Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

WHO: ప్రపంచ ఆరోగ్య సంస్థ తాజా హెచ్చరిక.. మనుషులపై దాడికి సిద్ధమైన మరో వైరస్‌..!

సాధారణంగా ఏవియన్‌ ఇన్‌ఫ్లూయెవజీ వైరస్‌లు పక్షుల్లో వ్యాపిస్థాయి. అయితే, వాటిలో ఒకటైన బర్డ్‌ఫ్లూ కారక హెచ్‌5ఎన్‌1 ఏవియన్‌ ఇన్‌ఫ్లూయెంజాను ఇటీవలి కాలంలో క్షీరదాల్లోనూ గుర్తించారు. దాదాపు మనుషులకూ సులువుగా సంక్రమించేలా క్షీరదాల్లో ఈ వైరస్‌ రూపాంతరం చెందే ముప్పుందని డబ్ల్యూహెచ్‌వో బుధవారం ఒక ప్రకటనలో పేర్కొంది.

WHO: ప్రపంచ ఆరోగ్య సంస్థ తాజా హెచ్చరిక.. మనుషులపై దాడికి సిద్ధమైన మరో వైరస్‌..!
Bird Flu
Follow us
Jyothi Gadda

|

Updated on: Jul 14, 2023 | 8:35 AM

ప్రపంచ ఆరోగ్య సంస్థ( డబ్ల్యూహెచ్‌వో)ఆందోళనకరమైన హెచ్చరిక జారీ చేసింది. ప్రాణాంతకమైన కరోనా వైరస్ మహమ్మారి భయాందోళనల నుండి ప్రపంచం కోలుకుంటున్న తరుణంలో కొనసాగుతున్న ‘బర్డ్ ఫ్లూ’ వ్యాప్తి గురించి WHO బుధవారం ఆందోళనకరమైన హెచ్చరికలు జారీ చేసింది. ఇటీవలి బర్డ్ ఫ్లూ వ్యాప్తి మానవులకు సులభంగా సోకుతుందని హెచ్చరించింది. కొంతకాలంగా క్షీరదాల్లో బర్డ్‌ఫ్లూ కేసులు తరచూ వెలుగుచూస్తుండటంపై WHO ఆందోళన వ్యక్తం చేసింది. క్రమేణ మానవులకు సోకేలా బర్డ్‌ఫ్లూ వైరస్‌ రూపాంతరం చెందే ముప్పు ఉందంటూ WHO హెచ్చరించింది.

సాధారణంగా ఏవియన్‌ ఇన్‌ఫ్లూయెవజీ వైరస్‌లు పక్షుల్లో వ్యాపిస్థాయి. అయితే, వాటిలో ఒకటైన బర్డ్‌ఫ్లూ కారక హెచ్‌5ఎన్‌1 ఏవియన్‌ ఇన్‌ఫ్లూయెంజాను ఇటీవలి కాలంలో క్షీరదాల్లోనూ గుర్తించారు. దాదాపు మనుషులకూ సులువుగా సంక్రమించేలా క్షీరదాల్లో ఈ వైరస్‌ రూపాంతరం చెందే ముప్పుందని డబ్ల్యూహెచ్‌వో బుధవారం ఒక ప్రకటనలో పేర్కొంది. కొన్ని క్షీరదాల్లో ఇన్‌ఫ్లూయెంజా వైరస్‌లు, కలగవలిసి,మానవులు, జంతువులకు హాని కలిగించేలా కొత్త వైరస్‌లు పుట్టుకొచ్చే అవకాశాలు ఉన్నాయని కూడా తెలిపింది.

ఇవి కూడా చదవండి

క్షీరదాలలో ప్రాణాంతక వ్యాప్తికి సంబంధించిన నివేదికలు పెరుగుతున్నాయని WHO పునరుద్ఘాటించింది. WHO ప్రకారం.. మూడు ఖండాలలోని దాదాపు 10 దేశాలు 2022 నుండి క్షీరదాలలో బర్డ్ ఫ్లూ వ్యాప్తి చెందాయని నివేదించాయి. స్పెయిన్, యుఎస్, పెరూ, చిలీ, వంటి దేశాలలో వ్యాప్తి చెందడం వల్ల భూమి, సముద్ర క్షీరదాలు రెండూ ప్రభావితమయ్యాయని అంతర్జాతీయ సంస్థ వెల్లడించింది. H5N1 వైరస్‌లు అనేక దేశాలలో పిల్లులు, కుక్కలు వంటి పెంపుడు జంతువులలో కూడా కనిపించాయని చెప్పింది. ఇటీవలి కాలంలో పిల్లులలో H5N1 గుర్తించబడినట్లు పోలాండ్‌లోని అధికారులు ప్రకటించారు.

మరిన్ని జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి..