AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Pet Dog: పెంపుడు కుక్కకు ప్రతి ఏడాది వర్ధంతి.. ఏడాదికి ఒక్కసారి వీధి కుక్కలకు బిర్యానీ దానం.. ఎక్కడంటే..

పెంపుడు కుక్క కు ప్రేమతో వర్ధంతి చేయడం వర్ధంతి రోజున వీధి కుక్కలకు చికెన్ బిర్యానీ విందు ఏర్పాటు చేయడం చూసారా మీరు.. అయితే ఈ అరుదైన ఘటనకు వేదికగా ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా నిలిచింది. జిల్లాలోని పాలకొల్లు లో గాదె వెంకన్న అనే వ్యాపార వేత్త ఎంతో అల్లారు ముద్దుగా జర్మన్ షెపర్డ్ జాతికి చెందిన కుక్కను సీజర్ అని పేరు పెట్టుకుని పెంచుకునే వారు.

Pet Dog: పెంపుడు కుక్కకు ప్రతి ఏడాది వర్ధంతి.. ఏడాదికి ఒక్కసారి వీధి కుక్కలకు బిర్యానీ దానం.. ఎక్కడంటే..
Dog Death Anniversary
B Ravi Kumar
| Edited By: Ravi Kiran|

Updated on: Jul 14, 2023 | 12:51 PM

Share

ఆత్మీయులు దూరమైతే ఆ బాధను జీర్ణించుకోవడం చాలా కష్టం. వారిని స్మరిస్తూ పోయిన రోజున కార్యక్రమాలు చేసి అనాధలకు వారి ఆత్మశాంతి కోసం అన్నదానం చేయటం పూర్వం నుంచి వస్తున్న ఆచారం. పెంపుడు జంతువుల. పుట్టిన రోజులు, వాటి పిల్లలకు బారసాల వంటి కార్యక్రమాలు చేస్తున్నవారు లేక పోలేదు. వీటిని మనం మూగజీవాలు పట్ల వాటి యజమానులకు ఉన్న ఆపేక్ష గా మనం చెప్పుకోవచ్చు. తాజాగా ఓ వ్యక్తి వీధి కుక్కలకు బిర్యాని ప్రేమ గా వడ్డించాడు. అవి తింటూ ఉంటే అతడికి చెప్పలేని ఆనందం కళ్లలో మెరుపు తో కొట్టు వచ్చినట్లు కన్పించింది. అయితే ఆ వ్యక్తి ఇంతకీ కుక్కలకు బిర్యాని దానం ఎందుకు చేశాడు.. ఈ వింత ఘటన ఎక్కడ జరిగిందో తెలుసుకుందాం..

పెంపుడు కుక్క కు ప్రేమతో వర్ధంతి చేయడం వర్ధంతి రోజున వీధి కుక్కలకు చికెన్ బిర్యానీ విందు ఏర్పాటు చేయడం చూసారా మీరు.. అయితే ఈ అరుదైన ఘటనకు వేదికగా ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా నిలిచింది. జిల్లాలోని పాలకొల్లు లో గాదె వెంకన్న అనే వ్యాపార వేత్త ఎంతో అల్లారు ముద్దుగా జర్మన్ షెపర్డ్ జాతికి చెందిన కుక్కను సీజర్ అని పేరు పెట్టుకుని పెంచుకునే వారు. సీజర్ వెంకన్న కుటుంబంలో సభ్యుడుగా తన యజమాని పట్ల ఎంతో విశ్వాసంగా ప్రేమగా ఉండేది. అనారోగ్య కారణాలతో సీజర్ ఐదు సంవత్సరాలు క్రితం మరణించింది. సీజర్ మరణం తో ఎంతో దుఖించిన యజమాని కుటుంబం తమ పెంపుడు కుక్క సీజర్ ను స్మరించుకుంటూ ప్రతి సంవత్సరం చనిపోయిన రోజున వర్ధంతి కార్యక్రమం చేస్తున్నారు యజమాని వెంకన్న సీజర్ వర్ధంతి రోజున ఊర్లో ఉన్న కుక్కలు అన్నింటికీ చికెన్ బిర్యానీ తో భోజనం పెడుతున్నారు. గత ఐదు సంవత్సరాలుగా తమ పెంపుడు శునకం సీజర్ కు వర్ధంతి జరుపుతున్నామని ఆ రోజున వీధి కుక్కలకు మంచి ఆహారం అందిస్తున్నట్లు తెలిపారు శునకం యజమాని వెంకన్న. వేమన జయంతి రోజు తణుకు నియోజకవర్గం లోని అత్తిలి మండలం ఆరవల్లిలో ఊరిలోని కుక్క లన్నింటికి అన్నదానం చేస్తారు స్థానికులు. ఇలా నిత్యం మూగజీవాలు పట్ల ప్రేమను ప్రదర్శించి నీరు , ఆహారం అందిస్తే అవి ఆరోగ్యం గా సంచరించటంతో పాటు మనుషులపై దాడి చేసే ఘటనలు జరగవంటున్నాయి జీవకారుణ్య సంస్థలు.

ఇవి కూడా చదవండి

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..