AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

New Rules: జూన్‌ 1 నుంచి కొత్త నిబంధనలు.. ఇక మీ చేబుకు చిల్లులే.. పూర్తి వివరాలు

మే నెల ముగియనుంది. జూన్‌ నెల ప్రారంభం కానుంది. ప్రతి నెల కొత్త కొత్త నిబంధనలు అమలవుతుంటాయి. అలాగే వచ్చే నెలలో కూడా కొన్ని కొత్త నిబంధనలు అందుబాటులోకి రానున్నాయి. ఈ నిబంధల వల్ల మీకు కొంత ఆర్థికంగా నష్టం వాటిల్లే అవకాశం ఉంది. అందుకే జూన్‌ నెల నుంచి..

New Rules: జూన్‌ 1 నుంచి కొత్త నిబంధనలు.. ఇక మీ చేబుకు చిల్లులే.. పూర్తి వివరాలు
New Rules
Subhash Goud
|

Updated on: May 27, 2023 | 5:30 AM

Share

మే నెల ముగియనుంది. జూన్‌ నెల ప్రారంభం కానుంది. ప్రతి నెల కొత్త కొత్త నిబంధనలు అమలవుతుంటాయి. అలాగే వచ్చే నెలలో కూడా కొన్ని కొత్త నిబంధనలు అందుబాటులోకి రానున్నాయి. ఈ నిబంధల వల్ల మీకు కొంత ఆర్థికంగా నష్టం వాటిల్లే అవకాశం ఉంది. అందుకే జూన్‌ నెల నుంచి మారనున్ఏన రూల్స్‌ను తెలుసుకోవడం ముఖ్యం. ఇందులో ఆధార్ కార్డు, పెట్టుబడులు, ఫిక్స్‌డ్ డిపాజిట్లు, ఎలక్ట్రిక్ స్కూటర్ సబ్సిడీలు, విదేశ క్రెడిట్ కార్డు పేమెంట్లు, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కొత్త స్కీమ్ వంటి చాలా అంశాల్లో ఉన్నాయి. ఇక పోతే ప్రతినెల ఒకటో తారీఖున గ్యాస్‌ ధరలను మారడం జరుగుతుంటుంది. అలాగే పెట్రోల్‌, డీజిల్‌ ధరల్లో కూడా మార్పులు ఉండవచ్చు. మరి జూన్‌ 1 నుంచి ఎలాంటి నిబంధనలు మారనున్నాయో తెలుసుకుందాం.

  1. ఉచితంగా ఆధార్‌ అప్‌డేట్‌: ఆధార్ కార్డు ఉన్న వారు తమ వివరాలను అప్డేట్ చేసుకునేందుకు యూఐడీఏఐ అద్భుతమైన అవకాశాన్ని కల్పించింది. పేరు, అడ్రస్ వంటి వివరాలను ఆన్‌లైన్ ద్వారా ఒక్క రూపాయి కూడా చెల్లించకుండా మార్చుకునే వెసులుబాటు కల్పించింది. అయితే ఈ అవకాశం జూన్ 14 వరకు మాత్రమే అందుబాటులో ఉంటుందని గుర్తుంచుకోవాలి. ఆ తర్వాత ఆన్‌లైన్ ద్వారా చేసినా రూ.50 రుసుము చెల్లించాల్సి ఉంటుంది.
  2. గ్యాస్ ధరలు: ప్రతీ నెల 1వ తేదీన చమురు సంస్థలు గ్యాస్ సిలిండర్ల ధరలను సవరిస్తూ ఉంటాయి. అయితే, ధరలు పెంచవచ్చు లేదా తగ్గించవచ్చు లేదంటే స్థిరంగా ఉంచవచ్చు. గత నెల వాణిజ్య సిలిండర్ ధరలు తగ్గించాయి. వచ్చే నెల కూడా మార్పు ఉండే అవకాశం ఉంది.
  3. బ్యాంకు ఖాతాల్లోని అన్‌క్లెయిమ్‌డ్ డిపాజిట్లు.. బ్యాంకుల్లో చాలా మంది ఫిక్స్‌డ్‌ డిపాజిట్‌, సేవింగ్స్‌, కరెంట్‌ అకౌంట్లలో డబ్బులు డిపాజిట్‌ చేసి క్లెయిమ్‌ చేసుకోని వారు చాలా మంది ఉన్నారు. అలాంటి వారి నామినీ కోసం ఆర్బీఐ కీలక నిర్ణయం తీసుకుంది. క్లెయిమ్‌ చేయిన వారిని గుర్తించి వారి కుటుంబ సభ్యులకు గానీ, నామినీలకు గానీ డబ్బులు అందించేలా చర్యలు చేపట్టింది. ఇది జూన్‌ 1 నుంచి ప్రారంభం కానుంది. ఈ నేపథ్యంలో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా జూన్ 1 నుంచి 100 రోజుల ప్రచార కార్యక్రమాన్ని ప్రారంభించబోతోంది. దీని ద్వారా అన్‌క్లెయిమ్డ్ అమౌంట్‌ను సెటిల్ చేయనుంది.
  4. వాహనదారులకు షాక్‌.. ఇక ఎలక్ట్రిక్ స్కూటర్, బైక్ కొనుగోలు చేయాలనుకునే వారికి జూన్ 1 నుంచి భారీ షాక్ తగలనున్నట్లు తెఉలస్తోంది. కేంద్ర సర్కార్‌ అందిస్తున్న సబ్సిడీలో భారీ కోత విధించనుంది. భారీ పరిశ్రమల మంత్రిత్వ శాఖ ఫాస్టర్ అడాప్షన్ అండ్ మాన్యుఫాక్చరింగ్ ఆఫ్ ఎలక్ట్రిక్ వెహికల్స్ (FAME) 2 స్కీమ్స్‌కు సంబంధించిన ప్రోత్సాహకాలను మార్చింది. గరిష్ఠంగా అందిస్తున్న సబ్సిడీని పరిమితి 40 శాతం నుంచి 15 శాతానికి తగ్గించింది. ఎలక్ట్రిక్ టూ వీలర్ వాహనాలపై ప్రస్తుతం KWhకి రూ.15 వేలు నుంచి KWhకి రూ.10 వేలకు తగ్గించింది.
  5. ఇవి కూడా చదవండి
  6. ఎస్‌బీఐ అమృత్ కలశ్ స్కీమ్: ఎస్‌బీఐ కొత్త స్కీమ్ అమృత్ కలశ్ డిపాజిట్ స్కీమ్‌ గడువు పొడిగించింది. జూన్ 30 వరకు ఈ స్కీమ్‌లో చేరేందుకు అవకాశం ఉంది. 400 రోజుల టెన్యూర్ గల ప్రత్యేకమైన స్కీమ్ ఇది. ఈ ఫిక్స్‌డ్ డిపాజిట్ స్కీమ్ ద్వారా సీనియర్ సిటిజన్లకు 7.6 శాతం, ఇతరులకు 7.1 శాతం వడ్డీ లభిస్తుంది.
  7. పిల్లల పేరుపై మ్యూచువల్ ఫండ్స్: మీ పిల్లల పేరుపై కొత్త ఖాతా ఓపెన్‌ చేయాల్సిన అవసరం లేకుండా పిల్లల పేర్లపై మ్యూచువల్ ఫండ్స్ స్కీమ్‌లో ఇన్వెస్ట్‌ చేయవచ్చు. మార్కెట్ రెగ్యులేటర్ సంస్థ సెక్యూరిటీ ఎక్స్చేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా సెబీ తాజాగా ఈ విషయాన్ని వెల్లడించింది. ఈ కొత్త నిబంధన జూన్‌ 15 నుంచి అమల్లోకి రానుంది.

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Follow Us
టీ20 వరల్డ్ కప్ వేళ పాక్ జట్టులో రచ్చ రచ్చ
టీ20 వరల్డ్ కప్ వేళ పాక్ జట్టులో రచ్చ రచ్చ
రైల్వే ప్రయాణికులకు బిగ్‌ అలర్ట్.. అమల్లోకి కొత్త రూల్స్!
రైల్వే ప్రయాణికులకు బిగ్‌ అలర్ట్.. అమల్లోకి కొత్త రూల్స్!
లిఫ్ట్‌లో అద్దాలు ఎందుకు ఉంటాయో తెలుసా? 99 శాతం మందికి తెలియదు..!
లిఫ్ట్‌లో అద్దాలు ఎందుకు ఉంటాయో తెలుసా? 99 శాతం మందికి తెలియదు..!
AP POLYCET 2026 కౌన్సెలింగ్ ప్రారంభం.. సీటు పొందాలంటే ఇలా చేయండి
AP POLYCET 2026 కౌన్సెలింగ్ ప్రారంభం.. సీటు పొందాలంటే ఇలా చేయండి
కెనడా ప్లేయర్ కాలు విరగ్గొట్టిన ఖతార్ ప్లేయర్ పై నిషేధం
కెనడా ప్లేయర్ కాలు విరగ్గొట్టిన ఖతార్ ప్లేయర్ పై నిషేధం
నోట్లో వేస్తే ఇట్టే కరిగిపోవాల్సిందే.. హెల్తీ ‘బెల్లం రవ్వ లడ్డు
నోట్లో వేస్తే ఇట్టే కరిగిపోవాల్సిందే.. హెల్తీ ‘బెల్లం రవ్వ లడ్డు
భారీగా పెరిగిన కూరగాయల ధరలు.. తెలుగు రాష్ట్రాల్లో ఇలా..
భారీగా పెరిగిన కూరగాయల ధరలు.. తెలుగు రాష్ట్రాల్లో ఇలా..
ముడుచుకుందంటే పులులు, సింహాలు కూడా ఏం చేయలేవ్..
ముడుచుకుందంటే పులులు, సింహాలు కూడా ఏం చేయలేవ్..
ఆ ఇద్దరి ఎఫెక్ట్.. ఇంగ్లాండ్ సిరీస్ నుంచి వైభవ్ ఔట్.. ఎందుకంటే?
ఆ ఇద్దరి ఎఫెక్ట్.. ఇంగ్లాండ్ సిరీస్ నుంచి వైభవ్ ఔట్.. ఎందుకంటే?
గంగమ్మ కస్టోడియల్ డెత్ కేసు ట్విస్ట్.. హైకోర్టు కీలక ఆదేశాలు
గంగమ్మ కస్టోడియల్ డెత్ కేసు ట్విస్ట్.. హైకోర్టు కీలక ఆదేశాలు