Khammam: వేటగాళ్ల ఉచ్చుకి చిక్కి.. ప్రాణాలతో బయటపడ్డ దుప్పి.. గాయాలకు చికిత్సనందిస్తున్న అధికారులు

పట్టణవాసులకు ఆహ్లాదం అందించడంతో పాటు వన్య ప్రాణుల సంరక్షణ బాధ్యత గా అర్బన్ పార్క్ ను అటవీ శాఖ అధికారులు పర్యవేక్షణ చేయాల్సి ఉంది. ఈ నేపధ్యంలో అటవీ శాఖ అధికారులు నిర్లక్షం కారణంగా దుప్పులు మృత్యు వాత పడుతున్నాయి. కొందరు గుర్తు తెలియని దుండగులు రాత్రి వేళలో అర్బన్ పార్క్ లోకి ప్రవేశించి జంతువులను వేటాడేందుకు ఉచ్చులు పెడుతున్నారు

Khammam: వేటగాళ్ల ఉచ్చుకి చిక్కి.. ప్రాణాలతో బయటపడ్డ దుప్పి.. గాయాలకు చికిత్సనందిస్తున్న అధికారులు
Khammam
Follow us

| Edited By: Surya Kala

Updated on: Jul 14, 2023 | 10:34 AM

అడవుల సంరక్షణబాధ్యత తో పాటుగా వన్య ప్రాణులను కాపాడాల్సిన అటవీ అధికారుల నిర్లక్ష్యం కారణంగా వన్య ప్రాణులు ప్రాణాలు కోల్పోతున్నాయి. ఖమ్మం జిల్లా సత్తుపల్లి పట్టణంలో 126 హెక్టార్ల అటవీ భూమిలో కోట్లాది రూపాయలు ఖర్చు చేసి అర్బన్ పార్క్ ఏర్పాటు చేశారు. పట్టణవాసులకు ఆహ్లాదం అందించడంతో పాటు వన్య ప్రాణుల సంరక్షణ బాధ్యత గా అర్బన్ పార్క్ ను అటవీ శాఖ అధికారులు పర్యవేక్షణ చేయాల్సి ఉంది.

ఈ నేపధ్యంలో అటవీ శాఖ అధికారులు నిర్లక్షం కారణంగా దుప్పులు మృత్యు వాత పడుతున్నాయి. కొందరు గుర్తు తెలియని దుండగులు రాత్రి వేళలో అర్బన్ పార్క్ లోకి ప్రవేశించి జంతువులను వేటాడేందుకు ఉచ్చులు పెడుతున్నారు. ప్రమాదవశాత్తు నిన్న సాయంత్రం రెండేళ్ల వయసున్న దుప్పి ఉచ్చు లో చిక్కుకుని తీవ్రంగా గాయపడి ప్రాణాలతో తప్పించుకుని జనావాసంలోకి వచ్చింది. తీవ్ర గాయాలతో రక్త స్రావం అవుతున్న దుప్పి ను చూసిన స్థానికులు అటవీ శాఖ అధికారులు కు సమాచారం ఇవ్వడంతో అర్బన్ పార్క్ కు తరలించి చికిత్స అందించారు. ప్రస్తుతానికి దుప్పి ఆరోగ్యం బాగానే ఉన్నప్పటికీ తరచుగా అర్బన్ పార్క్ లోని వన్య ప్రాణులు కుక్కల దాడి కు గురై,వేటగాళ్ల ఉచ్చులు కు గురై,కుక్కల దాడికి గురై ప్రాణాలు కోల్పోతున్నాయి. ఏది ఏమైనా ఫారెస్ట్ అధికారులు నిర్లక్ష్యం కారణంగా వన్య ప్రాణులు బలవుతున్నాయని స్థానికులు ఆరోపిస్తున్నారు.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

ఇవి కూడా చదవండి