AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Telangana: తెలంగాణపై ఇంకా విషం చిమ్ముతున్నారు.. బొత్స వ్యాఖ్యలపై ఫైర్‌ అయిన మంత్రి గంగుల

ఏపీ విద్యా శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ చేసిన వ్యాఖ్యలపై తెలంగాణ నేతలు ఫైర్‌ అవుతున్నారు. ఏపీ విద్యా విధానాన్ని తెలంగాణతో పోల్చటం సరికాదని, తెలంగాణలో చూచి రాతలు, కుంభకోణాలు రోజూ చూస్తున్నామంటూ బొత్స సంచలన వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. ఉపాధ్యాయుల బదిలీలు కూడా చేసుకోలేని దుస్థితిలో తెలంగాణ ఉందంటూ..

Telangana: తెలంగాణపై ఇంకా విషం చిమ్ముతున్నారు.. బొత్స వ్యాఖ్యలపై ఫైర్‌ అయిన మంత్రి గంగుల
Gangula Kamalakar
Narender Vaitla
|

Updated on: Jul 13, 2023 | 1:50 PM

Share

ఏపీ విద్యా శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ చేసిన వ్యాఖ్యలపై తెలంగాణ నేతలు ఫైర్‌ అవుతున్నారు. ఏపీ విద్యా విధానాన్ని తెలంగాణతో పోల్చటం సరికాదని, తెలంగాణలో చూచి రాతలు, కుంభకోణాలు రోజూ చూస్తున్నామంటూ బొత్స సంచలన వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. ఉపాధ్యాయుల బదిలీలు కూడా చేసుకోలేని దుస్థితిలో తెలంగాణ ఉందంటూ బొత్స చేసిన వ్యాఖ్యలపై రియాక్షన్స్‌ వస్తున్నాయి.

తాజాగా తెలంగాణ మంత్రి గంగుల కమాలకర్‌ బొత్స వ్యాఖ్యలపై ఫైర్‌ అయ్యారు. తెచ్చుకున్న తెలంగాణపై ఇంకా విషం చిమ్ముతున్నారంటూ విమర్శించారు. ఈ సందర్భంగా గంగుల మాట్లాడుతూ..’ఇప్పుడు వైసీపీలో ఉన్న బొత్స తెలంగాణ రాకముందు కాంగ్రెస్‌లో మంత్రిగా ఉన్నారు. ఆయన అప్పుడు కూడా తెలంగాణ కి వ్యతిరేకంగా మాట్లాడారు. ఇప్పుడు తెలంగాణ స్వరాష్ట్రం వచ్చాక కూడా విషం చిమ్ముతున్నారు. తెలంగాణ వచ్చాక రాష్ట్రము లో విద్యావ్యవస్థ మెరుగుపడింది. 297 గురుకులాలు మాత్రమే నాడు తెలంగాణ ప్రాంతంలో ఉండేవి. నాడు మంత్రిగా ఉన్న ఆంధ్ర నాయకుల వైఫల్యం వల్ల ఎంతోమంది చదవలేకపోయారు. కానీ ఇప్పుడు తెలంగాణ లో 1009 గురుకులాలు ఏర్పాటు చేసుకున్నాం . పది లక్షల మంది విద్యార్థులు ఇప్పుడు చదువుకుంటున్నారు. ఇప్పుడు కూడా ఏపీ లో 380 గురుకులాలే ఉన్నాయి. అవి కూడా పదోతరగతికి మాత్రమే పరిమితం చేశారు. బొత్స సత్యనారాయణ ఇవ్వన్నీ వినాలే… ఇష్టానుసారం మాట్లాడటం సరికాదంటూ’ విరుచుకుపడ్డారు.

ఇక TSPSC పేపర్‌ లీకేజీ వ్యవహారంపై స్పందించి గంగుల.. ‘TSPSCలో తప్పు జరిగితే పట్టుకుంది ప్రభుత్వమే. తప్పు చేసినవారిని శిక్షిస్తున్నాం. కానీ ఏపీ లో ఉద్యోగాలను దొంగదారుల్లో అమ్ముకుంటున్నారు . కనీసం ఒక్కరినైనా పట్టుకున్నారా బొత్స చెప్పాలి. ఆంధ్రాలో ఎమ్మెల్యేలు ,APPSC మెంబర్లే వసూళ్లు చేసి ఉద్యోగాలు ఇస్తున్నారు. బొత్స సత్యనారాయణ వీటన్నింటిపై సాయంత్రం లోపు స్పందించాలి. హైదరాబాదు మీద మళ్లీ ఆంధ్ర నాయకుల కన్ను పడిందా’ అంటూ ప్రశ్నించారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని తెలంగాణ వార్తల కోసం క్లిక్ చేయండి..

Follow Us
ప్రజలకు బిగ్ అలర్ట్.. తెలంగాణ, ఏపీలో దంచికొట్టనున్న వానలు
ప్రజలకు బిగ్ అలర్ట్.. తెలంగాణ, ఏపీలో దంచికొట్టనున్న వానలు
చినికి చినికి జాతీయ స్థాయి వివాదంగా పెద్దిలో జాన్వీ షో
చినికి చినికి జాతీయ స్థాయి వివాదంగా పెద్దిలో జాన్వీ షో
తెలుగు రాష్ట్రాల్లో దంచికొడుతున్న వర్షాలు
తెలుగు రాష్ట్రాల్లో దంచికొడుతున్న వర్షాలు
ప్రారంభానికి ముందే రికార్డ్స్ సొంతం చేస్తుకుంటున్న ఫ్యూచర్ సిటీ
ప్రారంభానికి ముందే రికార్డ్స్ సొంతం చేస్తుకుంటున్న ఫ్యూచర్ సిటీ
సినిమా లెవల్ ట్విస్ట్.. రాజకీయాల్లోకి రజినీ?
సినిమా లెవల్ ట్విస్ట్.. రాజకీయాల్లోకి రజినీ?
ఖబడ్దార్‌..నువ్వు ఒంటరి అయిపోతావ్ ! ట్రంప్‌ వార్నింగ్‌..!
ఖబడ్దార్‌..నువ్వు ఒంటరి అయిపోతావ్ ! ట్రంప్‌ వార్నింగ్‌..!
రోజూ వర్షమే.. కానీ గొడుగులు వాడరు ! ఆ వింత గ్రామం స్పెషాలిటీ ఇదే
రోజూ వర్షమే.. కానీ గొడుగులు వాడరు ! ఆ వింత గ్రామం స్పెషాలిటీ ఇదే
ట్రెక్కింగ్‌ కు వెళ్లి తిరిగి రాని యువతి.. మిస్టరీగా కేసు
ట్రెక్కింగ్‌ కు వెళ్లి తిరిగి రాని యువతి.. మిస్టరీగా కేసు
కత్రినా ఒత్తైన జుట్టు సీక్రెట్‌.. ఖరీదైన ప్రొడక్ట్స్‌ కాదట.
కత్రినా ఒత్తైన జుట్టు సీక్రెట్‌.. ఖరీదైన ప్రొడక్ట్స్‌ కాదట.
జపాన్‌లో జీవితంపై ఐఐఎం కాశీపూర్‌.. పూర్వ విద్యార్థి వీడియో
జపాన్‌లో జీవితంపై ఐఐఎం కాశీపూర్‌.. పూర్వ విద్యార్థి వీడియో