Home Made Fridge: కరెంట్ లేకున్నా కూల్.. కూల్‌గా.! ఈ ఫ్రిడ్జ్ ధర తెలిస్తే కొనకుండా ఉండలేరు..

సాధారణంగా మధ్యతరగతి ప్రజలు ఫ్రిడ్జ్‌లు కొనుగోలు చేయాలంటే.. కచ్చితంగా వేలల్లో డబ్బు ఖర్చవుతుంది. అయితే పైన పేర్కొన్న ఫోటోను చూశారా.?

Home Made Fridge: కరెంట్ లేకున్నా కూల్.. కూల్‌గా.! ఈ ఫ్రిడ్జ్ ధర తెలిస్తే కొనకుండా ఉండలేరు..
Fridge
Follow us
Ravi Kiran

|

Updated on: May 27, 2023 | 9:42 AM

సాధారణంగా మధ్యతరగతి ప్రజలు ఫ్రిడ్జ్‌లు కొనుగోలు చేయాలంటే.. కచ్చితంగా వేలల్లో డబ్బు ఖర్చవుతుంది. అయితే పైన పేర్కొన్న ఫోటోను చూశారా.? ఓ పెట్టెలా కనిపిస్తోంది కదూ.. మీరు కూడా అదే అనుకుంటే పొరపాటే.. ఎందుకంటే అదొక చల్లటి ఫ్రిడ్జ్. ఈ ఫ్రిడ్జ్‌కు కరెంట్‌తో పన్లేదు. సామాన్యులకు భారం కాకుండా.. కరెంట్ బిల్లును ఏమాత్రం పెంచకుండా ఈ చల్లటి ఫ్రిడ్జ్‌లు అందుబాటులోకి వచ్చాయి. ఈ ఫ్రిడ్జ్‌ను సహాజ సిద్దంగా పర్యావరణలో దొరికే మట్టితో కోయంబత్తూరుకు చెందిన మన్‌సుక్ భాయ్ అనే వ్యక్తి తయారు చేశాడు. దీనికి మిట్టి కూల్ ఫ్రిడ్జ్ అని పేరు పెట్టాడు.

దీన్ని పూర్తిగా బంకమన్నుతో తయారు చేశారు. ఈ ఫ్రిజ్‌కు విద్యుత్‌తో అవసరం లేదు. అలాగే ఎలాంటి మరమ్మత్తులు కూడా చేయాల్సిన పన్లేదు. ఇందులో భద్రపరిచిన కూరగాయలు సుమారు ఐదారు రోజులు తాజాగా ఉంటాయి. పెరుగు, దోశె పిండిలాంటివి కూడా ఈ ఫ్రిడ్జ్‌లో పెడితే పుల్లబడకుండా ఉంటాయి. అలాగే ఇందులో పెట్టిన నీళ్లు, జ్యుసులు కూడా చల్లబడతాయి. ఈ ఫ్రిడ్జ్‌లో 5 కిలోల కూరగాయలు, పండ్ల వరకు నిల్వ ఉంచొచ్చు. ఈ మిట్టి కూల్ ఫ్రిడ్జ్‌పైన అమర్చిన అరలో 2 లీటర్ల నీటిని పోయాలి. ఇందులో పెట్టిన ఆహార పదార్ధాల రుచిలో ఎలాంటి మార్పు ఉండదని.. ఇందులో భద్రపరిచిన పండ్లు, కూరగాయలను తింటే ఎలాంటి అనారోగ్యం రాదని అంటున్నారు. దీని నిర్వహణా ఖర్చు కూడా తక్కువే. విద్యుత్ అవసరం లేని ఈ ఫ్రిడ్జ్ ఖరీదు చాలా తక్కువ.. దీని ధర కేవలం రూ. 8,500.