Hyderabad: పెళ్లికి ఒప్పుకోలేదని యువతి ఆత్మహత్య.. సూసైడ్ స్పాట్‌గా మారుతున్న దుర్గం చెరువు కేబుల్ బ్రిడ్జ్..
Hyderabad Cable Bridge: హైదరాబాద్‌లోని పర్యాటక ప్రాంతాల్లో ఒకటిగా పేరున్న దుర్గం చెరువు కేబుల్ బ్రిడ్జ్ ఇప్పుడు సూసైడ్ స్వాట్‌గా మారిపోతోంది. 2020లో ప్రారంభమైన కేబుల్ బ్రిడ్జ్ మీద నుంచి దూకి ఇప్పటివరకు 30 మంది వరకు ఆత్మహత్య చేసుకున్నట్లు లెక్కలు..
Hyderabad Cable Bridge: హైదరాబాద్‌లోని పర్యాటక ప్రాంతాల్లో ఒకటిగా పేరున్న దుర్గం చెరువు కేబుల్ బ్రిడ్జ్ ఇప్పుడు సూసైడ్ స్వాట్‌గా మారిపోతోంది. 2020లో ప్రారంభమైన కేబుల్ బ్రిడ్జ్ మీద నుంచి దూకి ఇప్పటివరకు 30 మంది వరకు ఆత్మహత్య చేసుకున్నట్లు లెక్కలు చెబుతున్నాయి. 24 గంటల పోలీస్ పహారా, సీసీ కెమెరాలు ఉన్నప్పటికీ కేబుల్ బ్రిడ్జ్ మీద సూసైడ్ చేసుకున్న ఘటనలు జరుగుతుండడం విచారకరం.
గురువారం మధ్యాహ్నం కూడా పాయల్(17) అనే యువతి కేబుల్ బ్రిడ్జ్‌పై నుంచి నీటిలో దూకి సూసైడ్ చేసుకుంది. సంఘటనా స్థలంలోనే ఉన్న పాయల్ స్నేహితురాలు భాగ్యశ్రీ వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ మేరకు దుర్గం చెరువులో ఎన్‌డీఆర్ఎఫ్ టీమ్ సహాయంతో మాధాపూర్ పోలీసులు పాయల్ మృతదేహం కోసం గాలింపు చర్యలు చేపట్టారు.
కాగా, కర్ణాటక రాష్ట్రంలోని గుల్బర్గాకు చెందిన పాయల్.. మాధపూర్‌లోని డీమార్ట్ వెనక ఓ ఇంట్లో హౌస్‌మేడ్‌గా పాయల్ పని చేస్తుంది. పాయల్ ఓ యువకుడిని గాఢంగా ప్రేమించిందని, వారి ప్రేమను ఆమె కుటుంబసభ్యులు ఒప్పుకోలేదని తెలుస్తోంది. ఈ కారణంగానే పాయల్ ఆత్మహత్య చేసుకుని ఉంటుందని పోలీసులు అనుమానిస్తున్నారు.
మరిన్ని తెలంగాణ న్యూస్ కోసం క్లిక్ చేయండి..