Telangana: దుమారం రేపుతున్న మంత్రి బొత్స వ్యాఖ్యలు.. ఏపీ రాజధాని చెప్పలేని పరిస్థితి ఉందన్న మంత్రి శ్రీనివాస్ గౌడ్
తెలంగాణ విద్యావ్యవస్థపై ఏపీ మంత్రి బొత్స చేసిన వ్యాఖ్యలు దుమారం రేపుతున్నాయి. బీఆర్ఎస్ నేతలు బొత్సపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడుతున్నారు. తాజాగా ఆయన వ్యాఖ్యలపై మంత్రి శ్రీనివాస్ గౌడ్ స్పందించారు. మంత్రి బొత్స పరీక్షలు చూసి రాసి పాసయ్యారని అందుకే అలా మాట్లాడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.
తెలంగాణ విద్యావ్యవస్థపై ఏపీ మంత్రి బొత్స చేసిన వ్యాఖ్యలు దుమారం రేపుతున్నాయి. బీఆర్ఎస్ నేతలు బొత్సపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడుతున్నారు. తాజాగా ఆయన వ్యాఖ్యలపై మంత్రి శ్రీనివాస్ గౌడ్ స్పందించారు. మంత్రి బొత్స పరీక్షలు చూసి రాసి పాసయ్యారని అందుకే అలా మాట్లాడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. తెలంగాణలో అభివృద్ధిని చూసి ఓర్వలేకపోతున్నారని మండిపడ్డారు. ఏపీ విద్యార్థులు తెలంగాణలోనే చదువుకుంటామని కోర్టుకు కూడా వెళ్లిన విషయాన్ని మంత్రి బొత్సకు గుర్తుచేశారు శ్రీనివాస్ గౌడ్. ఏపీ రాజధాని అని పరీక్షల్లో అడిగితే దానికి సమాధానం చెప్పలేని పరిస్థితి ఉందని విమర్శించారు.
తెలంగాణ రాకముందు వారి హయంలో ఏపీపీఎస్సీలో స్కాములు జరిగుతుండేవని.. ఇప్పుడు కూడా అలానే అనుకుంటే ఎట్లా అని ప్రశ్నించారు. ఉపాధ్యాయులు బదిలీల కోసం కూడా సూట్‌కేసులు పట్టుకొని లాడ్జిల్లో ఉండేవారని ఆరోపించారు. అలాగే మా దగ్గర వోక్స్ వ్యాగన్ స్కాములు ఉన్నాయా అని ప్రశ్నించారు. ఏపీలో ఆలయాల వద్ద వివక్ష ఉందని విమర్శించారు. అన్ని విషయాలు చర్చించేందుకు సిద్దమా అంటూ బొత్సకు సవాలు చేశారు.