AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

APSRTC: ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణించే మహిళలకు సూపర్ న్యూస్.. ప్రభుత్వం కీలక నిర్ణయం..

ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఆర్టీసీ బస్సుల్లో మహిళ కోసం మరో కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. ఇప్పటికే బస్సుల్లో మహిళల కోసం ఉచిత బస్సు ప్రయాణాన్ని అమలు చేస్తోన్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో మహిళల కోసం మరో సూపర్ న్యూస్ అందించారు.

APSRTC: ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణించే మహిళలకు సూపర్ న్యూస్.. ప్రభుత్వం కీలక నిర్ణయం..
Apsrtc Buses
Venkatrao Lella
|

Updated on: Jun 10, 2026 | 10:25 PM

Share

ఆర్టీసీ బస్సుల్లో మహిళా ప్రయాణికుల కోసం ఏపీ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. అన్ని ఆర్టీసీ బస్సుల్లో మహిళల కోసం శానిటరీ న్యాప్ కిన్స్ అందుబాటులో ఉంచనుంది. త్వరలోనే దీనిని అమలు చేయనున్నారు. ఈ విషయాన్ని రవాణశాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి తెలిపారు. ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు శానిటరీ న్యాప్‌కిన్స్ అందుబాటులో ఉంచాలన ఏఫీ మహిళా కమిషన్ చైర్ పర్సన్ రాయపాటి శైలజ  మంత్రికి లేఖ రాశారు. ఈ లేఖపై రవాణశాఖ మంత్రి సానుకూలంగా స్పందించినట్లు రాయపాటి శైలజ తన ఎక్స్ అకౌంట్‌లో పేర్కొన్నారు.

మహిళా ప్రయాణికుల కోసం..

“ఆర్టీసీ బస్సులో అనుకోని అవసర సమయాల్లో శానిటరీ న్యాప్‌కిన్స్ అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకోవాలని రవాణా శాఖ మంత్రి లేఖ రాశాను. ఈ అంశంపై మంత్రి సానుకూలంగా స్పందించడం హర్షణీయం.. ఆమె గౌరవం.. మన బాధ్యత అంటూ రాయపాటి శైలజ ఎక్స్‌లో పేర్కొన్నారు. దీంతో త్వరలోనే ఆర్టీసీ బస్సుల్లో మహిళల కోసం అందుబాటులోకి తీసుకురానున్నారని తెలుస్తోంది. ప్రతీ బస్సులోనూ వీటిని అందుబాటులో ఉంచనున్నారని సమాచారం. కాగా ఇప్పటికే తెలంగా ప్రభుత్వం మహిళ కోసం ఇలాంటి తరహా కార్యక్రమాన్ని అమలు చేసేందుకు సిద్దమైంది. ఆర్టీసీ బస్టాండ్లు, డిపోల వద్ద శానిటరీ నాప్ కిన్స్ వెండింగ్ మెషిన్లు ఏర్పాటు చేసేందుకు సిద్దమవుతోంది. ఈ మేరకు రవాణాశాఖ, టీజీఎస్‌ఆర్టీసీ కలిసి నహేలీ అనే ఎన్‌జీవీతో కలిసి ఈ కార్యక్రం చేపట్టాలని నిర్ణయించాయి. ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యం వల్ల బస్సుల్లో మహిళల రద్దీ విపరీతంగా ఉంటుంది. దీంతో వారికి ఇబ్బంది లేకుండా అన్ని సౌకర్యాలు కల్పించనున్నారు. అందులో భాగంగా ఈ నిర్ణయం తీసుకున్నారు.

Follow Us