Telanagana: భద్రాచలంకు ఇప్పటికీ 58 ఏళ్ల పాత వంతనే.. కడుతున్న కొత్త దానికి మోక్షం ఎప్పుడో
దక్షిణ అయోధ్య గా ప్రసిద్ధిగాంచి.. తెలుగువారి అత్యంత ఇష్టమైన పుణ్యక్షేత్రంగా భావించే భద్రాచలానికి వెళ్లాలంటే గోదావరి నదిని దాటాల్సి ఉంటుంది. గోదావరి పైన ఇప్పుడున్న బ్రిడ్జ్ సరిగ్గా నేటికీ 58 ఏళ్లు పూర్తిచేసుకుంది. 1964 ముందు భద్రాచలం వెళ్లాలంటే గోదావరి నదిలో నాటు పడవల ద్వారా దాటి వెళ్ళాలి. పడవలో ఆ రామచంద్రుడి దర్శనానికి వెళ్లేవారు ప్రజలు.

దక్షిణ అయోధ్య గా ప్రసిద్ధిగాంచి.. తెలుగువారి అత్యంత ఇష్టమైన పుణ్యక్షేత్రంగా భావించే భద్రాచలానికి వెళ్లాలంటే గోదావరి నదిని దాటాల్సి ఉంటుంది. గోదావరి పైన ఇప్పుడున్న బ్రిడ్జ్ సరిగ్గా నేటికీ 58 ఏళ్లు పూర్తిచేసుకుంది. 1964 ముందు భద్రాచలం వెళ్లాలంటే గోదావరి నదిలో నాటు పడవల ద్వారా దాటి వెళ్ళాలి. పడవలో ఆ రామచంద్రుడి దర్శనానికి వెళ్లేవారు ప్రజలు. ప్రతిఏటా వరద ఉధృతి పెరుగుతుండడం తో నాటు పడవలు మునిగిపోయి అనేక మంది ప్రాణాలు కోల్పోయే వారు. ప్రజల ప్రాణాలు దృష్టిలో పెట్టుకొని అప్పటి ప్రభుత్వం ఇక్కడ వంతెన నిర్మించాలని నిర్ణయం తీసుకుంది. సరిగ్గా 58 ఏళ్ల క్రితం ఇదే రోజు భద్రాచలానికి కొత్త బ్రిడ్జి ప్రారంభమైంది. 13 జులై 1964న అప్పటి రాష్ట్రపతి సర్వేపల్లి రాధాకృష్ణ వచ్చి ఇక్కడ బ్రిడ్జి ప్రారంభించారు. ఈ బ్రిడ్జ్ కు సరిగ్గా నేటికీ 58 ఏళ్ళు పూర్తి అయింది.
అయితే గత ఏడాది లో కురిసిన వర్షాలకు భద్రాచలం వద్ద రికార్డు స్థాయిలో ప్రవాహం కొనసాగింది. ఆ సమయంలో ఈ బ్రిడ్జిపై రాకపోకలు నిలిపివేశారు. వరద ప్రవాహం చూసినవారు బ్రిడ్జి ఉంటుందా పోతుందా అన్న అనుమానాలు కూడా వ్యక్తం చేశారు. 50 ఏళ్లు దాటడంతో బ్రిడ్జ్ నాణ్యత పై కూడా అనేక అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. అక్కడక్కడ రోడ్డు గుత్తలు పడడం, క్రాక్స్ రావడంతో కొత్త బ్రిడ్జి అవసరాన్ని గుర్తించి UPA హయాంలో కొత్త బ్రిడ్జి కు శంకుస్థాపన చేశారు. అయితే ఏళ్లు గడుస్తున్నా కానీ కొత్త బ్రిడ్జ్ పనులు ఇంకా జరుగుతూనే ఉన్నాయి. అది ఎప్పుడు పూర్తవుతుందా అని భద్రాచలం ప్రజలే కాకుండా భద్రాచలానికి వచ్చే భక్తులు కూడా ఆశగా ఎదురు చూస్తున్నారు.




ఆ బ్రిడ్జి పనులు నిర్వహిస్తున్న కాంట్రాక్ట్ కంపెనీ నత్తనడకన పనులు చేస్తుండడంతో ఇప్పట్లో ఆ బ్రిడ్జి పూర్తి అయ్యే పరిస్థితి కనిపించడం లేదు. పాత బ్రిడ్జి కట్టినప్పుడు భద్రాచలంలో కనీసం 100 వాహనాలు కూడా లేవు.. కానీ ఇప్పుడు ఆ బ్రిడ్జి పైన ప్రతిరోజు 3000 నుంచి 5000 వరకు వాహనాలు ప్రయాణిస్తున్నాయని ఒక అంచనాకు అధికారులు వచ్చారు. గత ఏడాది కురిసిన వర్షాలు లాగే ఇంకొక వర్షం వస్తే కనుక పాత బ్రిడ్జి కు మరింత ఒత్తిడి తగిలే అవకాశం ఉంది. ఇప్పటికైనా కేంద్ర ప్రభుత్వం చొరవ తీసుకొని కొత్త కాంట్రాక్టర్ కు ఇచ్చి బ్రిడ్జిని తొందరగా పూర్తి చేయాలని భద్రాచలం వసూలు కోరుతున్నారు.