AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Hariyali Amavasya: శ్రావణ అమావాస్య రోజున ఏ మొక్కలు నాటడం శుభప్రదం.. ఏ మొక్కలు నాటడం వలన నష్టాల్లో తెలుసుకోండి..

ఈ అమావాస్యను ఉత్తరాదివారు శ్రావణి అమావాస్య అని కూడా అంటారు. ఈ రోజున శివ పార్వతులను పూజించి, అవసరమైన వారికి దానం చేయడం విశేష ఫలితాలను ఇస్తుందని విశ్వాసం. ఈ ఏడాది హరియాళీ అమావాస్య జూలై 16న రాత్రి 10.08 గంటలకు ప్రారంభమై జూలై 17న అర్ధరాత్రి 12.01 గంటలకు ముగుస్తుంది

Hariyali Amavasya: శ్రావణ అమావాస్య రోజున ఏ మొక్కలు నాటడం శుభప్రదం.. ఏ మొక్కలు నాటడం వలన నష్టాల్లో తెలుసుకోండి..
Hariyali Amavasya
Surya Kala
|

Updated on: Jul 14, 2023 | 11:50 AM

Share

హిందూ సనాతన ధర్మంలో అమావాస్యకు విశేష ప్రాముఖ్యత ఉంది. ముఖ్యంగా ఆషాడ మాసం వెళ్లి.. శ్రావణ మాసంలోకి అడుగు పెట్టె అమావాస్య రోజున హరియాళీ అమావాస్యగా జరుపుకుంటారు. ఈ రోజున శివుడిని పూజిస్తారు. ఈ రోజున ఏ భక్తుడైనా శివుడిని హృదయపూర్వకంగా ఆరాధిస్తే, కోరిన కోరికలు నెరవేరుతాయని నమ్ముతారు. ఈ అమావాస్యను ఉత్తరాదివారు శ్రావణి అమావాస్య అని కూడా అంటారు. ఈ రోజున శివ పార్వతులను పూజించి, అవసరమైన వారికి దానం చేయడం విశేష ఫలితాలను ఇస్తుందని విశ్వాసం. ఈ ఏడాది హరియాళీ అమావాస్య జూలై 16న రాత్రి 10.08 గంటలకు ప్రారంభమై జూలై 17న అర్ధరాత్రి 12.01 గంటలకు ముగుస్తుంది.

హరియాళీ అమావాస్య రోజున మొక్కలు నాటడానికి ప్రత్యేక ప్రాముఖ్యత ఉంది. ఈ రోజున ఎక్కువ మొక్కలు నాటడం ద్వారా ప్రతి కోరిక నెరవేరుతుందని మరియు శివుని అనుగ్రహం లభిస్తుందని విశ్వాసం. అయితే ఈ అమావాస్య రోజున కొన్ని చెట్లను నాటడం చాలా శుభప్రదంగా పరిగణించబడుతుంది. అదే సమయంలో కొన్ని చెట్లను నాటడం అశుభకరంగా పరిగణించబడుతుంది. ఈ నేపథ్యంలో హరియాళీ అమావాస్య రోజున తప్పనిసరిగా నాటవలసిన చెట్ల.. నాటకూడని చెట్ల గురించి తెలుసుకుందాం…

హరియాళీ అమావాస్య నాడు ఇంట్లో నాటాల్సి మొక్కలు  హరియాళీ అమావాస్య రోజున తులసి మొక్కను నాటడం చాలా పవిత్రమైనదిగా పరిగణించబడుతుంది. ఇలా చేయడం వల్ల ఇంట్లో లక్ష్మీదేవి కొలువై ఉంటుంది.

ఇవి కూడా చదవండి

హరియాళీ అమావాస్య రోజున ఇంటి ప్రధాన ద్వారం వద్ద ఫెర్న్ మొక్కను నాటడం కూడా చాలా పవిత్రమైనదిగా భావిస్తారు. దీనివల్ల అదృష్టం కలుగుతుందని, ఇంట్లో సానుకూల శక్తి ప్రసరిస్తుందని నమ్మకం.

ఈ రోజు మనీ ప్లాంట్ నాటడం కూడా చాలా మంచిది. ఇది కుటుంబంలో సంతోషాన్ని పెంపొందిస్తుంది. ఇంట్లో సంపద సుఖ సంతోషాలను తెస్తుంది.

హరియాళీ అమావాస్య రోజున జమ్మి మొక్కను నాటడం కూడా చాలా శ్రేయస్కరం. ఈ మొక్క శివునికి కూడా చాలా ప్రీతికరమైనది. అటువంటి పరిస్థితిలో ఈ మొక్క ఉన్న ఇల్లు ఆనందం, సంపద, శాంతి  ఉంటుంది.

హరియాళీ అమావాస్య నాడు ఏ మొక్కలు నాటకూడదంటే..

ఇంట్లో రావి చెట్టును అస్సలు నాటకూడదు. దీనికి ప్రధాన కారణం కూడా దీని మూలాలు చాలా దూరం వ్యాపించి, ఇంటి పునాదిని బలహీనపరుస్తుంది.

ఇంట్లో రేగు చెట్టును కూడా పెంచకూడదు. దీంతో ఆర్థిక సమస్యలు పెరుగుతాయి.

ఇంటి చుట్టూ గోరింట, తాటి, పత్తి చెట్లను నాటకూడదు. దీంతో ఇంట్లో కష్టాలు పెరుగుతాయి.

మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Note: (ఇక్కడ ఇచ్చిన సమాచారం నమ్మకం మీద ఆధారపడి ఉంటుంది.. దీనికి శాస్త్రీయ ఆధారాలు లేవు. మనుషుల ఆసక్తిని నమ్మకాన్ని దృష్టిలో ఉంచుకుని ఇక్కడ అందించాం).