Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

PF UAN Number: మర్చిపోయిన ఈపీఎఫ్‌ఓ యూఏఎన్‌ నెంబర్‌ తిరిగి పొందడం ఎలా..? ఈ స్టేప్స్‌ ఫాలో అవ్వండి

ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ (ఈపీఎఫ్‌వో) ఉద్యోగం చేసే ప్రతిఒక్కరికీ 12 అంకెల యూనివర్సల్ అకౌంట్ నెంబర్ (యూఏఎన్)ను జారీ చేస్తుంది. ఉద్యోగులు ఈపీఎఫ్ పోర్టల్‌లో యూఏఎన్ నెంబర్ పొందవచ్చు. యూఏఎన్ నెంబర్ అనేది తొలిసారి ఉద్యోగంలో చేరిన వెంటనే ఆటోమేటిక్‌గా..

PF UAN Number: మర్చిపోయిన ఈపీఎఫ్‌ఓ యూఏఎన్‌ నెంబర్‌ తిరిగి పొందడం ఎలా..? ఈ స్టేప్స్‌ ఫాలో అవ్వండి
Epfo
Follow us
Subhash Goud

|

Updated on: May 27, 2023 | 7:00 AM

ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ (ఈపీఎఫ్‌వో) ఉద్యోగం చేసే ప్రతిఒక్కరికీ 12 అంకెల యూనివర్సల్ అకౌంట్ నెంబర్ (యూఏఎన్)ను జారీ చేస్తుంది. ఉద్యోగులు ఈపీఎఫ్ పోర్టల్‌లో యూఏఎన్ నెంబర్ పొందవచ్చు. యూఏఎన్ నెంబర్ అనేది తొలిసారి ఉద్యోగంలో చేరిన వెంటనే ఆటోమేటిక్‌గా క్రియేట్ అయిపోతుంది. అయితే మీరు ఎన్ని ఉద్యోగాలు మారినా కూడా యూఏఎన్ నెంబర్ మాత్రం ఒక్కటే ఉంటుంది. ఇది ఒరిజినల్ యూఏఎన్‌తో లింక్ అవుతుంది. అయితే ఈపీఎఫ్‌వో సేవలను పొందడానికి యూఎన్‌ఏ నెంబర్‌తో కేవైసీ వివరాలు లింక్‌ చేయాల్సి ఉంటుంది. యూఏఎన్‌ నెంబర్‌ మర్చిపోతే ఇబ్బందులు పడుతుంటారు. అలాంటి సమయంలో ఉద్యోగులు ఎలాంటి టెన్షన్‌ పడనవసరం లేదు.

పిన్‌ మర్చిపోతే తిరిగి పొందడం ఎలా..?

➦అధికారిక వెబ్‌ సైట్‌ ఈపీఎఫ్‌లో పోర్టల్‌లోకి లాగిన్‌ కావాలి. హోమ్‌ పేజీలో ఉన్న నో యు యుఏఎన్‌ లింక్‌పై క్లిక్‌ చేయాలి.

➦ మెంబర్ ఐడీ ఐడీ, రాష్ట్రం, రీజినల్ ప్రావిడెంట్ ఫండ్ ఆఫీస్, పేరు, పుట్టిన తేదీ, మొబైల్ నెంబర్, ఈమెయిల్ ఐడీ వంటి వివరాలను ఎంటర్ చేయాలి. ప్రావిడెంట్ ఫండ్ (పీఎఫ్) మెంబర్ ఐడీ శాలరీ స్లిప్‌లో ఉంటుంది.

ఇవి కూడా చదవండి

➦ గెట్ ఆథరైజేషన్ పిన్‌పై క్లిక్ చేయాలి.

➦ పీఎఫ్ మెంబర్ ఐడీతో అనుసంధానమైన మొబైల్ నెంబర్‌కు ఒక పిన్ నెంబర్ మెసేజ్ వస్తుంది. దీన్ని ఎంటర్ చేయాలి.

➦ వాలిడేట్ ఓటీపీ అండ్ గెట్ యూఏఎన్‌పై క్లిక్ చేయాలి.

➦ యూనివర్సల్ అకౌంట్ నెంబర్ మీ మొబైల్ నెంబర్‌కు మెసేజ్ వస్తుంది.

UAN లేకుండా PF బ్యాలెన్స్ ఎలా చెక్​ చేసుకోవాలి..

➦ ఈపీఎఫ్​ఓ హోమ్​ పేజీ epfindia.gov.in లాగిన్ అవ్వండి

➦ మీ ఈపిఎఫ్ బ్యాలెన్స్ తెలుసుకోవడానికి ‘క్లిక్​ హియర్​ టు నో యువర్​ పీఎఫ్​ బ్యాలెన్స్​’ పై క్లిక్ చేయండి.

➦ వెంటనే epfoservices.in/epfo/ పేజ్​ ఓపెన్​ అవుతుంది. అక్కడ ‘మెంబర్​ బ్యాలెన్స్ ఇన్ఫర్మేషన్’ను ఎంచుకోండి.

➦ అక్కడ మీ రాష్ట్రం, ఈపీఎఫ్​ కార్యాలయం, కోడ్​, పీఎఫ్​ ఖాతా సంఖ్య, ఇతర వివరాలను నమోదు చేయండి.

➦’సబ్​మిట్’ చేసే ముందు‘ ఐ అగ్రీ’పై క్లిక్ చేయండి.

➦ అప్పుడు మీ స్క్రీన్​పై ఈపీఎఫ్​ బ్యాలెన్స్​ వివరాలు ప్రత్యక్షమవుతాయి.

UAN నంబర్​తో PF బ్యాలెన్స్ ఎలా చెక్ చేసుకోవాలి..

ఎస్ఎంఎస్ ద్వారా.. ఈపీఎఫ్ఓ చందాదారుడికి UAN నంబర్​ ఉంటే, అప్పుడు SMS లేదా మిస్డ్ కాల్ ద్వారా పీఎఫ్​ బ్యాలెన్స్ చెక్​ చేసుకోవచ్చు. దీని కోసం మీ రిజిస్టర్డ్ మొబైల్ నంబర్ నుండి 7738299899 కు EPFOHO UAN అని ఎస్​ఎమ్​ఎస్ పంపాల్సి ఉంటుంది. ఆ తర్వాత మీ రిజిస్టర్డ్​ మొబైల్ నంబర్‌కు పిఎఫ్ బ్యాలెన్స్ వివరాలను పొందవచ్చు.

మొబైల్ నెంబర్ ద్వారా.. అలాగే యూనివర్సల్​ అకౌంట్​ నంబర్​ (UAN)​ లేకుండానే బ్యాలెన్స్​ చెక్​ చేసుకునే సదుపాయం కూడా ఉంది. మీ UAN నెంబర్​ మీకు గుర్తుకు లేకపోయినా కూడా పీఎఫ్​ బ్యాలెన్స్​ఎంత ఉందో తెలుసుకోవచ్చు. ‌దీని కోసం మీ రిజిస్టర్డ్ మొబైల్ నంబర్ నుండి 011-229014016 కు మిస్డ్ కాల్ ఇవ్వాల్సి ఉంటుంది. అయితే, ఈ సౌకర్యాన్ని పొందేందుకు మీరు ముందుగానే​ UAN పోర్టల్‌లో రిజిస్టర్​ చేసుకొని ఉండాలి. అంతేకాక, మీ KYC వివరాలను పూర్తి చేయాల్సి ఉంటుంది.

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

నాని యాక్టింగ్ చాలా ఇష్టం.. అతడితో నటించాలని ఉంది..
నాని యాక్టింగ్ చాలా ఇష్టం.. అతడితో నటించాలని ఉంది..
ప్రపంచంలోనే అరుదైన 'గోల్కొండ బ్లూ' వజ్రం వేలం..
ప్రపంచంలోనే అరుదైన 'గోల్కొండ బ్లూ' వజ్రం వేలం..
డాక్టర్లు గుర్తించలేకపోయిన జబ్బును చాట్ జీపీటీ గుర్తించింది
డాక్టర్లు గుర్తించలేకపోయిన జబ్బును చాట్ జీపీటీ గుర్తించింది
జాబిల్లి ఈ సుకుమారి వద్ద వెన్నలను అరువు అడగదా.. స్టన్నింగ్ ప్రగ్య
జాబిల్లి ఈ సుకుమారి వద్ద వెన్నలను అరువు అడగదా.. స్టన్నింగ్ ప్రగ్య
'ఓదెల 2' మూవీ విలన్ భార్య టాలీవుడ్ క్రేజీ హీరోయిన్ అని తెలుసా?
'ఓదెల 2' మూవీ విలన్ భార్య టాలీవుడ్ క్రేజీ హీరోయిన్ అని తెలుసా?
వామ్మో.. పుత్తడి రికార్డ్‌ బ్రేక్‌..లక్ష రూపాయలకు చేరిన బంగారం ధర
వామ్మో.. పుత్తడి రికార్డ్‌ బ్రేక్‌..లక్ష రూపాయలకు చేరిన బంగారం ధర
మత్తు కోసం ట్యాబ్లెట్లు, ఇంజెక్షన్స్ కలిపి తీసుకుని యువకుడు మృతి
మత్తు కోసం ట్యాబ్లెట్లు, ఇంజెక్షన్స్ కలిపి తీసుకుని యువకుడు మృతి
వింత విమానాశ్రయం! మామిడి చెట్టు కిందే వెయిటింగ్‌
వింత విమానాశ్రయం! మామిడి చెట్టు కిందే వెయిటింగ్‌
ఆ డెలివరీ వ్యాన్‌కు దెయ్యం పట్టిందా ఏంది.. అలా పోతుంది
ఆ డెలివరీ వ్యాన్‌కు దెయ్యం పట్టిందా ఏంది.. అలా పోతుంది
ఏ దేశమేగినా.. భారతీయ మూలాలు మర్చిపోని ఉషా వాన్స్‌..
ఏ దేశమేగినా.. భారతీయ మూలాలు మర్చిపోని ఉషా వాన్స్‌..