AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Telangana: రికార్డు సృష్టిస్తోన్న పచ్చ బంగారం.. క్వింటా ధర తెలిస్తే పండగే..!

నిజామాబాద్, జగిత్యాల, నిర్మల్‌ జిల్లాల్లో సుమారు 50వేల ఎకరాల్లో ఉండే పసుపు సాగు ఈ సారి 32వేల ఎకరాలకే పరిమితమైంది. దిగుబడి తగ్గడంతో ప్రస్తుతం ధర పెరిగింది. గత జనవరి నెలాఖరులో ప్రారంభమైన పసుపు కొనుగోళ్లు ఏప్రిల్‌ వరకు కొనసాగాయి. ఈ సీజన్‌లో కొమ్ము గరిష్ట ధర రూ. 7,800లోపే పలికింది. తాజాగా

Telangana: రికార్డు సృష్టిస్తోన్న పచ్చ బంగారం.. క్వింటా ధర తెలిస్తే పండగే..!
Turmeric Price
Jyothi Gadda
|

Updated on: Jul 14, 2023 | 1:11 PM

Share

పచ్చబంగారం పండిస్తున్న రైతన్న సంతోషం వ్యక్తం చేస్తున్నాడు. ఎట్టకేలకు గిట్టుబాటు ధర పలకడంతో రైతు కళ్లల్లో ఆనందం కనిపించింది. నిజామాబాద్‌ మార్కెట్‌లో పసుపు ధర రికార్డులు సృష్టిస్తోంది. క్వింటా పసుపు ధర 10 వేల మార్క్‌ను దాటింది. దీంతో కోల్డ్ స్టోరేజీలో నిల్వచేసుకున్న రైతుల పంట పడుతోంది. ముందే పంటను అమ్ముకున్న రైతులు నిరాశ చెందుతున్నారు. నిజిమాబాద్‌ వ్యవసాయ మార్కెట్ యార్డులో పసుపు పంటకు ఈ సీజన్‌లోనే రికార్డు స్థాయి ధర లభించింది.

గురువారం నిజామాబాద్‌ జిల్లా అంకాపూర్‌ గ్రామానికి చెందిన రైతు మధసూధన్‌ రెడ్డి మార్కెట్‌కు 38 క్వింటాళల్ పసుపు పంటను తరలించాడు. కమీషన్‌ ఏజెంటు హన్మంతరావు అండ్‌ కంపెనీ కొనుగోలు చేశారు. ఇదే రైతు తీసుకొచ్చిన పసుపు మండ రకానికి క్వింటాకు రూ.9,211లుగా ధర పలికింది.

గత జనవరి నెలాఖరులో ప్రారంభమైన పసుపు కొనుగోళ్లు ఏప్రిల్‌ వరకు కొనసాగాయి. ఈ సీజన్‌లో కొమ్ము గరిష్ట ధర రూ. 7,800లోపే పలికింది. తాజాగా రూ. 10,116 ధర పలకడం విశేషం. నిజామాబాద్, జగిత్యాల, నిర్మల్‌ జిల్లాల్లో సుమారు 50వేల ఎకరాల్లో ఉండే పసుపు సాగు ఈ సారి 32వేల ఎకరాలకే పరిమితమైంది. దిగుబడి తగ్గడంతో ప్రస్తుతం ధర పెరిగింది.

ఇవి కూడా చదవండి

మరిన్ని తెలంగాణ న్యూస్ కోసం క్లిక్ చేయండి..

12 వికెట్లతో రప్ఫాడించిన రూ. 8.40 కోట్ల ఐపీఎల్ సెన్సేషన్.. ఎవరంటే
12 వికెట్లతో రప్ఫాడించిన రూ. 8.40 కోట్ల ఐపీఎల్ సెన్సేషన్.. ఎవరంటే
కేసీఆర్ ను తిట్టుడు తప్ప రెండేళ్లలో రేవంత్ చేసిందేంటి
కేసీఆర్ ను తిట్టుడు తప్ప రెండేళ్లలో రేవంత్ చేసిందేంటి
అంబటిపై బిగుస్తున్న ఉచ్చు! గుంటూరు కోర్టులో నేడు కీలక పరిణామాలు
అంబటిపై బిగుస్తున్న ఉచ్చు! గుంటూరు కోర్టులో నేడు కీలక పరిణామాలు
ప్రపంచ పటంలో మహిళ పేరుతో నిలిచిన ఏకైక దేశం..ఎక్కడా లేని ప్రత్యేకత
ప్రపంచ పటంలో మహిళ పేరుతో నిలిచిన ఏకైక దేశం..ఎక్కడా లేని ప్రత్యేకత
శ్రీవారి భక్తులకు గుడ్‌న్యూస్.. క్యాష్‌ లేకున్నా లడ్డూ పొందొచ్చు!
శ్రీవారి భక్తులకు గుడ్‌న్యూస్.. క్యాష్‌ లేకున్నా లడ్డూ పొందొచ్చు!
వందేళ్ల తర్వాత అరుదైన యోగం.. ఈ రాశులది మామూలు అదృష్టం కాదు..
వందేళ్ల తర్వాత అరుదైన యోగం.. ఈ రాశులది మామూలు అదృష్టం కాదు..
చర్మంపై ఈ లక్షణాలు కనిపిస్తే బాడీలో కొలెస్ట్రాల్ పెరిగినట్లే..
చర్మంపై ఈ లక్షణాలు కనిపిస్తే బాడీలో కొలెస్ట్రాల్ పెరిగినట్లే..
బాస్మతి రైస్ వండేటప్పుడు ఈ తప్పులు అస్సలు చేయకండి?
బాస్మతి రైస్ వండేటప్పుడు ఈ తప్పులు అస్సలు చేయకండి?
19 ఏళ్ల వయసులో తల్లిగా నటించింది.. 42 ఏళ్ల వయసులో టాప్ హీరోయిన్.
19 ఏళ్ల వయసులో తల్లిగా నటించింది.. 42 ఏళ్ల వయసులో టాప్ హీరోయిన్.
సూర్యతో షేక్‌హ్యాండ్.. మరీ ఇది పర్సనల్.! పాక్ గొంతెమ్మ కోరికలు
సూర్యతో షేక్‌హ్యాండ్.. మరీ ఇది పర్సనల్.! పాక్ గొంతెమ్మ కోరికలు