Telangana: ప్రేమించాడు.. సంబంధం కుదుర్చుకున్నాడు.. పెళ్లికి ముందు వరుడు ఏం చేశాడో తెలుసా..?
ప్రేమించాడు.. పెళ్లిచేసుకుంటానన్నాడు. గుడిలో పెళ్లి చేసుకునేందుకు అమ్మాయి తల్లిదండ్రులతో ఒప్పదం కుదుర్చుకున్నాడు. ఇంకేముంది గుడిలో పెళ్లికి అన్ని ఏర్పాట్లు చేసుకన్నారు అమ్మాయి పేరెంట్స్. ఇంతలోనే ట్వీస్ట్ ఇచ్చాడు పెళ్లి కొడుకు. కట్నం ఇవ్వలేదన్న కారణంతో పెళ్లి కొడుకు పెళ్లికి ఒక్కరోజు జంప్ అయ్యాడు..

ప్రేమించాడు.. పెళ్లిచేసుకుంటానన్నాడు. గుడిలో పెళ్లి చేసుకునేందుకు అమ్మాయి తల్లిదండ్రులతో ఒప్పదం కుదుర్చుకున్నాడు. ఇంకేముంది గుడిలో పెళ్లికి అన్ని ఏర్పాట్లు చేసుకన్నారు అమ్మాయి పేరెంట్స్. ఇంతలోనే ట్వీస్ట్ ఇచ్చాడు పెళ్లి కొడుకు. కట్నం ఇవ్వలేదన్న కారణంతో పెళ్లి కొడుకు పెళ్లికి ఒక్కరోజు జంప్ అయ్యాడు.. తెలంగాణలోని సంగారెడ్డి జిల్లా మానూరు మండలానికి చెందిన యువతి, కొండాపూర్ మండలానికి చెందిన యువకుడు గత కొద్దిరోజులుగా ప్రేమించుకున్నారు. ఇదే విషయాన్ని ఆ అమ్మాయి ఇంట్లో కుటుంబసభ్యులకు చెప్పింది. మొదట ససేమేరా అన్న అమ్మాయి కుటుంబసభ్యులు.. ఆ తర్వాత అబ్బాయిని పిలిచి మాట్లాడారు. ప్రేమించాను.. పెళ్లిచేసుకుంటానని తేగిసి చెప్పాడు.. దీంతో గుడిలో పెళ్లి చేసుకునేందుకు అమ్మాయి తల్లిదండ్రులతో ఒప్పదం కుదుర్చుకున్నాడు. డేట్ కూడా ఫిక్స్ చేసుకున్నాడు. సరేలే అంటూ అమ్మాయి, ఆమె తల్లిదండ్రులు సంబరపడ్డారు.
పెళ్లి సమయం రానే వచ్చింది.. తీరా పెళ్లికి అంతా రెడీ చేసుకొని అమ్మాయి తల్లిదండ్రులు గుడికి వెళ్లేసరికి ముఖం చాటేశాడు. పెళ్లికి ఒక్కరోజు ముందు కట్నం ఇవ్వలేదన్న కారణంతో పెళ్లికొడుకు కనబడకుండా పారిపోయాడు. నిన్న కొండపూర్ లోని ఓ గుడిలో జరగాల్సిన పెళ్లి కాస్తా.. పెళ్లికొడుకు సురేష్ పారిపోవడంతో అమాంతంగా ఆగిపోయిందంటూ యువతి కుటుంబసభ్యులు ఆవేదన వ్యక్తంచేశారు. అన్ని ఏర్పాట్లు చేసుకుని.. గుడికి వెళ్లామని.. కానీ, కట్నం ఇవ్వలేదన్న కారణంతో పెళ్లి కొడుకు రాలేదంటూ పెళ్లి కూతురు కుంటుంబ సభ్యులు వెల్లడించారు.
సురేష్ పారిపోవడంతో పెళ్లి నిలిచిపోయిందని పెళ్లి కూతురు తల్లిదండ్రులు పోలీస్ స్టేషన్లో పిర్యాదు చేశారు. యువతి తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లు పోలీసులు తెలిపారు.




మరిన్ని తెలంగాణ వార్తల కోసం..
