Kishan Reddy: కిషన్ రెడ్డికి అరుదైన గౌరవం.. యూఎన్ డబ్ల్యూటీవో నుంచి ఆహ్వానం..

ఇప్పటివరకు భారతదేశంలో ఏ పర్యాటక శాఖ మంత్రికి దక్కని అరుదైన అవకాశం కిషన్ రెడ్డికి దక్కబోతోంది. అమెరికాలోని న్యూయార్క్ వేదికగా ఐక్యరాజ్యసమితి హైలెవల్ పొలిటికల్ ఫోరమ్ సమావేశాల్లో.

Kishan Reddy: కిషన్ రెడ్డికి అరుదైన గౌరవం.. యూఎన్ డబ్ల్యూటీవో నుంచి ఆహ్వానం..
G Kishan Reddy (File Photo)
Follow us
TV9 Telugu

| Edited By: Ravi Kiran

Updated on: Jul 13, 2023 | 6:51 PM

మన తెలుగువాడు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డికి అరుదైన గౌరవం దక్కబోతోంది. ఇప్పటివరకు భారతదేశంలో ఏ పర్యాటక శాఖ మంత్రికి దక్కని అరుదైన అవకాశం కిషన్ రెడ్డికి దక్కబోతోంది. అమెరికాలోని న్యూయార్క్ వేదికగా ఐక్యరాజ్యసమితి హైలెవల్ పొలిటికల్ ఫోరమ్ సమావేశాల్లో ప్రసంగించేందుకు కేంద్రమంత్రి కిషన్ రెడ్డి.. ఢిల్లీ నుంచి బయలుదేరి వెళ్లారు. అమెరికా కాలమానం ప్రకారం.. 14వ తేదీ మధ్యాహ్నం 1.15 నుంచి UNWTO (ఐక్యరాజ్యసమితి ప్రపంచ పర్యాటక సంస్థ) ఆధ్వర్యంలో జరుగుతున్న ఈ HLPF సమావేశాల్లో ఆయన ప్రసంగిస్తారు..

ఈ సమావేశాలకు ఆహ్వానం అందుకున్న మొదటి భారత పర్యాటక మంత్రిగా అరుదైన గౌరవాన్ని అందుకున్న కిషన్ రెడ్డి.. ‘జీ-20 టూరిజం చైర్‌’ హోదాలో ఈ అంతర్జాతీయ సమావేశాల్లో పాల్గొనబోతునున్నారు. ఇటీవలే గోవాలో జరిగిన జీ-20 దేశాల పర్యాటక మంత్రుల సమావేశాల లో ‘గోవా రోడ్‌మ్యాప్’ రూపంలో భారతదేశం చేసిన ప్రతిపాదనలకు సభ్యదేశాలు, ఆతిథ్యదేశాలు ఏకగ్రీవంగా ఆమోదం తెలిపారు

అయతే ఇప్పుడు కిషన్ రెడ్డి UN లో చేసే ప్రసంగం వినేందుకు ప్రపంచంలోని వివిధ దేశాల ప్రతినిధులు, బడా పారిశ్రామికవేత్తల ఉండబోతున్నారు. ఈ ప్రసంగం ద్వారా భారతదేశానికి టూరిజం రంగంలో మరింత పెట్టుబడులు వస్తాయని కిషన్ రెడ్డి ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.

అమెరికా పర్యటన సందర్భంగా 14, 15 తేదీల్లో కేంద్రమంత్రి కిషన్ రెడ్డి.. పలు చారిత్రక మ్యూజియంలను సందర్శించనున్నారు. పలు పర్యాటక రంగ సంస్థల ప్రతినిధులతో చర్చిచనున్నారు. భారత కాన్సులేట్ ఆధ్వర్యంలో అమెరికాలో ఉంటున్న భారత సంతతి ప్రజలు, ప్రముఖులతో నిర్వహిస్తున్న సమావేశంలో పాల్గొని, ప్రసంగిస్తారు. అనంతరం ‘ఓవర్సీస్ ఫ్రెండ్స్ ఆఫ్ బీజేపీ’ సమావేశంలోనూ కిషన్ రెడ్డి పాల్గొననున్నారు.అక్కడినుంచి లండన్ బయలుదేరి వెళ్లనున్న కేంద్రమంత్రి.. 19వ తేదీ ఉదయం ఢిల్లీ చేరుకోనున్నారు.