Peacock: అయ్యో పాపం.. కళ్లు కనిపించక గ్రామంలోకి వచ్చిన నెమలి.. చికిత్స చేస్తున్న వైద్యులు

ప్రకాశం జిల్లా గిద్దలూరు మండలం సంజీవరాయపేట సమీపంలో ఓ నెమలి గ్రామ పరిసర ప్రాంతాలలో తిరుగుతున్న విషయాన్ని స్థానిక ప్రజలు గుర్తించారు... అటవీశాఖ అధికారులకు సమాచారం ఇచ్చారు. గ్రామానికి చేరుకున్న అటవీశాఖ అధికారులు నెమలిని పట్టుకొని పరీక్షించారు.

Peacock: అయ్యో పాపం.. కళ్లు కనిపించక గ్రామంలోకి వచ్చిన నెమలి.. చికిత్స చేస్తున్న వైద్యులు
Peacock 2
Follow us

| Edited By: Surya Kala

Updated on: Jul 14, 2023 | 8:28 AM

ఆ నెమలికి కళ్ళు ఎందుకు పోయాయి..  వేటగాళ్లు నెమలిని పట్టుకునేందుకు పెట్టిన ఆహారం తిని కళ్ళు పోగొట్టుకుందా.. పుట్టుకతోనే కళ్ళు కనిపించవా.. లేక ఈమధ్య చూపు పోగొట్టుకుందా..  కారణం ఏమై ఉంటుంది..  ఈ ప్రశ్నలే ఇప్పుడు ఆ గ్రామస్తుల్ని కలవర పెడుతున్నాయి.. చూడముచ్చటగా ఉన్న ఆ జాతీయ పక్షి నెమలి కళ్ళు కనిపించక అడవి నుంచి గ్రామాల్లోకి వచ్చిందన్న సంగతి తెలుసుకొని ఆవేదన చెందుతున్నారు..

ప్రకాశం జిల్లా గిద్దలూరు మండలం సంజీవరాయపేట సమీపంలో ఓ నెమలి గ్రామ పరిసర ప్రాంతాలలో తిరుగుతున్న విషయాన్ని స్థానిక ప్రజలు గుర్తించారు… అటవీశాఖ అధికారులకు సమాచారం ఇచ్చారు. గ్రామానికి చేరుకున్న అటవీశాఖ అధికారులు నెమలిని పట్టుకొని పరీక్షించారు… నెమలిని పట్టుకునే సమయంలో అది పారిపోకుండా అక్కడే నిలబడటం… కనీసం కదలకుండా అక్కడే ఉండటం గమనించారు అటవీ సిబ్బంది… అనుమానం వచ్చి నెమలి కళ్ళను పరీక్షించారు… నెమలికి కళ్ళు కనిపించడం లేదని గుర్తించారు… అటవీశాఖ అధికారుల సంరక్షణలో వెటర్నరీ వైద్యుల పర్యవేక్షణలో నెమలికి చికిత్స ప్రారంభించారు..  ప్రస్తుతం నెమలికి చికిత్స అందిస్తున్నామని అటవీశాఖ అధికారులు తెలిపారు. నెమలి పరిస్థితిని గమనించి కోలుకున్న అనంతరం అటవీ ప్రాంతంలో విడిచిపెడతామని అటవి శాఖ అధికారులు తెలిపారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..