- Telugu News Photo Gallery Viral photos Bihar man arrested for doing Cartwheels stunts at railway station platform
రైల్వే ప్లాట్‌ఫాంపై స్టంట్స్ చేసి ఫేమస్ అవ్వాలనుకున్నాడు.. పోలీసుల ఎంట్రీతో సీన్ రివర్స్!
సోషల్ మీడియాలో వైరల్‌గా అయ్యేందుకు ఈ మధ్య కుర్రకారు నానాపాట్లు పడుతున్నారు. తాజాగా బీహార్ మాన్‌పుర్ రైల్వేస్టేషన్‌లో జిమ్నాస్టిక్స్ విన్యాసాలు ప్రదర్శించి ప్రజల దృష్టిని ఆకర్షించేందుకు యత్నించిని యువకుడి వీడియో నెట్టింట వైరల్‌గా మారింది..
Updated on: Jul 13, 2023 | 12:56 PM

సోషల్ మీడియాలో వైరల్‌గా అయ్యేందుకు ఈ మధ్య కుర్రకారు నానాపాట్లు పడుతున్నారు.

తాజాగా బీహార్ మాన్‌పుర్ రైల్వేస్టేషన్‌లో జిమ్నాస్టిక్స్ విన్యాసాలు ప్రదర్శించి ప్రజల దృష్టిని ఆకర్షించేందుకు యత్నించిని యువకుడి వీడియో నెట్టింట వైరల్‌గా మారింది

యువకుడు స్టంట్స్ చేస్తున్న సమయంలో పక్కనే రైలు ఆగి వుంది. వెంటనే రంగంలోకి దిగిన రైల్వే RPF పోలీసులు సదరు యువకుడిని అరెస్టు చేసి జైలుకు తరలించారు

మాన్‌పుర్ జంక్షన్‌లోని రైల్వేస్టేషన్‌లో అనధికారికంగా ప్రవేశించడంతోపాటు, స్టేషన్ ప్లాట్‌ఫాంపై నిర్లక్ష్యపూరితంగా విన్యాసాలు చేస్తూ న్యూసెన్స్ సృష్టించాడన్న ఆరోపణలపై రైల్వే పోలీసులు అతన్ని అరెస్టు చేశారు.

సోషల్ మీడియాలో లైక్‌లు, షేర్ల కోసం తెగించేవారికి ఇదొక గుణపాఠం ఉంటుందని తెలుపుతూ రైల్వే పోలీసులు ట్వీట్ చేశారు. ఐతే యువకుడిని అరెస్ట్ చేయడాన్ని పలువురు తీవ్రమైన చర్యగా పేర్కొన్నారు. కౌన్సెలింగ్ ఇచ్చి వదిలేయడం లేదా స్టేషన్ పరిసరాల్లో సామాజిక సేవ చేయించడం వంటివి చేయిస్తే సరిపోతుంది కదా అంటూ పలువురు భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేశారు.




