Revanth Reddy: కేంద్రంతో అగ్రిమెంట్ చేసుకున్నారు.. కేసీఆర్ సర్కార్‌పై రేవంత్‌రెడ్డి సంచలన ఆరోపణలు..
TPCC Chief Revanth Reddy: నా మాటలను కేటీఆర్ ఎడిట్‌చేసి అతి తెలివి ప్రదర్శించారు.. దుష్ప్రచారం చేశారు.. ఉచిత విద్యుత్‌పై బీఆర్‌ఎస్‌తో చర్చకు సిద్ధం.. అంటూ టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. వ్యవసాయానికి ఉచిత విద్యుత్ గురించి మాట్లాడిన మాటలను వక్రీకరించారంటూ..
TPCC Chief Revanth Reddy: నా మాటలను కేటీఆర్ ఎడిట్‌చేసి అతి తెలివి ప్రదర్శించారు.. దుష్ప్రచారం చేశారు.. ఉచిత విద్యుత్‌పై బీఆర్‌ఎస్‌తో చర్చకు సిద్ధం.. అంటూ టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. వ్యవసాయానికి ఉచిత విద్యుత్ గురించి మాట్లాడిన మాటలను వక్రీకరించారంటూ టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి క్లారిటీ ఇచ్చారు. ఈ మేరకు గురువారం మీడియాతో మాట్లాడారు. తాను టీపీసీసీ చీఫ్ హోదాలోనే తానా సభకు హాజరయ్యానని.. కాంగ్రెస్ విధానాలను వివరించడానికే అక్కడికి వెళ్లానంటూ పేర్కొన్నారు. కేటీఆర్ నా మాటలను వక్రీకరించారు.. నా మాటలను ఎడిట్‌చేసి కేటీఆర్ అతి తెలివి ప్రదర్శించారంటూ ఫైర్ అయ్యారు రేవంత్ రెడ్డి.. ఉచిత విద్యుత్‌పై బీఆర్‌ఎస్‌తో చర్చకు సిద్ధమని.. ఆనాటి బషీర్‌బాగ్ కాల్పులకు కేసీఆరే కారణమంటూ రేవంత్ పేర్కొన్నారు. ఉచిత కరెంట్‌కు వ్యతిరేకంగా ఆనాడు కేసీఆర్ స్టేట్‌మెంట్లు ఇచ్చారు.. బషీర్‌బాగ్‌లో రైతులను కాల్చి చంపించిందే కేసీఆర్ అంటూ ఆరోపించారు. కాంగ్రెస్ వల్లే ఈరోజు తెలంగాణలో విద్యుత్ వెలుగులు అని పేర్కొన్నారు. కిరణ్‌కుమార్‌రెడ్డి ప్రెస్‌మీట్ తర్వాత విద్యుత్ కోసం టీకాంగ్రెస్ పోరాడిందన్నారు. అందుకే, వినియోగం పద్ధతిన తెలంగాణకు 53శాతం విద్యుత్ వచ్చిందన్నారు. జనాభా ఎక్కువ ఉన్నా ఏపీకి 47శాతమే విద్యుత్ కేటాయించారన్నారు.
నేను రైతు బిడ్డను, కేటీఆర్‌లాగా అమెరికాలో పనిచేయలేదన్నారు. కేటీఆర్, బీఆర్‌ఎస్ చిల్లర రాజకీయం చేస్తున్నారని రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. కేంద్రం మాట వినకుండా అధిక రేటుకు విద్యుత్ కొంటున్నారు.. కేంద్రం విద్యుత్ ఇస్తామన్నా వినకుండా సొంత ప్లాంట్‌లు కట్టారన్నారు. నిషేధించిన టెక్నాలజీతో విద్యుత్ ప్లాంట్‌లు నిర్మించారు.. కమీషన్ల కోసం విద్యుత్ సంస్థలను అప్పులపాలు చేశారన్నారు. విద్యుత్ సంస్థలను కేసీఆర్ కుప్పకూల్చారు.. కేంద్రం ర్యాంకుల్లో సి-మైనస్ గ్రేడ్‌లో తెలంగాణ ఉందని.. ఉచిత విద్యుత్ పేరుతో దోచుకుంటున్నారంటూ మండిపడ్డారు.
ఫ్రీ కరెంట్ పేరుతో ఏటా రూ.8వేల కోట్ల దోపిడీ చేశారని.. కమీషన్ల కోసం విద్యుత్ సంస్థలను అప్పులపాలు చేశారంటూ ఫైర్ అయ్యారు. ఈ సందర్భంగా కేసీఆర్ సర్కార్‌పై రేవంత్‌రెడ్డి సంచలన ఆరోపణలు చేశారు. పంప్‌సెట్లకు మీటర్లు పెడతామని కేంద్రంతో అగ్రిమెంట్ చేసుకున్నారని.. ఆధారాలు ఇవిగో అంటూ డాక్యుమెంట్స్ బయటపెట్టారు. కాదని చెప్పే ధైర్యముందా అంటూ హరీష్, కేటీఆర్‌కి సవాల్ చేశారు.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం..