AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Owaisi Brothers: భద్రత ఉంటే సరిపోదు.. యూపీలో అతీక్‌కు జరిగినట్టే మీకూ జరుగుతుంది.. ఓవైసీ బ్రదర్స్‌కు వార్నింగ్‌..

Warning to Owaisi Brothers: హైదరాబాద్ ఓల్డ్ సిటీ రాజకీయాల్లో సెన్సెషనల్ సీన్ తెరపైకి వచ్చింది. అసదుద్దీన్‌, అక్బరుద్దీన్‌ ఓవైసీ బ్రదర్స్‌కు సోషల్‌ మీడియాలో బెదిరింపులు రావడం ఇప్పుడు కలకలం రేపింది.

Owaisi Brothers: భద్రత ఉంటే సరిపోదు.. యూపీలో అతీక్‌కు జరిగినట్టే మీకూ జరుగుతుంది.. ఓవైసీ బ్రదర్స్‌కు వార్నింగ్‌..
Owaisi Brothers
Noor Mohammed Shaik
| Edited By: Shaik Madar Saheb|

Updated on: Jul 13, 2023 | 8:30 PM

Share

Warning to Owaisi Brothers: హైదరాబాద్ ఓల్డ్ సిటీ రాజకీయాల్లో సెన్సెషనల్ సీన్ తెరపైకి వచ్చింది. అసదుద్దీన్‌, అక్బరుద్దీన్‌ ఓవైసీ బ్రదర్స్‌కు సోషల్‌ మీడియాలో బెదిరింపులు రావడం ఇప్పుడు కలకలం రేపింది. ఎంఐఎం నేతలు ప్రజలను ఇబ్బందులకు గురిచేస్తున్నారని సామాజిక కార్యకర్త సయ్యద్‌ సలీం సోషల్‌ మీడియాలో వార్నింగ్‌ ఇచ్చారు. అధికారం శాశ్వతం కాదని, ప్రధాని మోదీ, అమిత్‌ షాను అడిగి భద్రత తెప్పించుకున్నంత మాత్రాన సరిపోదని, యూపీలో అతీక్‌ అహ్మద్‌కు జరిగినట్టే జరుగుతుందంటూ హెచ్చరికలు చేశారు. ఇందిరాగాంధీనే భద్రతా సిబ్బంది కాపాడుకోలేకపోయారని, ఎప్పుడు ఏదైనా జరగొచ్చంటూ సోషల్‌ మీడియా వేదికగా పేర్కొన్నారు. సలీం చేసిన ఈ వ్యాఖ్యలు ఇప్పుడు సర్వత్రా చర్చనీయాంశంగా మారాయి.

ఈ మధ్య కాలంలోనే అక్బరుద్దీన్‌ ఓవైసీ కూడా సంచలన కామెంట్స్‌ చేశారు. తనపై కుట్రలు జరుగుతున్నాయని, స్కూల్స్‌ని మూసివేయడానికి కొందరు చూస్తున్నారని ఆరోపణలు చేశారు. 2011లో తనను హత్యచేయడానికి యత్నించిన వారిని, దాడి జరుగుతుంటే అక్కడే వదిలేసి పారిపోయిన వారిని కూడా క్షమిస్తున్నానని అన్నారు. అంతేకాకుండా తనను ప్రాణాలతో రక్షించిన వారికి, కార్యకర్తలకు ఊపిరి ఉన్నంత వరకు రుణపడి ఉంటానని చెప్పారు.

కాగా.. సలీం వ్యాఖ్యలతో పలు అనుమానాలు తావిస్తున్నాయి. ఇప్పటికే అక్బరుద్దీన్‌, అసదుద్దీన్‌ ఓవైసీ ఇద్దరూ హైసెక్యూరిటీ జోన్‌లో ఉన్నారు. నిరంతరం అనుచరులు కూడా భద్రతగా ఉంటారు. కేంద్రం కూడా భద్రత విషయంలో జాగ్రత్తలు తీసుకుంటోంది.

ఇవి కూడా చదవండి

మరిన్ని తెలంగాణ వార్తల కోసం..