ఈ కాలేజీ డ్రాపవుట్ కుర్రాడు.. సిమ్ కార్డ్స్ అమ్మకంతో సంపాదన మొదలు.. నేడు హోటల్స్ రంగాన్ని షేక్ చేస్తూ.. 82 వేల కోట్లకు అధిపతి

ఒడిశాలోని రాయగఢ్ ప్రాంతంలోని ఒక చిన్న పట్టణానికి చెందిన రితేష్ అగర్వాల్ 13 సంవత్సరాల వయస్సులో సిమ్ కార్డులను అమ్ముతూ డబ్బుల సంపాదన మొదలు పెట్టాడు. రాజస్థాన్‌లోని కోటాలో సెయింట్ జాన్స్ సీనియర్ సెకండరీ స్కూల్ పూర్తి చేసుకున్న రితేష్ ఉన్నత విద్య కోసం ఢిల్లీకి చేరుకున్నాడు. రితేష్‌ ను తండ్రి రమేష్ ఇంజనీరింగ్ చదివించాలని మంచి భవిష్యత్ ఇవ్వాలని కోరుకున్నాడు. అయితే రితేష్ ఆలోచనలు ఇంజనీరింగ్ చదువు మీద లేదు.. తండ్రి ఆలోచనల కంటే భిన్నమైన ఆలోచనలు ఉన్నాయి.

ఈ కాలేజీ డ్రాపవుట్ కుర్రాడు.. సిమ్ కార్డ్స్ అమ్మకంతో సంపాదన మొదలు.. నేడు హోటల్స్ రంగాన్ని షేక్ చేస్తూ.. 82 వేల కోట్లకు అధిపతి
Ritesh Agrawal
Follow us

|

Updated on: Jul 14, 2023 | 9:32 AM

విజయానికి అడ్డదారులు లేవు.. కష్టపడడమే సక్సెస్ రహస్యం.. ఇది కొంతమంది విషయంలో రుజువు అవుతూ ఉంది. చదువు మధ్యలో ఆపేసిన యువకుడు సరికొత్త ఆలోచనలో హోటల్స్ రంగాన్ని షేక్ చేశాడు. ఎన్నో విషయాల్లో వివాదాస్పదం అయ్యి.. అపఖ్యాతి పాలైనా ఓయో హోటల్స్ మన దేశంలోని హాస్పిటాలిటీ వ్యాపారాన్ని నిస్సందేహంగా కుదిపేసిందనే  మాటను ఎవరూ కాదన లేని వాస్తవం.  అతి పిన్న వయసులోనే ఓయో హోటల్స్ స్థాపించి సరికొత్త ఆలోచనలో ప్రపంచాన్ని తనవైపుకు తిప్పుకున్న వ్యక్తి రితేష్ అగర్వాల్.

24 ఏళ్ల వయసులో ఓయో హోటల్స్ ని స్థాపించిన రితేష్ అగర్వాల్..  2020లో ప్రపంచంలోనే అత్యంత పిన్న వయస్కులైన సెల్ఫ్-మేడ్ బిలియనీర్ల జాబితాలో కైలీ జెన్నర్ తర్వాత రెండవ స్థాన్ని దక్కించుకున్నాడు. తక్కువ సమయంలో హోటల్ రంగంలో $2 బిలియన్ల (మన దేశ కరెన్సీలో . 16,462 కోట్లు) నికర విలువతో అగ్రస్థానానికి చేరుకున్నాడు. దీని వెనుక రితేష్ సంకల్పం, దీక్ష పట్టుదల ఉన్నాయని అంటారు.  అంతేకాదు అతని వ్యవస్థాపక తత్వానికి స్మారక చిహ్నం ఈ విజయం.

రితేష్ అగర్వాల్ 40 ఏళ్లలోపు అత్యంత సంపన్నుడిగా రికార్డ్ సృష్టించాడు. భారతదేశంలో అతిపెద్ద హోటల్ నెట్‌వర్క్, సాఫ్ట్‌బ్యాంక్ మద్దతు ఉన్న కంపెనీ విలువ .. ఇప్పుడు రూ. 82,307 కోట్లు. ఇటీవలే చైనాలో రెండవ అతిపెద్ద చైన్ బిజినెస్ ను ఓయో బీట్ చేసింది. అంతేకాదు 2023 నాటికి ప్రపంచవ్యాప్తంగా ఉన్న అన్ని ఇతర హోటల్ చైన్‌లను అధిగమించే ప్రతిష్టాత్మక ప్రణాళికలను  చేపట్టి పూర్తి స్థాయిలో వ్యాపారరంగంలో దూసుకెళ్తోంది.

ఇవి కూడా చదవండి

రితేష్ అగర్వాల్:   కాలేజ్ డ్రాపవుట్

ఒడిశాలోని రాయగఢ్ ప్రాంతంలోని ఒక చిన్న పట్టణానికి చెందిన రితేష్ అగర్వాల్ 13 సంవత్సరాల వయస్సులో సిమ్ కార్డులను అమ్ముతూ డబ్బుల సంపాదన మొదలు పెట్టాడు. రాజస్థాన్‌లోని కోటాలో సెయింట్ జాన్స్ సీనియర్ సెకండరీ స్కూల్ పూర్తి చేసుకున్న రితేష్ ఉన్నత విద్య కోసం ఢిల్లీకి చేరుకున్నాడు. రితేష్‌ ను తండ్రి రమేష్ ఇంజనీరింగ్ చదివించాలని మంచి భవిష్యత్ ఇవ్వాలని కోరుకున్నాడు. అయితే రితేష్ ఆలోచనలు ఇంజనీరింగ్ చదువు మీద లేదు.. తండ్రి ఆలోచనల కంటే భిన్నమైన ఆలోచనలు ఉన్నాయి. రితేష్ ఐఐటీ-జేఈఈ ప్రవేశ పరీక్ష సిద్ధం కావడానికి 10వ తరగతిలో ఢిల్లీకి వెళ్లాడు. అయితే ఇంజనీరింగ్ కాలేజీలో చేరినప్పటికీ రితేష్ ఆలోచన అంతా వ్యాపారం పైనే.. ఎలాగైనా సరే తాను సొంతంగా వ్యాపారం ప్రారంభించాలని ఆలోచిస్తూ ఉండేవాడు.

విజయానికి తొలి అడుగులు

దీంతో చదువుకు మధ్యలోనే గుడ్ బై చెప్పేసి వ్యాపారంలో అడుగు పెట్టాలని నిర్ణయించుకున్నాడు.  19 సంవత్సరాల వయస్సులో 2013లో పీటర్ థీల్ ప్రారంభించిన థీల్ ఫెలోషిప్ కి ఎంపికయ్యాడు.  ఫెలోషిప్ గా $100,000 గ్రాంట్ ను రితేష్ కు ఇచ్చింది. సెప్టెంబరు 2012లో ఓరావెల్ స్టేస్‌ను ప్రారంభించాడు. తక్కువ ధరకు బస ఎక్కడ దొరుకుతుందో తెలిపే ప్రత్యేకత కలిగిన వెబ్‌సైట్ ను మొదలు పెట్టాడు. హాస్పిటాలిటీ రంగాన్ని సరికొత్త దిశగా అడుగులు వేసే మిషన్‌లో ఇది మొదటి అడుగు.

OYO గదుల పుట్టుక

మే 2013లో  OYO రూమ్స్ ప్రారంభమయ్యాయి. భారతదేశం అంతటా  తక్కువ ధరకే అన్ని సదుపాయాలున్న బసను అందించే ఈ అద్భుతమైన  చైన్ హోటల్స్ గా పర్యాటకులకు పరిచయం అయింది. తక్కువ సమయంలో ఓయో రూమ్స్ అత్యంత  ప్రజాదరణ పొందాయి. సెప్టెంబర్ 2018 నాటికి కంపెనీ రూ. 8,000 కోట్లను సేకరించింది. OYO రూమ్స్ భారతదేశపు అతిపెద్ద హోటల్ నెట్‌వర్క్‌గా అవతరించింది.

భారతదేశం వెలుపల OYO రూమ్స్ అడుగుజాడలు OYO రూమ్స్ విజయగాథ భారతదేశం సరిహద్దులను దాటి వెళ్ళింది. 2016లో హోటల్ చైన్ 10 లక్షల చెక్-ఇన్‌ల మైలురాయిని చేరుకున్నారు. మలేషియాకు కార్యకలాపాలను విస్తరించారు. మరుసటి సంవత్సరం నేపాల్‌లో కూడా ఓయో రూమ్స్ ప్రారంభించడంతో దక్షిణాసియాలో కంపెనీ మరింత సుస్థిరమైంది. 2018లో UK, UAE, దుబాయ్, చైనా, సింగపూర్, ఇండోనేషియాలో కార్యకలాపాలను ప్రారంభించింది. 2019 నాటికి, OYO రూమ్స్ ప్రపంచవ్యాప్తంగా 500 ప్రదేశాలలో 330,000 కంటే ఎక్కువ గదులను కలిగి ఉంది. ఇది నాయకత్వం, సామ్రాజ్య వృద్ధికి అగర్వాల్ అసాధారణ సామర్థ్యాన్ని తెలియజేస్తుంది.

ఓయో వ్యవస్థాపకుడు , సీఈఓ రితేష్ అగర్వాల్ వ్యాపారం వృద్ధిలో కీలక పాత్ర పోషించారు. ప్రపంచంలోని అతిపెద్ద హోటల్ నెట్‌వర్క్‌లలో ఒకటైన ఓయో ప్రపంచవ్యాప్తంగా విస్తరించింది ఆతిథ్య రంగానికి  సరికొత్త దారులు చూపించింది. ట్రావెల్ , హాస్పిటాలిటీ పరిశ్రమలలో ముఖ్యమైన స్థానాన్ని ఓయో సొంతం చేసుకుంది. దీనికి కారణం రితేష్ వ్యూహాత్మక దృష్టి , ఎక్సలెన్స్ కోసం నిరంతరాయంగా  పడిన శ్రమకు తగిన ఫలితం.. నేటి ఈ సక్సెస్

మరిన్ని హ్యూమన్ ఇంట్రెస్ట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

ఆర్మీ యూనిఫాంలో ప్రధాని మోదీ దీపావళి..!
ఆర్మీ యూనిఫాంలో ప్రధాని మోదీ దీపావళి..!
ముచ్చింతల్‌లో అంబరాన్నంటిన దీపావళి సంబరాలు.. సమతామూర్తి ప్రాంగణం
ముచ్చింతల్‌లో అంబరాన్నంటిన దీపావళి సంబరాలు.. సమతామూర్తి ప్రాంగణం
మేం ముంబైకి వెళ్లిపోయింది అందుకే.! జ్యోతిక పై సూర్య కామెంట్స్.
మేం ముంబైకి వెళ్లిపోయింది అందుకే.! జ్యోతిక పై సూర్య కామెంట్స్.
మతిపోయే థ్రిల్లర్ మూవీ.! శవంతో రొమాన్స్.! ఇదేం అరాచకం..
మతిపోయే థ్రిల్లర్ మూవీ.! శవంతో రొమాన్స్.! ఇదేం అరాచకం..
తప్పుడు కేసులో దొరికి.. చేజేతులారా కెరీర్‌ను నాశనం చేసుకుంది.!
తప్పుడు కేసులో దొరికి.. చేజేతులారా కెరీర్‌ను నాశనం చేసుకుంది.!
నాదే లేట్‌.! అయినా ప్రభాస్‌ అర్థరాత్రి వరకు నా కోసం వెయిట్ చేశాడు
నాదే లేట్‌.! అయినా ప్రభాస్‌ అర్థరాత్రి వరకు నా కోసం వెయిట్ చేశాడు
బంగారం.. ఎప్పుడు కొంటే మంచిది.? పక్క దేశాల ప్రభావం మన దగ్గర కూడా.
బంగారం.. ఎప్పుడు కొంటే మంచిది.? పక్క దేశాల ప్రభావం మన దగ్గర కూడా.
హీరో 100 కోట్ల కల.. నెరవేరితే ఆ తెలుగు ప్రొడ్యూసర్ ఫోటో ఆయన ఇంట్ల
హీరో 100 కోట్ల కల.. నెరవేరితే ఆ తెలుగు ప్రొడ్యూసర్ ఫోటో ఆయన ఇంట్ల
AA చేతిలో చరణ్ గేమ్‌ ఛేంజర్‌ మూవీ.! చెర్రీ కెరియర్ లో హయ్యస్ట్..
AA చేతిలో చరణ్ గేమ్‌ ఛేంజర్‌ మూవీ.! చెర్రీ కెరియర్ లో హయ్యస్ట్..
దర్శన్‌కు బెయిల్‌.! రేణుకా స్వామి తండ్రి షాకింగ్ రియాక్షన్..
దర్శన్‌కు బెయిల్‌.! రేణుకా స్వామి తండ్రి షాకింగ్ రియాక్షన్..