Jai Chiranjeeva: చిరంజీవి మేనకోడలు ఇంత మారిపోయింది మావా.. ? గ్లామరస్ లుక్కులో అదిరిపోయిన జై చిరంజీవి చైల్డ్ ఆర్టిస్ట్..
ఒకప్పుడు తన ముద్దు ముద్దు మాటలు.. అమాయకత్వం.. చూడగానే ముచ్చటగా మాట్లాడే పసితనంతో తెలుగు ప్రేక్షకులను ఆకట్టుకున్న చైల్డ్ ఆర్టిస్టులు చాలా మంది ఉన్నారు. అందులో ఇప్పుడు మనం మాట్లాడుకుంటున్న అమ్మడు ఒకరు. మెగాస్టార్ చిరంజీవి మేనకోడలిగా కనిపించింది. చిరుతో కలిసి ఆ చిన్నారి చేసిన అల్లరి, యాక్టింగ్ థియేటర్లలో అడియన్స్ హృదయాలను హత్తుకుంది. ఇంతకీ ఆ అమ్మడు ఎవరో గుర్తుకు వచ్చిందా.. ?

తెలుగు సినీ పరిశ్రమలో ఎంతో మంది చైల్డ్ ఆర్టిస్టులు తమ నటనతో, అమాయకత్వంతో తమదైన ముద్ర వేశారు. అందులో ఈ అమ్మడు ఒకరు. మెగాస్టార్ చిరంజీవి కథానాయకుడిగా నటించిన సూపర్ హిట్ చిత్రం ‘జై చిరంజీవ’ గుర్తుందా? ఇందులో చిరంజీవి మేనకోడలిగా, తన ముద్దుల మాటలతో ప్రేక్షకులను ఎంతగానో అలరించిన ఆ చిన్నారి గుర్తే ఉండే ఉంటుంది. ఆ సినిమాలో ఆమె నటన, క్యూట్ ఎక్స్‌ప్రెషన్స్ అందరినీ కట్టిపడేశాయి. ఆ పాత్రలో ఒదిగిపోయిన బాలనటి పేరు శ్రియా శర్మ. కేవలం ‘జై చిరంజీవ’ మాత్రమే కాకుండా టాలీవుడ్‌లో ప్రిన్స్ మహేష్ బాబు ‘దూకుడు’, జూనియర్ ఎన్టీఆర్ ‘ఊసరవెల్లి’, రామ్ చరణ్ ‘మగధీర’, రజనీకాంత్ ‘రోబో’ వంటి ఎన్నో ప్రతిష్టాత్మక చిత్రాలలో చైల్డ్ ఆర్టిస్ట్‌గా నటించి మెప్పించింది. అయితే, ఇంతటి క్రేజ్ సంపాదించుకున్న ఈ చైల్డ్ ఆర్టిస్ట్ ప్రస్తుతం ఏం చేస్తోంది? ఎక్కడ ఉంది? అనే ఆసక్తి అందరిలోనూ నెలకొంది. చైల్డ్ ఆర్టిస్ట్‌గా బిజీగా ఉన్న సమయంలోనే శ్రియా శర్మ చదువుపై ప్రత్యేక శ్రద్ధ పెట్టింది. ఆ తర్వాత ‘నిర్మలా కాన్వెంట్’ అనే సినిమాతో హీరోయిన్‌గా కూడా అదృష్టాన్ని పరీక్షించుకుంది. కానీ, ఆ సినిమా ఆశించిన స్థాయిలో సక్సెస్ కాకపోవడంతో ఆమె వెండితెరకు కాస్త దూరమైంది.
సినిమాలకు బ్రేక్ ఇచ్చిన శ్రియా శర్మ తన దృష్టిని పూర్తిగా ఉన్నత చదువులపై పెట్టింది. లా (Law) పూర్తి చేసి లాయర్‌గా తన కెరీర్‌ను మలుచుకుంది. ప్రస్తుతం ఆమె ముంబైలో అడ్వకేట్‌గా ప్రాక్టీస్ చేస్తూ, కార్పొరేట్ చట్టాల రంగంలో లాయర్‌గా స్థిరపడింది. గ్లామర్ ప్రపంచాన్ని వదిలి, ఎంతో కష్టతరమైన న్యాయవాద వృత్తిని ఎంచుకుని అందులో రాణిస్తుండటం విశేషం. సినిమాల్లో కనిపించకపోయినప్పటికీ, శ్రియా శర్మ సోషల్ మీడియాలో మాత్రం చాలా యాక్టివ్‌గా ఉంటుంది.
తన లేటెస్ట్ ఫోటోలు, ప్రొఫెషనల్ లైఫ్‌కి సంబంధించిన అప్‌డేట్స్‌ను ఎప్పటికప్పుడు అభిమానులతో పంచుకుంటుంది. చైల్డ్ ఆర్టిస్ట్‌గా అలరించిన ఆ చిన్నారి, ఇప్పుడు ఒక బాధ్యతాయుతమైన లాయర్‌గా మారడం చూసి నెటిజన్లు ఆమెను ఎంతగానో అభినందిస్తున్నారు. వినోద పరిశ్రమలో విజయాలు అందుకున్నప్పటికీ, చదువుకు ప్రాధాన్యతనిచ్చి సొంతంగా ఒక గుర్తింపు తెచ్చుకున్న శ్రియా శర్మ నిజంగా ఎందరికో స్ఫూర్తిదాయకం. ప్రస్తుతం ఈ అమ్మడు ఫోటోస్ అందరినీ ఆకట్టుకుంటున్నాయి.
ఎక్కువ మంది చదివినవి : Trending Song: వామ్మో.. ఇదేం క్రేజ్ రా బాబూ.. యూట్యూబ్‌ను షేక్ చేస్తున్న పక్కా ఫోక్ సాంగ్.. ఇన్ స్టాలో దుమ్మురేపుతున్న రీల్స్..
శ్రియా శర్మ పోస్ట్..
View this post on Instagram
ఎక్కువ మంది చదివినవి : Sampath Raj : అలాంటి హీరోను ఎక్కడా చూడలేదు.. ఆయన యాక్టింగ్ చూసి ఫిదా అయిపోయా.. నటుడు సంపత్ రాజ్..
