నిలిచిపోయాయి. దీని స్థానంలో ఎన్‌వీఎస్-01 ఉపగ్రహాన్ని ఇస్రో ప్రయోగిస్తోంది.

ఈ ఉపగ్రహ ప్రయోగం విజయవంతమైతే 12 సంవత్సరాల పాటు సేవలందించనుంది. షార్‌లోని రెండో ప్రయోగ వేదిక నుంచి ఈ నెల 29వ తేది 10.42 గంటలకు ఈ రాకెట్‌ను ప్రయోగించనున్నారు. ఈ రాకెట్‌ ద్వారా 2232 కిలోల బరువు గల ఎన్‌వీఎస్-01 నావిగేషన్‌ ఉపగ్రహాన్ని కక్ష్యలోకి ప్రవేశపెట్టనున్నారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని ఆంధ్రప్రదేశ్  వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి