AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Andha News: కాకినాడ చిన్నారి మిస్సింగ్‌ కేసులో ట్విస్ట్.. 3 రోజుల తర్వాత తిరిగొచ్చిన పెట్‌డాగ్..

వెంట వెళ్లిన కుక్క వెనక్కి తిరిగి వచ్చింది. మరి జాహ్నవి జాడేది. కాకినాడ జిల్లాలో చిన్నారి జ్ఞానేశ్వరి అలియాస్‌ జాహ్నవి మిస్సింగ్‌ కేసు సంచలనం రేపింది. పోలీసులు, SDRF టీమ్స్‌ సంయుక్తంగా సెర్చ్‌ ఆపరేషన్‌ చేపట్టారు.. జాహ్నవి ఎక్కడ ఉంది ? ఎలా వుందో తెలియక కుటుంబసభ్యులు గుండెలవిసేలా రోదిస్తు్నారు. ఎవరో కిడ్నాప్‌ చేసి వుంటారనే అనుమానాలు వ్యక్తం చేశారు.

Andha News: కాకినాడ చిన్నారి మిస్సింగ్‌ కేసులో ట్విస్ట్.. 3 రోజుల తర్వాత తిరిగొచ్చిన పెట్‌డాగ్..
Kakinada Missing Child
Pvv Satyanarayana
| Edited By: |

Updated on: Jun 10, 2026 | 10:08 PM

Share

కాకినాడ జిల్లాలోని దొండపాక సీహెచ్ అగ్రహారం కొండల ప్రాంతంలో నాలుగు రోజులుగా కనిపించకుండా పోయిన రెండేళ్ల చిన్నారి జాహ్నవి కోసం గాలింపు చర్యలు కొనసాగుతున్న వేళ కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. చిన్నారి అదృశ్యమైన రోజు నుంచి ఆమెతో పాటు కనిపించకుండా పోయిన పెంపుడు కుక్క మంగళవారం సాయంత్రం ఒక్కసారిగా ఇంటి సమీప ప్రాంతానికి చేరుకోవడం స్థానికంగా తీవ్ర చర్చకు దారితీసింది.

వివరాల్లోకి వెళ్తే.. నాలుగు రోజుల క్రితం జాహ్నవి తన పెట్‌ డాగ్‌ను తీసుకొని బయటకు వెళ్లింది. అయితే దాదాపు 3 రోజుల తరువాత జాహ్నవి తీసుకెళ్లిన పెంపుడు కుక్క ఇంటికి తిరిగి వచ్చింది. కానీ జాహ్నవి జాడ మాత్రం ఎక్కడా కనిపించలేదు. దీంతో పోలీసులు డాగ్‌ స్క్వాడ్‌ను రంగంలోకి దింపారు. కుక్క వచ్చిన దారిలో గాలింపు చేపట్టారు పోలీసులు. పోలీస్‌ డాగ్స్‌ కొండపైన ఉన్న జీడిపిక్కల తోటల వరకు వెళ్లడంతో జీడిపిక్కలకు ఏరుకునే వాళ్లెవరైనా జాహ్నవిని కిడ్నాప్‌ చేశారా? అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

కానీ డాగ్‌ స్క్కాడ్‌ అక్కడితో ఆగలేదు.. అక్కడి నుంచి మళ్లీ దొండవాక గ్రామానికి వెళ్లాయి. దాంతో పోలీసులు దొండవాకలో ఇంటింటిని గాలించారు. అనుమానితులిగా కొందర్ని అదుపులోకి తీసుకొని వానిరి ప్రశ్నిస్తున్నారు. కుక్క వెళ్లిన జాడలు, జాహ్నవి తల్లి వ్యక్తం చేసిన అనుమానాలతో అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్నారు పోలీసులు. అడవిలో నుంచి జీడి పిక్కలను ఏరుకు వచ్చిందెవరు? వాళ్ల దగ్గర జీడి పిక్కలను కొన్నదెవరో కూడా ఆరా తీస్తున్నారు. నాలుగు రోజుల గడిచిన చిన్నారి ఆచూకీ లభించకపోవడంతో ఆందోళనలో ఉన్నారు తల్లిదండ్రులు కుటుంబ సభ్యులు. తమ చిన్నారి క్షేమంగా తిరిగి రావాలని కోరుకుంటున్నారు.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Follow Us